మనసులో అనుభూతులను అందంగా చెప్పాలి-నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు అక్షర రూపం ఈ నా ప్రయత్నం.(మామూలు మాటల్లో చెప్పాలంటే నా డైరీలోని పెజీలు ఇలా మీ ముందు ఉంచబడ్డాయి). ఆ వాగ్దేవి కటాక్షం ఉన్నన్నాళ్ళూ సాగుతుంది ఇది. వాదనకు-చర్చకూ తేడా తెలిసిన సద్విమర్సకులకు సర్వదా స్వాగతం. 11/3/11 Somethings are between me and my maker అన్న మహానుభావుడి పాదాలనుగమిస్తూ ఇక్కడ నా కొన్ని పార్శ్వాలు మాత్రమె బహిర్గతం ఇప్పటినుండి. ఇవి చదివి నేను అర్థమయ్యాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే :-)
Friday, 20 January 2012
ఒట్టి కుండను కదూ
చెమ్మగిల్లి ముద్దముద్దయి
నిరాకృతమయే నిశిలోనే
నేను విస్ఫష్టం
పొద్దు పొడిస్తే చాలు
వేల రూపదాతలు
చుట్టూ మూగి
నా మంచికే అంటూ
పలుచన చెసి
వేళ్ళు దోపి మరీ
పెద్ద కవాటం పెట్టి
వారిచ్చగా మలచుకుని
నా బలిమికేనంటూ
కచ్చగా కాల్చి
ఆనందిస్తారు.
నమ్మ్మబుధ్ధవనిదేమంటే
ప్రతీ పొద్దుకీ
మళ్ళీ ముద్దవుతొందేనని
శంకెవరికీ రాకపోవటం.
ఒట్టి కుండను కదూ...........
Pic from http://upload.wikimedia.org/wikipedia/commons/2/2f/Makingpottery.jpg
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment