అమ్మా,
ఆర్యోక్తి నీకు తప్పక గుర్తుకొచ్చి ఉండాలి.
చందనసమమో మరణ సదృశమో తెలిపే అనుభవాత్మక సాక్షీభూతములేవీ? కానీ భావసారూప్యతకు సాక్షులవసరం లేదేమో.
"శీలపరీక్షసీతే" యన్న స్వరంలోని ఆరోహ అవరోహాలు "ఇయం సీతా మమ సుతా......."యన్నస్వరాన్ని గుర్తుచేసుండకపోతే ఇన్ని యుగాల ప్రతిధ్వని ఉండేది కాదేమోనమ్మా.
రాగధర్మకీలమ్లానశ్యామలాంగుని రాజధర్మయసిధారము నీది కాకుండునే?
వైయుక్తికంగా సాక్షం కావాలనుంటే అక్కడే అమ్మక్కున చేరేదానవు కాదామ్మా?
నిజమేనేమో బంగరు చాయను తేలిన నీ తనూసుమము మానస మ్లానముకు ముసుగేనేమో
కాని కణకణకరచే కీలలు అమృతాభ్యంగంగనముగా తోచుండాలిగా కరుణామయీ?
నీ కన్నుల్లోని విజయోత్సాహము రామజయకేతనమెగా.
రాగధర్మమూ, రాచధర్మమూ.......ఏదైనా సరే అచంచల కర్తవ్యపాలనే, జీవనయాత్రలో భాగము మాత్రమె పూర్ణము కాదు వ్యక్తిత్వమూ కాదు అన్నది తోచిన ఆ క్షణాన స్వవిజయమూ, స్వామిజయమూ కనుగవలే కదాయమ్మా.
అమ్మా నిజంగా కాలము చక్రమేనమ్మా!