1988లో.. పన్నెండేళ్ళ వయసులో మొదటిసారి చావు నన్ను తాకిందలా. నాకింకా బాగా గుర్తు ఆ రోజు అలవాటు ప్రకారం దూరదర్శన్ విషాద సంగీతంతో ఎవరి మరణాన్నో హోరెత్తించేస్తూ మాకందరికీ ఆ మనిషిని తలచుకోండోచ్ అని చాటి చెప్తూ విసుగు తెప్పిస్తోంది. ఈ విసుగు నాన్న మొదటిసారి నన్నూ చెల్లెళ్ళన్నూ రాత్రి పదిన్నర తరవాత వచ్చే సినిమాలు చూడటానికి అనుమతిచ్చారన్న ఆనందంలో మటుమాయం. దాదాపు పద్నాలుగు రొజులనుకుంటా వరుసగా చనిపోయిన ఆ మహానుభావుని సినిమాలను రాత్రుళ్ళు వరుసపెట్టి చూపెట్టింది దూరదర్శన్. ఒకటో రెండో రోజులయింతరవాత నాకంటే ఒకే ఒక్క ఏడు పెద్దయిన నా స్నేహితుడన్న మాటలు నా చివరి రోజు వరకు గుర్తుంటాయి "వీడు చనిపోయేంత వరకు ఇంత గొప్ప వాడని తెలీనే తెలీదురా" అంటూ వేళాకోళంగా అన్నా ఆ మాటలెంత నిజమో అనుభవ పూర్వకంగా నాకొక్కడికే తెలుసు. ఆ మహానుభావుని పేరు రాజ్ కపూర్.
పద్నాలుగు రోజులు ఎన్ని ఆణిముత్యాలు పరిచయమయ్యాయని? తీస్రీ కసం, సంగం, సప్నోన్ కే సౌదాగర్, మేరా నాం జోకర్, బాబీ, ఆవారా,అనారి, బర్సాత్ మొదలయినవి నన్ను మొదటిసారి మురిపించిన రోజులవి. ఎన్ని తీపి గుర్తులనీ అవీ? ఎంత గాఢంగా నన్ను ప్రభావితం చేసాయనీ?
రాజ్ కపూర్ పియానో దగ్గర కూర్చుని "दोस्त दोस्त ना रहा.....प्यार प्यार ना रहा......जिन्दगी हमें तेरा, एतबार ना रहा" అంటూ తన బాధను వెళ్ళగక్కుకున్నా "दुनिया बनाने वाले क्या तेरे मनमे समाई..... तूने काहेको दुनिया बनायी..........काहेको देदी जुदाई....." అంటూ విధాతను ప్రశ్నించినా ఎంత ఆస్వాదించానో.
ఈ retrspective తోనే నా విషాదగీతాభిరుచికి భీజం పడిందని చాలా ఖచ్చితంగా చెప్పగలను. అది ఎందుకన్నది తరవాత్తరవాత "బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్.......ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్" అంటూ ఇంకో సినీకవి నాకు జ్ఞానోదయం కలిగించేవరకు తెలీలేదు కాని ఆ విషాదాన్ని ఎంతగా ఆస్వాదించానో అప్పుడు. అందులోనూ దొమ్మరిపిల్ల తన ప్రియుని హితం కోరి తననుతాను శిలను చేసుకోవటం - జమీందారుకు బలి అవ్వటం (తీస్రీ కసం) "सब कुछ सीखा यारो ना सीखी होशियारी....ए सच है दुनिया वालो के हम है अनारी" అంటూ తన అలౌకికత్వాన్ని ఒప్పుకోవటం, "तेरा जाना.....कोई देखे...बनते अरमानों का मिट जाना....." అంటూ విరహాన్ని వ్యక్తం చేయటం (అనారి) ఎంత బావుండేదో. ఏ విశ్లేషణలూ అంతర్ముఖాలూ తెలియని రాసోద్దీపనమే ఏకప్రసాదంగా నన్ను తాకినా అనుభూతి మళ్ళీ ఎన్నో ఏళ్ళకి గాని నాకు లభ్యం కాలేదు.
"तुम न रहोगे, हम न रहेंगे......फिर भी रहेंगे निशानिया....आ ...आ..आ.." అంటూనో "ए शो सिर्फ तीन घंटों का......पहला बचपन का......दूजा जवानी.....तीसरा बुढापा" అంటూనో పెద్ద పెద్ద జీవితసత్యాలను ఎంత సునాయాసంగా చెప్తాడో కదా రాజ్‌కపూర్ తన సినిమాల్లో అని ఆశ్చర్యపోయేవాడిని.
