Thursday, 28 June 2018

రైలు మరో కూతెడుతోంది.


అమ్మయ ఇంకో స్టేషను దాటింది అనుకొని సంతోష పడటానికిదేమన్నా కోరి చేరుకుంటున్న గమ్యమా? గింజుకుంటున్నా లాక్కుని పోయే ప్రస్థానమే కదా? అయిన హేవిటో ప్రతీ స్టేషను కూతకూ అదో ఆనందమూ, పండగ వాతావరణమూ.... అటు పండగ దేనికో తెలిసి దరి చేరుతున్న సంతోషమనుకోవటానికీ లేదూ .....ఇటు పయనమే పూర్తి జీవనమనుకునేంత అమాయకత్వమూ కాదు. అటు ఇటు ఊగిసలాటల సయ్యాటలకు పెదవులపై నవ్వు మాత్రం వచ్చేంత, ఎంతో, ఏదో కొంచం, జరిగిందని మాత్రమొప్పుకోవాలి.
బండి బానే నడుస్తొంది. 

నడిపించేవాడి పుణ్యము కొంచెం ఎక్కువగానే స్ప్రుశిస్తూనే స్ప్రుహిస్తూనే ఉండేట్టు చేస్తున్నాడు.

పెట్టె నిండి కళకళలాడుతూ ఉంది. కేరింతల చిరునవ్వులతో, తెలియని అమాయకత్వపు బంధుత్వము బంధిస్తూనే కితకితలెడుతోంది. భుజానికెత్తుకున్న ఉప్పుమూట ఇంకొంచం సేపు ఇంకొంచం దూరమంటూ మారాం చేస్తూ ....హాయిగా. చివరిదాక అంటూ పరిచయమయిన నేస్తం అలకలతో, క్షమాపణలతో సహగమిస్తూనే ఉంది. 

అన్నీ పరికిస్తున్న ముగ్గుబుట్ట నిర్మలంగా నవ్వేస్తూ తనూ చిన్నారి చేతిలో ఆటబొమ్మయిపోతూ ... కరిగిపోతూ, ఉంది.

Wednesday, 6 June 2018

Letters from Children - 1


ఏమయిపోయావనడగనులే......

ఎన్ని రోజులయిందో 
వేళ్ళ వెచ్చతనం, నను నడిపించటంలో వేగం,
ఆగి చూసుకోకపోవటంలో పొగరు
నాలో జీవం నింపి నువు పోసేది మాత్రం .......నీ ప్రాణం !!!
...అయినా నాకు కోపం రావటంలా
నీ స్ఫందన నా గీతగా, నీ ఆలొచనా పరిధిలో , నీ వేళ్ళట్టుకుని నడవటమే నాకిష్టం.
రావయ్యా.

పిల్లలకో ఉత్తరం - 3

తల్లీ 
పొద్దున్న ఐదున్నరకు లేచి నువ్వు నిద్రకళ్ళతొ లేచి తూగుతూ చదువు మొదలెడితే ...బాల్యంలోకి లాగేస్తున్నావురా. ఇప్పుడెంత గర్వమనీ నాకు ఆ చిన్నప్పటి నా కృషి. నీకూ ఇవి నీ యవ్వనంలోనూ ఆపైనా అలాగే అవ్వాలని ఎంతో ఆశగా ఉందమ్మా. నువ్వెప్పుడో ఈ ఉత్తరాలు చదివి మా నాన్న నాకు రాశారు అని పదిలంగా హృదయానికి దగ్గరగా పెట్టుకుంటే ...నీకెంత హాయిగా ఉంటుందో నీకు తెలియాలి. 


బుజ్జోడా 
ఏమిట్రా ఆ సంతోషం? ఏమిటా ఎగురుడు? ఏమైందని అలా ఎగురుతావు నేను కనిపిస్తే చాలు? స్కైపులో ఆ చేష్టలేమిటీ? ఎన్నాళ్ళయిందనీ? మూడు వారాలంతేగా? హాయ్ నాన్నా హలో నాన్న అంటూ మాత్రమే అంటావని వాళ్లంటారు  ఎక్కిరిస్తున్నారు కూడా ...... 
కానీ వచ్చి  రాని భావ ప్రకటన అని వాళ్లకు తెలియటం లేదెందుకనిరా? 

నా బొజ్జపై తాళం వేసే నీ ఉత్సుకత 
నే లేనప్పుడు కూడా ఉందని చూసిన క్షణం ... తండ్రీ ఎలా చెప్పానురా ఆ క్షణం విలువ?

నువ్వింకొకరిని ఎత్తుకుని ముద్దాడిన క్షణం ..... ఆ విలువ తెలిసిన క్షణం .... నే పక్కనే ఉంది తీరుతా .... అపుడు నువ్వు నా వైపు చూసే ఆ చూపు ....చాలదూ?


rim jhim gire saavan

ఎన్నేళ్ళ తరవాతో .... మళ్ళీ మళ్ళీ అవే .... వెచ్చగా తట్టి లేపుతున్నాయి. 
నువ్వు చావలేదు అంటూ ఎలుగెత్తి చాటుతూ.