అలా అలా.... పైపైన
తేలుతూ పొతే
ఎంత సులువో......
ఎంత ఆనందమో.....
లోతు చూద్దామని పరికిస్తే
అబ్బ....అబ్బబ్బ....
ఎంత శ్రమ!
పైగా శోధన చివరకు మిగిలేది
మనసుకు చురకే....
పైపైన తేలావు
లోనేందుకు మునగలేదని.
మరి లోతుల్లో
వింతలెన్నో అపుడే కదా అవగతమయింది!
అయినా మానస వనచరవరము
కుదురులేని గెంతులేస్తూనే ఉంటుంది.
దాన్ని లోతుల్లో ముంచాలంటే
మీరే ఏదో ఒక లంగరు వెయ్యాలి....ఈ కవితార్ణవంలో.
Wednesday, 8 April 2009
వడ్డించిన విస్తరాకు.
పంచభక్షాలు, అమృత పాయసాలు
శాఖపాకాలన్నీ మోసుకొచ్చాక తెలిసింది
కక్కా ముక్కా ఉంటే కాని తనకు ముద్ద దిగదని
తన అభిరుచే వేరని.
అన్నీ మోసుకొచ్చిన నేను
ధీనంగా చూస్తున్నా చేసేదేమీ లేక
విధి బలంగా గిరాటేస్తే
బయటకొచ్చి పడ్డా......
దారిన పోయే వారంతా
ఆబగా చూసే వారే కాని
చే సాయం చేసే వారే
కరువై పాయె.......
ఇంతలొ ఎప్పటి వాడో
ఆ నిరుపేద నేస్తం
ఎపుడో నా తయారీలో
పుల్లలమర్చిన నేస్తం......
ఎలా పునః పరిచయమయ్యాడో
నాకే తెలీదు....
ఎంత ఆకలిగొన్నాడో
ఏనాడు తిన్నాడో...........
ఆత్రంగా అందుకున్నాడు
దోసిట పదిలం చేసుకున్నాడు
పంచభక్షాలు పాయసాలు అందించిన
నీవూ ప్రియ నేస్తానివే అంటూ
భద్రంగా దాచుకున్నాడు.....
ఈ నా నేస్తం .....
నన్నెంత అపురూపంగా చూసుకున్నాడంటే
నాలోని షడ్రుచులన్నీ జుర్రుకుంటుంటే
జన్మ సార్ధకత స్వానుభవమయింది.
ఇంతలొ ఎక్కడివో పాడు కుక్కలు
వీధినున్న నన్ను
వీధిన పడినదనుకొని
చింపటానికి కాట్లాడుతున్నాయి...కాలు దువ్వుతున్నాయి!
నా ప్రియ నేస్తం
ఆత్రత, ఆబ చూసాయేమో
బక్క చిక్కినోడు వీడేం కాస్తాడు
అనుకున్నట్టు ఒక్కసారి చుట్టూ మూగాయి.
వాటికేం తెలుసు పాపం
సృష్టిలోని ప్రత్యల్పానికీ
గుర్తింపు, కర్మ సాఫల్యత
ఎంత బలాన్నిస్తుందో.....
మూకుమ్మడిగా వచ్చి పడ్డాయి
మూతులు పెట్టి చింప చూసాయి
ఇప్పటి నా సబలత్వానికి నిదర్శనంగా
ముళ్ళు గుచ్చుకొని కుర్రో మొయ్యోమని పోయాయి.
అవును మరి
నేనిప్పుడు విసిరేయబడ్డ విస్తరాకును కాను
సార్ధకమైన అన్నపూర్ణను...ఒకరికి అమ్మను.
శాఖపాకాలన్నీ మోసుకొచ్చాక తెలిసింది
కక్కా ముక్కా ఉంటే కాని తనకు ముద్ద దిగదని
తన అభిరుచే వేరని.
అన్నీ మోసుకొచ్చిన నేను
ధీనంగా చూస్తున్నా చేసేదేమీ లేక
విధి బలంగా గిరాటేస్తే
బయటకొచ్చి పడ్డా......
దారిన పోయే వారంతా
ఆబగా చూసే వారే కాని
చే సాయం చేసే వారే
కరువై పాయె.......
ఇంతలొ ఎప్పటి వాడో
ఆ నిరుపేద నేస్తం
ఎపుడో నా తయారీలో
పుల్లలమర్చిన నేస్తం......
ఎలా పునః పరిచయమయ్యాడో
నాకే తెలీదు....
ఎంత ఆకలిగొన్నాడో
ఏనాడు తిన్నాడో...........
ఆత్రంగా అందుకున్నాడు
దోసిట పదిలం చేసుకున్నాడు
పంచభక్షాలు పాయసాలు అందించిన
నీవూ ప్రియ నేస్తానివే అంటూ
భద్రంగా దాచుకున్నాడు.....
ఈ నా నేస్తం .....
నన్నెంత అపురూపంగా చూసుకున్నాడంటే
నాలోని షడ్రుచులన్నీ జుర్రుకుంటుంటే
జన్మ సార్ధకత స్వానుభవమయింది.
ఇంతలొ ఎక్కడివో పాడు కుక్కలు
వీధినున్న నన్ను
వీధిన పడినదనుకొని
చింపటానికి కాట్లాడుతున్నాయి...కాలు దువ్వుతున్నాయి!
నా ప్రియ నేస్తం
ఆత్రత, ఆబ చూసాయేమో
బక్క చిక్కినోడు వీడేం కాస్తాడు
అనుకున్నట్టు ఒక్కసారి చుట్టూ మూగాయి.
వాటికేం తెలుసు పాపం
సృష్టిలోని ప్రత్యల్పానికీ
గుర్తింపు, కర్మ సాఫల్యత
ఎంత బలాన్నిస్తుందో.....
మూకుమ్మడిగా వచ్చి పడ్డాయి
మూతులు పెట్టి చింప చూసాయి
ఇప్పటి నా సబలత్వానికి నిదర్శనంగా
ముళ్ళు గుచ్చుకొని కుర్రో మొయ్యోమని పోయాయి.
అవును మరి
నేనిప్పుడు విసిరేయబడ్డ విస్తరాకును కాను
సార్ధకమైన అన్నపూర్ణను...ఒకరికి అమ్మను.
Subscribe to:
Comments (Atom)