చెంపలపై వెచ్చగా
మీ స్పర్శ
మళ్ళీ నా
అస్థిత్వాన్ని
గుర్తు చేస్తూ
పారిపోతున్నానా
పునాదులు చేసుకుంటున్నానా?
నా జనన మరణాల మధ్య నుండే చిన్న డాట్
దాని అన్వయమూ
వేరే వాళ్ళూ, చరిత్రా
చెస్తే చేయొచ్చు
కానీ నచ్చింది!!!
పున్నములకు భయపడి
అలజడినాపే ప్రయత్నమనుకుంటూ
చైతన్యాన్నొదిలేసానా
పారిపోతున్నానాన్న
భయమేసిందో క్షణం
కాదు
అమవశిలోనూ పున్నమి ప్రేరణనూ
ప్రేరణలోనూ నిశ్చలతనూ
నిశ్చలతను జడత్వాన్ని కాదు నిశ్చలతను
సాధించే సాధానా అని మెరిసిందో క్షణం
ఇక ఫరవాలేదు
ఆ చిన్ని చుక్కకు
కాలమూ, ద్వైతులూ
ఏమన్వయం వేసుకున్నా
ఆ క్షణపు మెరుపు చాలు.
An ode to the twin sweet springs of life!
Thanks "Hichki"
(Only problem was - I knew Tourette's can be helped a lot with medicines :) but who cares?

