Friday, 30 July 2010

తాజ్ మహల్

హృద్ఫలక శకలపల
ముసుగేసిన మేస్త్రీని
చూసిన జాలి.
ఎదురు చూపైన నవ్వూ.

Wednesday, 28 July 2010

రాగమంటే?

http://www.youtube.com/watch?v=WiUrKoKAWgo




"నేను రాక ముందు మీరు పాడుతున్నది కూడా మంచి రాగమే మధ్యమావతి........" అంటూ మొదలెట్టి జానకి గారు


నిసరిమ పనిసరి నిరిరిస నిపమపనిసా నిపమరిమరీ నీసా... అంటారు


మధ్యమావతి చూస్తె 



అంటే రాగమంటే 

ఆరోహణ అవరోహణల్లో ఇచ్చిన స్వరాలు ఆ క్రమంలో, అవే స్వరాలు రావాలి 
కాకపొతే  అవి ఎంత చిన్న బిట్స్గా వచ్చినా, even if as bits of one svara length 
అయినా పర్లేదు అనా అర్థము? 


అంటే పైన చెప్పిన 

"నిసరిమ పనిసరి నిరిరిస నిపమపనిసా నిపమరిమరీ నీసా"  అనే దాన్ని 


"ని సరిమపని సరి ని రి రిస నిపమ పనిస నిపమారి మరి నిస" అన్న బిట్స్ మాలగా అనుకోవచ్చా?


సమాధానం తెలిసీ చెప్పకపోయ్యారో తల వ్రెయ్యి వక్కలు ........









Tuesday, 20 July 2010

ఎందుకురా తొందర?

భూమ్యాకాశాల పాణిగ్రహణం
చిత్రమైన ఛాయాజాలం
ఆ అమ్మాబ్బల దగ్గరితనం
దూరపుకొండలే నయం!
లొకాల లోకుల కోసం
ఠంచనుగా జరిగే ప్రసవం,
శశిరేఖ, విభాకరులవ
మీకేం ఖర్మరా.

Saturday, 17 July 2010

కోనేటిరాయుని చుట్టూ-2 ఎవరు చెప్పేరమ్మ ఈ కొమ్మకూ పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ.......

                                                    
                                          చిన్నాదానా ఓ చిన్నాదానా ........

                                          నీరెండ స్పర్స చెలి బుగ్గన ప్రతిఫలిస్తుంటే.......

                                  ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై ......

                                                               ఏమని వర్ణించనూ...............

                            కుబ్జకూ కృష్ణ భాగ్యమాయె నీవంతకుమించినవాడవా అన్న పూబాల :-)

                 గడ్డి పూవుకూ హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు అనుకోరాదూ...

                                   సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు,
                                  నిన్ను మెచ్చిన వాడు నిజము చెపుతున్నాడు..వాడు నీ వాడే

                          వన్నెలూ, చిన్నెలూ, నీరెండలూ, క్రీనడలూ...జీవితసారమంతా కనపడట్లేదూ?

                                                  ఎన్ని వేసవి సెలవులు గడిపామనీ ఈ పూలతో....

                                                      మందారం ఎరుపూ, మంకెన పువ్వెరుపూ......

తెల్లారేప్పటికి మంచుదుప్పట్లో ఒదిగున్న గోవర్ధనాల ఆవులింతలూ,
భాద్రపదచవితికి పోటీపడి ఎరుకొచ్చిన పారిజాతం అరుణిమలూ
ఒక్కసారే చూసినా మనసుకు హత్తుకుపోయిన సంపెంగ పూవూ
ఇంతవరకు చూసెరుగకపోయినా ఊహల్లోని మొగలిపూలూ
ఇంటివారు పెంచుకునే సీతమ్మవారి జడ పూలూ,
చెల్లెళ్ళు పెట్టుకున్న బఠానీ చేమంతులూ, కలర్ చేమంతులూ,
ఇవి నిజంగా పూలేనా అని ఆశ్చర్యపోయిన బ్లాక్ రోస్లూ,
అమ్మ పెంచిన మల్లె తీగలూ ......

ఓహ్ గత స్మృతులు ఎంతగా పలుకరించాయో ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటే.
Had a fantabulous time reminiscensing

Sunday, 4 July 2010

Trip to Clent Hills

ఇక్కడ ఆగుదామా
సరే
రా కూర్చుందాం

"ఎక్కడ?" అన్నట్టు  ప్రశ్నార్థకానికి
సూటిగా నన్నే చూస్తున్న చూపులు

మాట్లాడకుండా పక్కనే సర్దుకుపోయా
తనను తాకుతూ కూర్చోటం కొత్తేం కాదు
కోటి వీణలు మనసులో మ్రోగటంలాటివేవి ఉండవు
కాని ఆ దగ్గరితనం ..........ఎలా చెప్పను?

