నా తప్పులు దిద్దవు
ముస్తాబు చెయ్యవు
నా ఆకలి తెలీదు
నా పోకడా పట్టదు
అసలు నేనే మాయమవుతున్నా
నీ స్మృతిపధాన జీవితాన.
చిన్నదుందమ్మా
తప్పటడుగులప్పుడే
నా అవసరమెక్కువ కదా
మూలపడ్డ స్వాంతనాలూ
మసకబారిన కొత్తపాళీలూ
మిణుకు మిణుకుగానే ఉంటున్న
కవితా తారలు, ఆవేశపు తునకలు
అన్నీ నీకు నా నిర్లక్ష్యమే చెప్పాయి.
కానీ నీవూ
తల్లివవుతావు తల్లీ
ఈ తండ్రితనం కనిపిస్తాయన్నిటిలో.
అదేవిటే ఇంతలో ఆ పిచ్చి నవ్వేమిటే?
ష్
అన్నీ బయటకు చెప్పకలా
నా అసూయలూ నిజస్వరూపలూ ..........