Sunday, 19 August 2012

Random Ramblings

నేను అన్న వాడిని మెల్లగా మాయమవుతున్నట్టు తెలుస్తోంది.

*****

రావణుడూ చంపుకున్నాడు,
రాముడూ చంపుకున్నాడు
అవతార పరమార్థం గట్రా తీసేస్తే
ఇద్దరికీ తేడా?

*****

ధర్మ చింతన సమాజ న్యాయం ప్రథమ కర్తవ్యంగా ఉండే వారికేనా?
చాకలివాడికి లేదా ధర్మానుష్ఠాన కర్తవ్యం?
రాచరికానిదేనా ధర్మ చింతన ప్రధమావశక్యం?
రాముడాయోధ్యన పామరుడయ్యుంటే ప్రేమిలా బలయ్యేదా రామాయణంలో?

ఇంటిపెద్దా ఒక రాజేకదా?
అతనికీ ధర్మం తన చిన్ని పరిధిలో, తప్పదు కదా?

*****

కేకలు పెట్టేది
వినాలనే
వింటున్నారన్న
చిన్నతనమెందుకో మరి

*****

పెద్దయ్యేది
జంధ్యం పడ్డాకో
చాపెక్కాకో కాదు
ముల్లు గిల్లితే
అసంకల్పిత ప్రతీకారమేదో
పొలికేకలు పెడుతుంది
మన పెద్దరికపు విలువ
వినగలిగే వారుంటే......

*****

మనసు చిన్నబుచ్చుకుంటోంది
ప్రతీసారి చిన్నదవుతోంది కూడా.
కరిగి అదృశ్యమయే అదృష్టం.....
చక్కెర మీదా అసూయ తెప్పిస్తున్నావే దెయ్యం







No comments:

Post a Comment