Thursday, 19 August 2010

Of devotion, emotions and god.

"అన్ని రకాలయిన యోగాలూ ఆ అల్టిమేట్ ట్రూత్ దగ్గరకే తీసుకెళతాయి అంటారు కాని భక్తి యోగంలో గర్వం రావటానికి ఎక్కువ చాన్స్ ఉంటుందని కూడా అంటారు. ఎమోషన్ మీద ఆధారపడి ఆ ఎమోషన్స్ లేకుండా చేసుకునే యోగమే భక్తీ యోగా కాబట్టి ఇక్కడ ఎక్కువ చాన్స్ అట పక్క దారి పట్టడానికి...అంటే నేనే గొప్ప భక్తుడిని, నేను ఇంత గొప్ప భక్తుడిని ఇలా అనుకునే స్థాయిలో ఆగిపోయే చాన్స్ ఎక్కువ ఉంటుందట ఎందుకంటే ముందరి నుంచి ఆ ఎమోషన్స్ ను దూరం చేయటానికి ప్రయత్నించక ఒక దామినేంట్ ఎమోషన్ ....భగవంతుని మీద భక్తీ లేదా ప్రేమ అనే ఎమోషన్ ద్వారా ముక్తి అంటే ఎమోషన్ లెస్స్ స్టేట్ చేరాలని ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది అంటారు. కాని నిజంగా కృషి చేస్తే  తనను తాను పూర్తిగా అర్పించుకునేంత ఎమోషన్ మైంటైన్ చేస్తే  అప్పుడు ఏ ఎమోషన్స్ కూడా లేని ఈక్వానిమిటీ వస్తుందట." అంటూ ముగించాడు నా స్నేహితుడు వీరూ.

చర్చ ఎక్కడ నుంచో ఎక్కడికో వెళ్ళింది ఎప్పటిలాగే. చర్చ ముగిసిన తరవాత ఇంటికి వచ్చేసా. 

ఈ మాటలు ఆలోచిస్తుంటే నాకు భక్తి గీతాలు ఎందుకు నచ్చుతాయో కొంచంగా అర్థమయినట్టు అనిపించింది.

ఇంతవరకు నేను ఆస్తికుడినో నాస్తికుడినో తెలియని సందిగ్ధావస్థ నాది.బ్రాహ్మణుడిగా పుట్టినందువల్ల కొంచం ఆచారవ్యవహారాల పరిచయం, పెద్దల వలన వాటి కాంటెక్స్ట్ అర్థం చేసుకునే వీలు, పారంపరికంగా వచ్చిన విద్యావరంతో కీర్తనలు, మంత్రాలు కొంత అర్థం చేసుకునే  భాషా సౌలభ్యం ఇవన్నీ అమరాయి. అయినా ప్రూఫ్ లేని దాన్ని నమ్మకూడదు అన్న అలవాటు చిన్నప్పటినుంచి అ ఆ లతో నూరిపోయటం వలన ఆచారవ్యవహారాల పట్ల ఇష్టం ఉన్నా, చేస్తున్నా చిత్తసుద్దిలేని శివపూజలే  అన్న చిన్న చూపు నాలో నాకే ఉండేది, ఉంది.

చర్చల్లో ఇదే వీరూ "ఒక విషయం నిజము అని తెలిస్తే దాన్ని వప్పుకోవటం ఫైత్ లేదా నమ్మకం ఎలా అవుతుంది ? అక్కడ నమ్మకం అవసరమే లేదు. ప్రూఫ్ లేని దాన్నే నిజమని అనుకోవటమే నమ్మకం" అన్న మాటలు నిజమే అనిపించేలా  పరిచయాలు పెరిగి "ప్రూఫ్ లేకపోయినా, నిజానికి ఆపోసిట్ దానికి ప్రూఫ్లు ఉన్నా ఒక విషయాన్ని నిజమని ఒప్పుకోవటమే నమ్మకం" అనేది స్వానుభవ సారంగా కొంచం కొంచంగా అర్థమవసాగింది. (నమ్మకానికి నా నిర్వచనం లెండి ఇది ).

 అప్పటి నుంచి  "భక్తీ అంటే గుడ్డి నమ్మకమే భక్తీ యోగమంటే గుడ్డి సాధనే. ముందు ఉన్నాడని నమ్ము, నమ్మి ఆయనను చేరుకోవాలంటే ఇవి మార్గాలు అని చెప్పబడ్డాయి అవి చిత్తసుద్దిగా చెయ్యి అంటారు...అంటే ముందు బలంగా నమ్మి సాధన చేస్తే అప్పుడే ఆయన కనపడతాడు లేదంటే నీ సాధనలో, నమ్మకంలో లోపం అంటారు....ముందు పూర్తిగా నమ్మితే ఇక సాధన అవసరమేమిటి"    అన్న నా ఆలోచనా పంథాలో (వితండ వాదం?) కొంచం మార్పు రాసాగింది. 

