Monday, 1 July 2013

నీకు నేనంటే నిర్లక్ష్యం

నా తప్పులు దిద్దవు 
ముస్తాబు చెయ్యవు 
నా ఆకలి తెలీదు 
నా పోకడా పట్టదు 
అసలు నేనే మాయమవుతున్నా 
నీ స్మృతిపధాన జీవితాన.  

చిన్నదుందమ్మా 
తప్పటడుగులప్పుడే 
నా అవసరమెక్కువ కదా 
మూలపడ్డ స్వాంతనాలూ   
మసకబారిన కొత్తపాళీలూ 
మిణుకు మిణుకుగానే ఉంటున్న  
కవితా తారలు, ఆవేశపు తునకలు  
అన్నీ నీకు నా నిర్లక్ష్యమే చెప్పాయి. 
 కానీ నీవూ 
తల్లివవుతావు తల్లీ 
ఈ తండ్రితనం కనిపిస్తాయన్నిటిలో. 

అదేవిటే ఇంతలో ఆ పిచ్చి నవ్వేమిటే?

ష్ 
అన్నీ బయటకు చెప్పకలా 
నా అసూయలూ నిజస్వరూపలూ ..........  



No comments:

Post a Comment