Sunday, 27 April 2008

నేనెట్లైతి ఇంటి పెద్దన్?

ఆవేశపరుండ, కోపమునాపజాల

అపాయమున యుపాయంబు చేజాల

కోరికల దాస్యుండ, అనుభవ శూన్యుండ

ఎట్లైతి నే ఇంటి పెద్దన్?

మూలనిడి తల్లిదండ్రుల్

సుభాషితముల ఆలి విడిన్

పరుష, కఠు వాక్యుండ

ఎట్లైతి నే ఇంటి పెద్దన్ ?

జన్మమిచ్చె తెలివి

తెలివి తెచ్చె చదువు

చదువిచ్చె కొలువు

కొలువు దెచ్చె ధనము

ధనము జేసే మనువిక

మనువు జేసే మగడిగ

తరచిన జన్మ తెచ్చె నిటుల భోగము

మరి భోగమేల తెచ్చెరా పరుషము?

జనని క్షోభ కారణభూతుండా

ఇలనేలలేదురా నీకు నరకము?

(తొందరపాటున తల్లిని పరుష పద జాలముతో క్షోభ పెట్టిన సందర్భమున కన్నీటితో ....)

1 comment:

  1. డియర్ ఫ్రెండ్
    అంతటి సున్నితభావాలను కలిగి ఉన్నారు కనకనే ఇంటి పెద్దైతిరి. అది మీ కుటుంబ అదృష్టం.

    బొల్లోజు బాబా

    ReplyDelete