సమస్య తాను కన్న కూతురుని పెండ్లియాడుతున్నతన పతిని చూచినా సతి ముదము చెందేన్.నా పూరణకంటి న్నవమాస తపఫ్ఫలితమున్నాకోసగు నా యత్త బాధ
న్కంటి న్నిరువది మూడేళ్ళ కష్ట ఫలమున్వీడు నా మామ
న్కంట నీరు నిండ చూడ
తను కన్న కూతిరిన్పెండ్లి యాడుతున్న తన పతిని చూసి నా సతి ముదము చెందెన్నంచు తన బాధన్వీడి సంతసమునున్న నా బావ
న్గంటిన్వీరెల్లరి ముద్దుల పట్టియగు నా సతి గండ్ల దుహ్ఖానంద భాష్పము
న్గంటి లోటు నీకున్దెలియనీయనంచు మనము
న్పట్టితి ప్రతిజ్ఞ నాయిందు వదన వదనంజూచి.
పదవిభజనకంటిన్ నవమాస తపః ఫలితమున్ నాకు ఒసగు నా అత్త బాధన్,
కంటిన్ ఇరువది మూడేళ్ళ కష్ట ఫలమున్ వీడు నా మామన్-కంట నీరు నిండ చూడ కన్న కూతిరిన్ ,
"పెండ్లియాడుతున్న తన పతిని చూసిన ఆ సతి ముదము చెందేన్" అనుచు తన బాధన్ వీడి
సంతసమునున్న నా బావన్ కంటిన్,
వీరెల్లరి ముద్దుల పట్టియగు నా సతి కండ్ల దుహ్ఖానంద భాష్పములన్ కంటి,
"లోటు నీకున్ తెలియనీయను" అనుచు మనమున్ పట్టితి ప్రతిజ్నన్ ఆ/ (ప్రతిజ్ఞ నా )ఇందువదన వదనం చూచ్చి.
సరదాగా మేము కొంతమంది సాహిత్యోభిలాషులం చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ సమస్యా పూరణం అన్న మా ఆర్కుట్ కమ్యూనిటీ. అందులో నా తోలి ప్రయత్నమిది