Saturday, 25 August 2012

ధర్మమంటే 8


"రాముడు నా గురించి ఆలోచిస్తూ, తను దైనికంగా చేయాల్సిన కర్మలను చేయటం మానలేదు కదా ?" 
హనుమయ్యను అడిగిందట సీతమ్మ.

ఆ పద్యం కోసం వెతుకుతున్నా...

Thursday, 23 August 2012

Right words, wrong person ...pch

You deserve a big kiss for this...............................

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Dr
.
.
.
why should it be from a 70 years young one?
That too from a patient!
:( :( :( :( :(

Sunday, 19 August 2012

Random Ramblings

నేను అన్న వాడిని మెల్లగా మాయమవుతున్నట్టు తెలుస్తోంది.

*****

రావణుడూ చంపుకున్నాడు,
రాముడూ చంపుకున్నాడు
అవతార పరమార్థం గట్రా తీసేస్తే
ఇద్దరికీ తేడా?

*****

ధర్మ చింతన సమాజ న్యాయం ప్రథమ కర్తవ్యంగా ఉండే వారికేనా?
చాకలివాడికి లేదా ధర్మానుష్ఠాన కర్తవ్యం?
రాచరికానిదేనా ధర్మ చింతన ప్రధమావశక్యం?
రాముడాయోధ్యన పామరుడయ్యుంటే ప్రేమిలా బలయ్యేదా రామాయణంలో?

ఇంటిపెద్దా ఒక రాజేకదా?
అతనికీ ధర్మం తన చిన్ని పరిధిలో, తప్పదు కదా?

*****

కేకలు పెట్టేది
వినాలనే
వింటున్నారన్న
చిన్నతనమెందుకో మరి

*****

పెద్దయ్యేది
జంధ్యం పడ్డాకో
చాపెక్కాకో కాదు
ముల్లు గిల్లితే
అసంకల్పిత ప్రతీకారమేదో
పొలికేకలు పెడుతుంది
మన పెద్దరికపు విలువ
వినగలిగే వారుంటే......

*****

మనసు చిన్నబుచ్చుకుంటోంది
ప్రతీసారి చిన్నదవుతోంది కూడా.
కరిగి అదృశ్యమయే అదృష్టం.....
చక్కెర మీదా అసూయ తెప్పిస్తున్నావే దెయ్యం







Tuesday, 14 August 2012

పంద్రాగస్టు

"ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ"
చాలా చిన్నదయిపోయింది ఈ మాట, అంత పెద్ద భావానికి.



 
మా తుజ్హే సలాం.


                                                                     

Friday, 10 August 2012

Who am I kidding? :) నేనూ నా సంగీతం 3


ఎందుకో చిన్నదై పోతుంది పిచ్చిది.
guess am yet to attain the post conventional stage of thinking :)
Nothing to be ashamed of, it must be celebrated.
ముమ్మాటికీ అంతే


****
యాదృచ్చిక రత్నం
మజునూలేంతోమందికి గజినీలెంతోమందికి 
ఈ కథనే చెప్పిందీ జోకొట్టి
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ........

యాదృచ్చికంగా కనుగొన్న రత్నాల  ఆనందం ఎంత గొప్పదో.

మళ్ళీ పై పాటను గుర్తు తెస్తూ ఇంకో యాదృచ్చిక రత్నం

ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టుకున్నా వినలేదు పెద్దగా ఈ పాటను
పల్లవి ఆకట్టుకున్న పాటలను అస్సలు వదిలేది లేదు మరిది ఎలా మిస్సయ్యిందో 
"ఏరా మునుసామి బుల్లెమ్మను కొట్టావంట
ఏరా మునుసామి?
ఏమే బుల్లెమ్మా మునుసామిని కొట్టావంట 
ఏమే బుల్లెమ్మా...................(Vaa cinimaa)
అంటూ మొదలెట్టిన పాట
దువ్వెనకున్నా పళ్ళూ 
(ముప్పైరెండునా పళ్ళు అని ముందు తప్పుగా వినెసుకున్నా బానే ఉండింది)
లాభం లేదు.....
ఎవ్వరినీ కొరకదంటా
పళ్ళు లేని చెప్పు 
చూడు

కొరికి కొరికి చంపుతోంది
ఈ చరణంతో పట్టేసింది
 BLOWN OUT.........THAT'S ALL.



*****
Base voice songs

ఓ రంగయో, పూల రంగయో ఓర చూపు చాలించి సాగిపోవయో
పాట వింటున్నాను అంటే
నీకు పాడుకునే వీలున్న పాటలే ఎన్నుకుంటావు అంది ప్రాణం ఒకప్పుడు
యెస్ డియర్. 
బేస్ వాయిస్లో పాడిన పాటలు, పైగా ఆలాపనలు ఉన్నవి ఎంత బావుంటాయో 

నడిరేయి ఏ ఝాములో
నాన్నకు ఎంతో ఇష్టమైన పాట
ఏడు కొండల వాడ ఎంకటారమణా ...పాటతో పాటు

మరీ వెంట వెంటనే కాకుండా కొంచం సమయం ఉంటుంది స్త్రీ పురుష గాత్రానికి i.e in transition from ghantasaala maastaaru to the female lead singer. నా గుంతుకతో  ఆ రెంటినీ పట్టుకోగలనా అని ప్రయత్నించటం నిజంగా బావుంటుంది.

