Monday, 27 February 2012

చెంపదెబ్బ

మనసులో భావం బాసు
చేతిలోని కలం పెళ్ళాం

Sunday, 19 February 2012

కుశలమడుగ ఎవరిని పంపను?

అర్జున ఫల్గుణ పార్థా కిరీటీ....

జలధము కవిదాసునకు దాస్యమే, నా చింత అనంగుడేకరణి ప్రతిఫలింపగలడే? శుకపికములకిదియనునిత్యకృత్యమయిన విసుగాయె.
నిందిత చందనమిందుకిరణమనునిందతి ఖేదమధీరం. రమ్య కపర్ధిని దూతకృత ప్రమధాదిపతి ముక్కంటీ ముక్కోపే.మలయమారుతమైనా కరాళ వ్యాళ స్పర్శితస్పృశ్యుడే........

ఎందుకివన్నీ?
వీరిగోలేమి?

వచ్చీరాని భాషల ఉపమానాల ముసుగులో
నివురుకప్పేసిందిలేరా......
చింతకు.

Tuesday, 14 February 2012

జోలెలోదని తెలుసినా

ఆన
సత్తువొచ్చినా కత్తెత్త.
ఆన
సత్తువొచ్చినా కత్తెత్త.

Saturday, 11 February 2012

??

ఏమిటీ పిచ్చి?
తెలీదు
ఏమొస్తుందని
ఎవరికీ తెలుసు?
ఏమి పోతోందో....
నాకు తెలుసు
ఏమాశించి
ఏమీ వద్దు అంతా కావాలి

Thursday, 9 February 2012

Fantasy is an adult's ego regressing to child.

పలుచనచేసి
విడిచేస్తుందని విన్నా 
ఆశ్చర్యంగా 
చిక్కపరుస్తోంది.
గొప్పతనం దేనిది
పుత్తడిదా పుటానిదా
అనుకుంటుంటే 
చతుర్ముఖ హాసం 
లాస్యంగా.
మనసెంతో తేలికగా ఉంది
ఏవో విశ్వరహస్యాలు  అర్థమయినట్టూ......
నిజమే 
వాదనకేం గాని 
Fantasy is a child's play. 
A MAN who plays that game is a BOY. 
ఒప్పేసుకుంటున్నా.

Is that good or bad?
Well, what colour are your glasses?