సంగం చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో కూడా స్త్రీని సినిమాల్లో ఎంత వాడుకునేవారో అర్థమయి బాధపడ్డ నాకు నాన్న రాజ్‌కపూర్ పర్సనల్ లైఫ్ గురించి, అతని జీవితంలోని స్త్రీల గురించి చెప్పినపుడు అంత గొప్ప వాడు (ఆ గొప్ప అనేది భావుకత అని తెలియటానికి పదుల సంవత్సరాలు పట్టాయిలెండి) అలా ఎందుకు చేసాడా అని బాధపడటం అప్పటి నా అనుభారాహిత్యం, ఆ వయసులో ఉండే కాంక్రీట్ థింకింగ్‌కు ఉదాహరణ అని సైకియాట్రీ చేసేదాకా తెలీలేదు. సప్నోన్ కా సౌదాగర్ (ఇది ఆ రెట్రోస్పెక్తీవ్ లోది కాదు తరవాత చూసినది అని కొంచం డౌట్ నాకు)లో హేమామాలినిని చూసిన తరవాత మళ్ళీ అంతటి నిర్మల సౌందర్యం నాకు జంగ్లీ లో "जा जा जा मेरे बचपन......कही जाके चुप नादाँ....ए सफ़र है अब मुश्किल...... आने को है तूफ़ान" అంటూ తన బాల్యాన్ని సాగనంపే యువతిగా సైరాభానూలోనూ, అదే సైరా "एहसान तेरा होगा मुझ पर.....दिल चाहता है ओ कहने दो......तुमने मुझको हसना सिखाया....रोने कहोगे तो रोलेंगे अब......ए दर्द ए मोहब्बत सहने दो" అంటూ బాధపడే సమయంలో ఆపద్బాధవుడులో "ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మటమెల్ల......" అనే మీనాక్షీ శేషాద్రిలో తప్ప ఇంకెక్కడా కనిపించలేదు.
ఈ చిత్రాలు ఎంతగా నా మనసును హత్తుకున్నాయంటే ఇప్పటికీ నా అభిమాన గాయకుడు ముఖేశే. అందులోనూ "में आवारा हूँ ......या गर्दिश में हूँ आसमान का तारा हूँ" అంటూ చిలిపిగా మొదలెట్టినా "घर बार नहीं... संसार नहीं..... मुझसे किसी को प्यार नहीं" (ఎందులోదో చెప్పక్కర్లేడనే అనుకుంటా )అని నవ్విస్తూనే, నవ్వుతూనే ఏడిచే, ఏడిపించే ముఖేష్......"हम तुझ से मोहोब्बत करके सनम.....रोते भी रहे....हस्ते भी रहे" (ఇదీ అందులోదే) అంటూ స్త్రీ-పురుష ప్రేమలో ఉండే ద్వ్వంద్వీ భావాన్ని తెలియచేసే ముఖేష్......నాకు అత్యంత ఆప్తుడు......అతన్ని నాకు పరిచయం చేసిందీ మరణమే.
"किसीका मुस्कुराहटों पर हो निसार.....किसीका दर्द मिल सके तो ले उधार.....किसी के वास्ते हो तेरे दिल में प्यार....जीना इसीका नाम है" అంటూ మానసికమై సర్వజనీకమైన ప్రేమను, "में शायर तो नहीं...मगर ए हँसी .....जब से देखा...मैंने तुज्को....मुझको...शायरी आ गयी" అంటూ ఆకర్షణతో మొదలయ్యే ప్రేమనూ .....ఇలా రెండు భిన్న ప్రేమరూపాలను నాకు పరిచయం చేసింది మరణం.
ఇక రెండవసారి మరణం మళ్ళీ నన్నంతగా తాకింది 2004లో. ఎమ్మెస్ గారి మరణంతో. అప్పుడప్పుడే ఇక్కడ ఇంగ్లండులో స్థిరపడుతున్న నేను, బాచిలర్ని కావటంతో, ఇక్కడ పని చేస్తుండటంతో పుష్కలంగా ఉన్న ఖాళీ సమయాన్ని, డబ్బునూ సద్వినియోగం చేసుకుంటూ నా సంగీత సాహిత్యాభిరుచులను పెంచుకుంటున్న ఆ రోజుల్లో ఎమ్మెస్ గారి మరణం నన్ను కర్ణాటక సాత్రీయ సంగీతం వైపుకు లాక్కెళ్ళింది.