అమ్మా.............అంటూ ఆ ఆలాపన వింటూ
ఆ ఆలాపనను అనుకరిస్తూ, అనుగమించండి
ఎంత బావుంటుందో.....సూపర్.
మనసెంత ఝల్లుమంటుందో!!

అడగవె మా తల్లి అనురాగవల్లీ 
అన్న మాటలు అగైన్స్ట్ ద ఫ్లో ఎందుకు రాసారో
అక్కడ అడగవె మాయమ్మ అలివేలు మంగా అని రాస్తే సరిపోయేదే
మిగితావాటినెక్కడా మార్చకుండా ఇక్కడొక్క చోటే మారుస్తారు మాటలను 
చాలా బావుంటుంది ఆ కూతురి కంఠంలో 
వెంటనే ఘంటసాల మాస్టారుగారు
అడగవె మాయమ్మ అలివేలుమంగా అంటూ మంద్రంగా (అమంద్ర స్వరాలేనా?) పాడతం
ఆ రెంటిని ఒకరే పాడుతూంటే 
రెండు శ్రుతులు (శ్రుతులేనా అవి???) ఒకరే పాడటం కాదు పాడాలని ప్రయత్నించటం అలా మార్చగలనా లేదా గొంతును అని చూసుకోవతం భలే సరదా అయిపోయింది నాకు

మూడు సార్లు నాలుగు సార్లు పాటను అరగదీస్తే మన గొంతుతడారిపోతుంది, అయినా Its worth it 
అనిపిస్తుంది ఇలా పరోక్షంగా సంగీత పాఠాలు తీసుకోవటం 



సడంగా మొత్తం వాల్యూం తగ్గించేసి ఒక రెందు పాదాలు పాడి మళ్ళీ అంతే సదంగా వాల్యూం పెంచి సమయం కరెక్ట్గా పట్టుకున్నానా లేదా అని చూసుకోవటం.....అదో తుత్తి లెండి సంగీత సాధన మానేసి రెండేళ్ళయిపోయిందన్న బాధలో.

*****

అబ్బో...
 Interlude is ...pch...అంతగా ఏం గొప్పగా లేదు
కాని

అబ్బో...


అబ్బో నేరేడు పళ్ళో 






అబ్బాయిగారి కళ్ళు
అల్లో నేరేడు పళ్ళో

"అల్లో నేరేడు పళ్ళో" 
అంటుంటే తెలుగంటే పిచ్చి మక్కువైపోతుంది.


ఏముందనో ఆ "అల్లో నేరేడు పళ్ళు" అనటంలో అంత అందం పిచ్చి మనసుకే తెలియాలి.

పెంకమ్మాయి గడుసబ్బాయిని పట్టుకుని
పులుపెక్కే పోకళ్ళు
కైపెక్కే ఆకళ్ళు
లేలేతా కొబ్బరి నీళ్ళూ 
అని వెక్కిరిస్తే అబ్బాయూరుకుంటాడా?
ఎఋపెక్కే చెక్కిళ్ళు
ఎదలోనా ఎక్కిళ్ళు
కోరేవి కొబ్బరి నీళ్ళూ
అంటూ అంతకంత సమాధానం చెప్పడూ
నవ్వొస్తుంది వాదులాట 

అబ్బాయమ్మాయి పల్లవులూ, ఈ మొదటి చరణాలు....`అసలు నూరో వంతు పట్టుకోటానికి నా ఆఫీసు ఇంటి నుంచి ఇంకొంచం దూరం ఉంటే బావుండేది అనిపించేంతటి సంగీతం.


*****

అబ్బ చ అబ్బ చ అంటూ పరిచయం చేయబడ్డ పాట మోజులో ఇంకో రత్నం ఉందన్న సంగతి చూసుకోలేదు


అంతా సిధ్ధంగ ఉన్నదీ 
అంటూ మొదలయ్యే ఈ పాటలోని కొంటెతనం 
కట్టిపడేస్తుంది

పైగా 
కన్నె బుగ్గలు కొంచమన్న కందకుండ పసిపాప బుగ్గలా ఉంతే ఎలా అట
ఎంతో ముచ్చటైన సిగ్గులేనితనం, జులాయితనం.
:) :) :) :)


******

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే, మదనములకు?”

 ......అంటూ జరిగే పోతనామాత్యుని పరిచయమో

“సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా”
మార్కు ఎవరిదో చెప్పక్కరలేదనుకుంటాను...ఆ మహానుభావుని మాటలవిరుపుల గారడీనో

ఆ చింత నీకేలరా ......కు ముందు వచ్చే 
 ఆలాపనా
 మాధుర్యమో

ఏవి కట్టిపడేసాయో ఈ పాటకు చెప్పటం కష్తం