Wednesday, 8 April 2009

కవితార్ణవ సారధులకు విజ్ఞప్తి.

అలా అలా.... పైపైన
తేలుతూ పొతే
ఎంత సులువో......
ఎంత ఆనందమో.....

లోతు చూద్దామని పరికిస్తే
అబ్బ....అబ్బబ్బ....
ఎంత శ్రమ!

పైగా శోధన చివరకు మిగిలేది
మనసుకు చురకే....
పైపైన తేలావు
లోనేందుకు మునగలేదని.
మరి లోతుల్లో
వింతలెన్నో అపుడే కదా అవగతమయింది!

అయినా మానస వనచరవరము
కుదురులేని గెంతులేస్తూనే ఉంటుంది.
దాన్ని లోతుల్లో ముంచాలంటే
మీరే ఏదో ఒక లంగరు వెయ్యాలి....ఈ కవితార్ణవంలో.

1 comment:

  1. బాగుందండి. నాకూ అటువంటి చురకలు ఎన్ని తగిలాయో :-)

    ReplyDelete