మొదటిసారి తెలిసిందా రోజు మృదుమధురంగా నన్నలరించే రెండు వెంకటేశ్వర సుప్రభాతాల్లో అత్యంత ప్రసిద్ది చెందింది ఆమెదని. కాని నాకిప్పటికీ అనిపిస్తుంటుంది అప్పటి ఆలిండియా రేడియోలో శనివారం పొద్దునే వచ్చే (ఇప్పుడూ వస్తోందేమో నాకు తెలీదు) తిరుపతి దేవస్థానార్చకుల వెంకటేశ్వర సుప్రభాతం ఇంకా బావుంటుందనీ, దానికి రావాల్సినంత పేరు రాలేదని. అప్పటి వరకు ఆమెవి మిగితావి నేను విని ఉండలేదు. కాని ఆ రోజు వినటం మొదలెట్టాను. ఆమె గురించి రాసిన దానిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమై ఇప్పటికీ గుర్తుండిపోయిన విషయం "ఆమె కచేరీలలో విద్వత్ప్రదర్సన కంటే భక్తిరస పంపకం ఎక్కువ ఉండేది" అని ఆమె వ్యక్తిత్వాన్ని పరిచయం చేసిన వాక్యాలు. పెద్ద పెద్ద సభల్లో కచేరీలు చేస్తున్నా, వేలమంది మధ్యన కూర్చుని త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలలో పాల్గొన్నా ఆమె వదనంలో మారని భక్తిరస భావన.
నాకు మంగళంపల్లిగారంటే ఆయన పాటలంటే వల్లమాలిన అభిమానం. ముఖ్యంగా ఆయన ఆలపించే "ఏమీ సేతురా లింగా", జయదేవుని అష్టపదులు, "అయ్యయ్యో రఘు రామయ్య నిర్దయ చూసేదవేమయ్యా...." లాటి వాటికోసం చెవి కోసుకుంటాను. కాని ఆయనలో కాగడా పెట్టి వెతికినా ఆ భక్తిరస చాయలు కూడా కనిపించవు. తన విద్వత్తు పట్ల గర్వం ఎంతగా తోనికిసలాడుతుందో ఆయన ముఖంలో. ఈ మధ్యనే అమ్మకు ఫోన్ చేసినప్పుడు సునీత అనే వర్ధమాన సినీగాయకి ఇంటర్వ్యూలో రోత పుట్టించే ఆయన ప్రవర్తన గురించి కంప్లైంట్ చేస్తూంటే "విద్వత్తున్న వారికి గర్వం సహజమే" అని ఆయన తరుఫున వకాల్తా పుచ్చుకుని అమ్మతో కొట్లాడిన నేను చచ్చినా కూడా ఎమ్మెస్ గారిని గౌరవిన్చినంతలో వెయ్యో వంతు కూడా ఆయనను గౌరవించలేను అని నాకు తెలుసు. ఆయన కళను ఆస్వాదించగలను ఆయన విద్వత్తును ఒప్పుకోగలను కాని ఆయనను గౌరవించలేను.....ఇలా "మనలో నలుపు తెలుపుల మధ్య బ్రతికే గ్రేసే ఎక్కువమంది....స్వచ్చమయిన తెల్లని వ్యక్తిత్వం ఏదో అతితక్కువ మందికే సాధ్యం" అన్న నిజాన్ని అర్థం చేసుకునే ఆలోచనాకోణానికి బీజం వేసింది ఎమ్మెస్ గారి మరణం.
ఇక నన్ను పై రెండు వాటిలా ప్రభావితం చేయకపోయినా గుర్తుందిపోయిన మరణం ఎన్టీ ఆర్ ది. నేను ఎం బీ బీ ఎస్ చేస్తున్న మొదటి సంవత్సరంలో ఆయన చనిపోయిన రోజు ఆయన అభిమానులు హైదరాబాద్‌లో చేసిన సీన్లూ, ఆర్టీసీ బస్సులను బలవంతంగా ఆపేయాలని ఆయన అభిమానులు నేనున్న బస్సు అద్దాలు పగలకోడుతుంటే అదే రోడ్డు కూడలిలో ఆయన చిత్రపటం పైన ఏర్పాటు చేయబడ్డ మైక్ నుంచి ఘంటసాలగారి భగవద్గీత వినపడుతోంది........అది తలచుకుంటుంటే ఇప్పుడనిపిస్తుంది...నిజమే సిరివెన్నెల గారన్నట్టు
పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ.
Let me end with a prayer for gummadigaaru.....with something that i recently read somewhere
oh god (if there is a god) may his soul rest in peace (if there is a soul)
పార్ట్ 1 అఫ్ 2

మీరు చెప్పిన సిరివెన్నల మాటలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఎంత లోతుగా ఉన్నాయండి.
ReplyDeleteమీరు మరణాన్ని బాగా వ్యక్తీకరించారు
మనోశ్రీ గారు, భావన గారు
ReplyDeleteనచ్చినందుకు థాంక్స్
చాలా బాగారాశారు భావకుడన్ గారు. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేకపోతున్నాను.
ReplyDelete