Sunday, 19 July 2015

నేనెవరు - 1


నిన్నటి పునాదిపై
రేపటి భవంతికై
నేటి సున్నమూ ఇటుకలే నేను
ఈదురుగాలి నిన్నటి పునాదుల ప్రశ్నిస్తే
పై వాడి మేస్త్రీలూ కూలీలొచ్చి
భవంతినే మార్చేస్తుంటే
నన్ను నేనే కోల్పోతుంటే
నేనిచ్చే నీడలో
నా చాటున చెలిమితో
పెరుగుతున్న రేపటి తరాలు
నా అస్థిత్వానికి అసంపూర్ణ ప్రతిరూపాలు
ఇటుకనవటం నా నిర్ణయమేమీ కాదు
ఆశపడటంలోనూ ..ఏమో నాదెంత భాద్యతో
మలచబడటం మార్చబడటం 
కొండంతవటం కొలవబడటం....
తామరాకునవటం లక్ష్యమే
చినుకురాలినప్పటి ఉలికిపాటూ
అదీ మజిలినే
అదీ సత్యమే
అదీ నేనే