"ఆక్చువల్గా నువ్వు అనుకుంటున్నట్టు పూర్తిగా ఆయన ఉన్నాడని నమ్మి సాధన చెయ్యక్కరలేదు. సైంటిఫిక్ థింకింగ్ ను పూర్తిగా పక్కన పెట్టక్కరలేదు. సైంటిఫిక్ దిన్కింగ్ ఏమని చెపుతుంది అసలు? ఒక దాన్ని పరిశీలించి చూసి అది తప్పు అని రుజువు అయినప్పుడే ఆ విషయాన్ని కాదనాలి. అదే కదా నల్ హైపోతెసిస్ null hyepothesis కూడా. మనం రుజువు చెయ్యదలుచుకున్న దాని విరుద్దాన్ని మనం టెస్ట్ చెయ్యటమే testing null hypothesis కదా. మరి నీకు ఇక్కడ కావాల్సిన విషయం దేవుడు ఉన్నాడా అన్నది. సో దేవుడు లేదు అన్న దానిని మనం టెస్ట్ చెయ్యాలి నల్ హైపోతెసిస్ ప్రకారం. ఎలా? దేవుడు ఉన్నాడు అని చెపుతున్న మార్గాల్లో వెళ్లి ఆ మార్గం దేవుడు ఉన్నాడు అని చెపుతుందో లేదో టెస్ట్ చెయ్యటమే మనం చెయ్యాల్సిన నల్ టెస్టింగ్ కదా. మరి ఆ పని చెయ్యకుండానే మనం సాధన చెయ్యకుండానే ఎలా చెపుతున్నాము మాకు దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు లేదు అని" అని ప్రశ్నించిన వీరు మాటల్లో నిజం కనిపించింది. 

మరి నిజమే కదా 
ఎలేక్త్రాన్స్ ప్రోట్రాన్స్ న్యూట్రాన్స్ మనం చూసోచ్చామా?  అయినా అవి ఉన్నాయంటే, వాటికంటే సూక్ష్మమయిన బోసాన్ పార్టికిల్స్ లాటివి ఉన్నాయంటే ఎందుకు నమ్మేస్తున్నాము? అవి ఉన్నాయి అని ప్రూవ్ చెయ్యటానికి సైంటిఫిక్ మార్గాలున్నాయి అన్న సమాధానం వస్తుంది. నువ్వు చూసావా చేసావా అన్న ప్రశ్నకు వేరే వారు చేసారు చెపుతున్నారు కాబట్టి నమ్ముతున్నాము అన్నదే సమాదానమయితే మరి దేవుడు ఉన్నాడు ఇలా చేస్తే ఆయన మీకు తప్పక అనుభవమవుతాడు అని స్పిరిట్యువాలిటీ  విషయంలో ఎందుకు నమ్మము అన్న ప్రశ్నకు salience in daily life అన్నది ఒకటే నాకు సమాధానంగా తోస్తుంది. ఈనాడు మనం నేర్చుకునే చదువు మనకు వ్రుత్తయిపోయింది కాబట్టి దాన్ని ప్రతీ విషయంలోనూ మనం  పరీక్షించుకుంటూ వెళితే మనకు పూట గడవడాని తెలుసు. అదే స్ప్రిట్యువాలిటీ విషయంలో అయితే మనకు అది ఈ కాలంలో అంత అవసరం లేదు కాబట్టి, ఇమ్పార్తన్స్ ఇవ్వము కాబట్టి దాని విషయంలో మాత్రం "మాకు గుడ్డి నమ్మకాలు వద్దు ప్రూఫ్ కావాలి" అని పట్టుబడటం. is it not escapism?

"ప్రూఫ్ లేని దాని నమ్మమని చెప్పటమేంటి సార్ మీరు కూడా. తెలీదా ఎంత మంది జనం మోసపోతున్నారో దయ్యాలూ, superstitions అని లేక ఇక్కడ ఎక్కువ లాభపడేది మీ కులపోల్లనా " అనే rationalists "సరే మరి మనం నమ్ముతున్నాం సైంటిఫిక్ రీసనింగ్ లో లేవా ఈ లోటు పాట్లు? ఎంతమంది వైద్యులు మోసం చెయ్యట్లేదు ప్రజల భయాలను అడ్డుపెట్టుకుని? ఏ విద్యలో లేవు నల్లకాకులు? నల్లగావునులు వేసుకున్న వాల్లలోనా? అకౌంతెన్ట్లలోనా? అధ్యాపకులలోనా? అసలు ఏ సైంటిఫిక్ వ్యవసాయాన్ని తీసుకున్నా పలుగాకులు లేని లోకులున్నారా? మరి వాటిని బాణ చెయ్యాలని కోరుతున్నామా అవి ఇంకా సరిగ్గా నడిచే సిస్టమ్స్ రావాలి అని కోరుకున్తున్నామా" అన్న ఆలోచనలు వచ్చిన దాఖలాలు ఏవీ? అయినా ఇష్టం, ఆసక్తి, జిజ్ఞాస ఉన్న వారినే కదా  ఈ వ్యాసంగంలో కృషి చెయ్యమని చెపుతున్నది.మరికనేం?

"ఎన్నేళ్ళయినా, ఎన్ని జన్మలయినా ఫలితం వస్తుందో రాదో తెలీదు అని సాధకులే చెప్పే మార్గంలో సాధన దేనికి సార్" అంటారా. నిజమే. వస్తుందో రాదో తెలీదు కాబట్టి అది సాధించాలి అన్న తపన ఎవరికీ ప్రముఖంగా ఉంటుందో వారినే సాధన చెయ్యనివ్వండి కాని అలాటి వారిని కూడా వెక్కిరించో, హేళన చేసో నిరుత్సాహపరచటం చెయ్యకూదదనేదే ఘోష కదా.

No comments:

Post a Comment