ఎదురుగా సూరీడు
ఆయన కింద మబ్బులమ్మ
ఆమె కింద పచ్చని పిల్ల పైర్లు
చుట్టూ కమ్ముకున్న గాలి దేవుడు
కిచకిచమని అల్లరి చేస్తూ పక్షులు

రోజాలో పెళ్లి చూపుల్లో అరవింద్ రోజా అక్కను మాట్లాడించే సీన్ గుర్తొచ్చింది.

"ఖామోష్" అంటూ అనార్కలీలో పృధ్వీ రాజ్కపూర్ లా ఊగిపోతూ అరవాలన్నంత కోపం.....
"తఖ్లీయత్" అంటూ పెదాలు కదలకుండానే దిలీప్కుమార్లా ఆజ్ఞాపించి వారందరినీ మాయం చేసే అధికారం ......

స్పర్శ!

ఎంత సేపు ఉండిపోయామో
ఎన్ని సెకన్లు వచ్చి చూసిపోయాయో
పాపం మంచివే
తమ రాక, పోక, ఉనికి ఏవీ తెలీనంత మెల్లగా

ఆకలేస్తోంది - తను.
లోకంలో పడ్డాను

తెచ్చుకున్న పెరుగన్నం విప్పుతుంటే ఎప్పుడో తన మాటలు
అలా దేశాటన చేసుకుంటూ ఒక నెల రోజులు అనామకుడినై పోవాలనుంది...పొద్దున్న పూట ఎవ్వరూ లేని చోట...తెచ్చుకున్న సద్దన్నం పెరుగు వేసుకుని అంటున్న నన్ను అంతా బానే ఉంది కాని ఆ సద్దన్నం ఎందుకు అప్పుడే వేడి వేడిగా వండుకోవాలి అనుకోవచ్చుగా అంటూ
చిన్నగా నవ్వు తన పెదాల మీద
తనకూ అదే గుర్తొచ్చిందేమో

పెరుగన్నం గట్టిగా కలుపుకొచ్చాము
చేతుల్లో ముద్దలు
భోజనాన్నికాలాన్నీ అలా.......

చేతులు కడుక్కుంటున్న తను
వెనకనుంచి తడుముతున్న నా చూపులు
వెనుతిరిగిన తన చూపుల్లో
ఇకపై అలాటివేవీ ఉండవన్నావుగా ప్రశ్న

నన్ను నా శరీరాన్నుంచి పెకలించే శక్తే లేదా

కేక వినిందేమో
కళ్ళలో ఏదో పడింది ఊదు అంటూ
నా చేతుల్లో తన మోహం, కళ్ళెదుట కళ్ళు
పడిందో లేదో కాని "జల"తారు పొర మాత్రం చూసా
అరుంధతిని చూసేస్తూ నేనూ ఉదేసా

ఎలా అర్థం చేసుకోనూ తనను
ఇలాటివేవీ  ఉండవన్నావుగా అన్నప్పుడు తన కళ్ళల్లోని బాధ
నా చేతుల్లోకి తన మొహాన్ని ఇచ్చేసి కళ్ళు మూసుకున్న తన నమ్మకం
మనసులో ఏముందో కాని మోహంలో చెరగని నిర్మలత్వం
నా హృదిలోని గరళాన్ని కూడా ఇలాగే సబ్లైం నేనెందుకు చెయ్యలేను?

పనుల హడావుడిలోనూ ఆయమ్మ పిలిచింది
అనుకుంటూ వచ్చిపోతున్న  పేరంటాళ్ళా
కొంతసేపు మెరిసిపోతున్న తారలు
కొత్త కోడలి పేరంటం ముచ్చటను పర్యవేక్షిస్తున్న జాబిలమ్మ మాత్రం మొత్తంగా .......

సూర్యుడు మాయమయ్యి జాబిలమ్మ!
సమయం అయిపోయింది
జైలర్లా కరుకుగా ఉరుము

మాట్లాడకుండా వచ్చేసాము
కొండ దిగి, బాట దాటి
అరణ్యంలోకి

ఇంటి దగ్గర దిగబెట్టాక
మళ్ళీ ఎప్పుడు అన్న ప్రశ్నను చూడలేకేమో
చూపులు కలవలా
ఆ ప్రశ్నకు సమాధానం రాదని తెలిసే
వస్తా కు బదులు ఒకే బై అంటూ వచ్చింది నా వీడ్కోలు