తల్లీ
పొద్దున్న ఐదున్నరకు లేచి నువ్వు నిద్రకళ్ళతొ లేచి తూగుతూ చదువు మొదలెడితే ...బాల్యంలోకి లాగేస్తున్నావురా. ఇప్పుడెంత గర్వమనీ నాకు ఆ చిన్నప్పటి నా కృషి. నీకూ ఇవి నీ యవ్వనంలోనూ ఆపైనా అలాగే అవ్వాలని ఎంతో ఆశగా ఉందమ్మా. నువ్వెప్పుడో ఈ ఉత్తరాలు చదివి మా నాన్న నాకు రాశారు అని పదిలంగా హృదయానికి దగ్గరగా పెట్టుకుంటే ...నీకెంత హాయిగా ఉంటుందో నీకు తెలియాలి.
బుజ్జోడా
ఏమిట్రా ఆ సంతోషం? ఏమిటా ఎగురుడు? ఏమైందని అలా ఎగురుతావు నేను కనిపిస్తే చాలు? స్కైపులో ఆ చేష్టలేమిటీ? ఎన్నాళ్ళయిందనీ? మూడు వారాలంతేగా? హాయ్ నాన్నా హలో నాన్న అంటూ మాత్రమే అంటావని వాళ్లంటారు ఎక్కిరిస్తున్నారు కూడా ......
కానీ వచ్చి రాని భావ ప్రకటన అని వాళ్లకు తెలియటం లేదెందుకనిరా?
నా బొజ్జపై తాళం వేసే నీ ఉత్సుకత
నే లేనప్పుడు కూడా ఉందని చూసిన క్షణం ... తండ్రీ ఎలా చెప్పానురా ఆ క్షణం విలువ?
నువ్వింకొకరిని ఎత్తుకుని ముద్దాడిన క్షణం ..... ఆ విలువ తెలిసిన క్షణం .... నే పక్కనే ఉంది తీరుతా .... అపుడు నువ్వు నా వైపు చూసే ఆ చూపు ....చాలదూ?
No comments:
Post a Comment