ఏమో.
మజిలీకంటే
పయనమెక్కువయ్యింది
అదయితే తెలుసు.
మిణుక్కుమంటూ....
వెలుగూ వేడీ
రెండూ లేవు
అయినా
తోడయింది!!!
అహమేననుకుంటా
"నే వెడుతున్నదే బాట" .
సుగమం కాదొప్పుకుంటా
మనసుగమమది మరి.
చాలుగా.
రేపొచ్చే ఉషస్సులూ
తప్పక అనుగమించే
సాయంసంధ్యలూ
అలవాటయిపోయేలా
పయనమొకటే.
నవ్వొస్తోంది
నీటిబొట్టందని తామరాకవాలని
మొదలెట్టిన పయనంలో
లక్షం కనుమరుగవటం సహజమే.
పయనం తోడయింది
నవ్వొస్తోంది.
వెంటనే గుర్తొస్తుంది
ఎక్కాల్సిన మెట్లెన్నోనని
మధ్య మెట్టుని చూసి
నవ్వుకుంటూ ఉన్నానని smile emoticon
పర్లేదు
పయనాన్ని చివరాఖరుగా
ఆఖరు హుతభుక్ప్రియగా
వాడుకోవచ్చులే!!!