"చూడు చూడు ఆరాటం"
గాలి గుసగుసలు
"ఈ మధ్యే కదా
పున్నమి పోయింది"
ముక్కున వేలుతో ఆకాశం
ఆశపోతంటూ
ఫక్కున నవ్వే తారాపథం
గాలి గుసగుసలు
"ఈ మధ్యే కదా
పున్నమి పోయింది"
ముక్కున వేలుతో ఆకాశం
ఆశపోతంటూ
ఫక్కున నవ్వే తారాపథం
అవును మరి.
అష్టమి నవముల్లోనే
కృష్ణపక్షంలోనూ
అలలలా "ఆ" ఎత్తుకు చేరాలనుకోవటం
అష్టమి నవముల్లోనే
కృష్ణపక్షంలోనూ
అలలలా "ఆ" ఎత్తుకు చేరాలనుకోవటం
పూర్ణచంద్ర స్ఫూర్తికై అర్రులు చాచటం
ప్చ్!!! అబ్బే.
ప్చ్!!! అబ్బే.
ఆ సాగర లోతుల్లో మాత్రం
ఓ కన్నీటి చుక్క
నిశ్శబ్ధంగా
ఓ అస్థిత్వానికీ
ఓ బలహీనతకూ
ఓ యోగానికీ
సాక్షీభూతమై
స్వాతీ ముత్యమైపోయింది.
ఓ కన్నీటి చుక్క
నిశ్శబ్ధంగా
ఓ అస్థిత్వానికీ
ఓ బలహీనతకూ
ఓ యోగానికీ
సాక్షీభూతమై
స్వాతీ ముత్యమైపోయింది.
ఒక్క మనిషికేనా ఆ హక్కు?
ప్రకృతిలోని ప్రతీ అణువూ
తన ప్రతిబింబాన్నీ
తన స్ఫూర్తినీ
తన లయాన్నీ
ఎంచుకుని
హత్తుకుని
లీనమైపోయే
ఆ మజిలీనీ, లక్షాన్నీ...
ఎన్ని కృష్ణపక్షాలున్నా
శుక్లపక్షాలూ ఉన్నంతవరకూ
ఎక్కడో
భూ నభో అంతరాలావలనైనా
వెతుక్కుని
స్వాతి ముత్యం చేసుకుంటూనే ఉంటుంది
ప్రకృతిలోని ప్రతీ అణువూ
తన ప్రతిబింబాన్నీ
తన స్ఫూర్తినీ
తన లయాన్నీ
ఎంచుకుని
హత్తుకుని
లీనమైపోయే
ఆ మజిలీనీ, లక్షాన్నీ...
ఎన్ని కృష్ణపక్షాలున్నా
శుక్లపక్షాలూ ఉన్నంతవరకూ
ఎక్కడో
భూ నభో అంతరాలావలనైనా
వెతుక్కుని
స్వాతి ముత్యం చేసుకుంటూనే ఉంటుంది
No comments:
Post a Comment