Friday, 11 June 2010

కోనేటిరాయుని చుట్టూ

ఈనాటి బంగళూరులో,  ఇంటికి ఇంత దగ్గరగా, ఈ కోనేరూ, ఈ ఆలయం, ఇంత ప్రకృతి ఉన్నాయని తెలిసే సరికి అయిదేళ్ళు మిస్. అయినా "చలువ చందనములు తేవ చందమామ రావే .....జాజిపూల తావినీయ జాబిల్లి రావే " అంటూ ఆ మామూలు జోలపాట సద్దిరొట్టెకు అన్వయపు వెన్నముద్దద్ది  పండువెన్నెలలో కోనేటి పక్కన నాకు విందైనప్పటినుంచి నిజంగా అలాటి కోనేరు, గుడీ ఎప్పుడు తారసపడతాయా అన్న ఎదురుచూపులు ఇంత తొందరగా తీరుతాయనుకోలేదు. వెన్నెట్లో దీన్ని అనుభవించే అదృష్టమయితే ఇంకా రాలేదు కాని  విందు భోజనానికి నాకయితే వేళాపాళా లేదు. మీరూ ఆనందించండి మరి.

కొండలలో కాదు కాని కోనేటిరాయుడే

మరో పక్క నుంచి

చిక్కని రాయునికి పచ్చని తోరణం 

అష్టావక్రైతేనేమి జయవిజయుల స్థానం, ఠీవీ నాది
 

పుష్పం సమర్పయామి.......

ధ్యానం సమర్పయామి........
                                      The yellowish blob in the Mid-background is the temple....Promise :-)

పతితపావనుడౌ పరాత్పరుని గురించే కదూ నీ తలపంతా

ఆద్యాంతరహితునికి మా సాక్షం అవసరమా?


ఇంకా ఎన్నో ఎన్నెన్నో అందాలూ, వర్ణాలూ, జీవాలూ చుట్టూ పరుచుకుని వేడుక చేసుకుంటున్న ఆయన నాకయితే నిజంగా చిన్నపిల్లాడిలానే అనిపించాడు.