Friday, 27 February 2015

ఓ తటిల్లతై

 నా బుఱ్ఱ నిజంగా ట్యూబ్ లైటే.
 
హరి గుడ్డివాడవటం ఎంత పాత్రోచితమో ఇవాళ తట్టింది!!!
 
మెరిసే తారల, విరిసే పూవుల
వసంత మాసపు, తొలకరి మెఘపు
ప్రాణానికీ ప్రానికీ 
గానానికీ గాత్రానికీ 
జీవ నాదానికి ప్రాణ స్ఫందనకూ
 
రూప గుణ విశేషణాల తారతమ్యం ఉండదని

చెప్పే అద్భుతమైన అద్వైతానుభూతి 

మరోసారి
ఇవాళ!!!

ఓ తటిల్లతై.
 

Thursday, 19 February 2015

అప్రయత్నపు ఝడివాన

నిండుగా సంపూర్ణంగా
కళకళలాడుతూ
నా దృక్కోణమే కావచ్చు
నీ మచ్చలు కనపడకపోవటానికి కారణం
అయినా నిండు జాబిల్లివి
మనసులో ఎప్పటికీ

కృష్ణపక్షాలూ
అమావాస్యలూ
కళల పెరుగూ తరుగూ
"దల"లెన్నో ఉన్న కాల సర్పమూ
అన్నీ "అవగతమే"


అయినా
ఎందుకో మానస సరోవరంలో
అలలొస్తూనే ఉంటాయి
చిత్రమేమో తెలుసా
పున్నమికి కాదు వాటి ఉధృతి
అమవసికే.

*****
ఎందుకో
ఆకాశంబు నుండి, శంబుని శిరంబు నుండి....
గుర్తొస్తోంది.

*****
తండ్రి స్థాయి.
గర్వంగా ఉంది కూడా.