స్వేచ్చగా ఎగురుతున్న పక్షుల బ్యాక్గ్రవుండ్ ..........ముచ్చటైన పేరు ఆర్చివ్ కు......ఇక యూ ఆర్ ఎల్ లోనే పరమావధి ..................రాస్తున్నది మేమిద్దరం అంటూ తమ పరిచయం. చక్కనైన పేర్లు. అవి కలం పేర్లో అసలు పేర్లో తెలీవు. భిన్నాలకు దర్పణంగా. వారి పేర్లకు తగ్గట్టే రచనలూ, భావుకతా, ఉద్రేకమూ, శోకమూ ....ఇంకా అన్నీను.
పరిచయమైన కొన్ని రోజుల్లోనే చెంప దెబ్బ తిన్నాను. నా రచనలు అభిప్రాయాలూ నావి, అవి చర్చలకు తావు లేనివి. అంటూ నిక్కచ్చిగా చెపుతూ.
ఆకర్షించినది మాత్రం వారిద్దరినీ నేను ఊహించుకున్న ఊహలే. Not without any basis, though. కానీ నా ఊహల్లో వారిని చూస్తె ఎంత ముచ్చట వేసేదో. ముఖ్యంగా పుస్తక పఠనం ఎలా అంటూనో అలాంటిదేదో ఒక టపా. నిజంగా ఇద్దరినీ ముద్దు పెట్టుకోవాలనిపించెంత నచ్చేసారు.
కాలగమనంలో గాయాలు కనపడుతుంటే ......... భావుకులకు సహజమేగా అనుకుంటూ గమించటం మాత్రమె మిగిలిపోయింది
హటాత్తుగా ఒక రోజేదో టపా ......Prayed for somebody’s togetherness, for the first time.
అల్మారాలోంచి ఒక సగం ఖాళీ.......ఇంకో రోజు
అర్ధనారీశ్వరుల్లో ఒకరు మాయం ఇంకొంత కాలానికి
రాస్తున్నది మేమన్న పరిచయమూను .....కాలగమనం చేసి
కలలు కంటూ బోసిగా అనిపిస్తూ .....అసలు కనిపించకుండా పోయి కొంత కాలమూ
మళ్ళీ ...........లేదు నేనొక్కడినే ........నేనొక్కడినే ............నేనొక్కడినే
అంటూ ఎన్నో ఏళ్లకు దర్శనం ఈవేళ
నిజంగా ఏడుపొచ్చింది
కాలసర్పమే ....నిజ్జంగా
అంటూ ఎన్నో ఏళ్లకు దర్శనం ఈవేళ
నిజంగా ఏడుపొచ్చింది
కాలసర్పమే ....నిజ్జంగా