మల్లె తెస్తి, గూటికస్తి,
గుమ్మం కాడ నిన్నూ సూస్తి
బొమ్మవైనావో, మూగవైనావో
ఉలకవెందే, పలకవేందే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....51
సద్దు యినపడలె,
రాక అవుపడలె,
ఏడ మనసైనాదో
ఏటి తలపైనాదో
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....52
ఏ కలగంటివో
ఏమనుకుంటివో
ఆ సిరు నవ్వులేమే
ఆ సిగ్గు నిగ్గులేమే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా......53
సందె సాచ్చంగా
బంగారు లచ్చల్లె
నిన్నట్టా సూస్తుంటే
పొద్దేమాయో తెల్వదే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....54
నీ సెవి తెమ్మ
నీ సిన్న కమ్మ
నా గుండె కరగంగ
నీరెండ మెరవంగ
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....55
నుదిటి తిలకం, బుగ్గ సిగ్గు
పెదవి గాటు, సందె సూరీడు
ఏది ఎరుపో, దేని గెలుపో
తెలియ రాదే, పెద్ద సిక్కే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....56
సంద్రూనేలాయే, నాకు గుబులాయే
మచ్చలున్నోడే, పాడు సూపోడే
గుమ్మానుంటివా, కన్ను యేసేనే,
ఎన్నలై కురిసేనే, ఒల్లంతా తడిమేనే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....57
సిలకలన్నీ గూడు సేరే
బయటనున్న సిలక నీవే
దేవి లేని దేవలమల్లె
యిల్లంతా బోసాయే
నీతోనేట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా.....58
కాలి మువ్వల, సేతి గాజుల
వేల మాటల, కోటి నవ్వుల,
సద్దు తేవే, సేద తీర్సవే,
లచ్చి రావే, నా సిట్టి రావే......59
No comments:
Post a Comment