Sunday, 22 June 2008

ఏదో బాధ, ఏదో కోత

"ఇంకెక్కడి పాపి కొండలు మిత్రమా
పులిచింతల వల్ల మునిగి పోనున్నాయి"
విన్నప్పటి నుంచి ఎదోగా ఉంది......
నోరంతా చేదు వేప తిన్నట్టుగా........

గోదారి గట్టు కాదు నాది
పాపి కొండలు చుసే ఎరుగను నేటికీ
"పాపి కొండల నడుమా, పాపాలు కడగంగా..."
అంటూ వర్ణనలే ఆవలంబనవగా
ఏదో ఉంది మా సంబంధం
చూడకుండానే పెనవేసుకున్న అనుబంధం

అందుకే గుండె బరువయింది
"రైతన్నల పొలాలు స్యామలమే కదా"
విజ్ఞత ఎంత సర్ది చెప్పినా, ఊహు- వింటేగా........
"బాధే సౌఖ్యమనే భావన రానీవోయి" అన్నట్టు
మూల్గుతూనే వుండి, మండుతూనే ఉంది.

అపర భాగీరధులమో,
కటిక భాస్మాసురులమో
తెలీని సుషుప్తావస్త.
"పెక్కు మంది" మంచికై
"కొద్ది మంది" కన్నీరు ఓకే
ఆది నుండి ఉన్నదే కదా.......

"పోనీ ఒక సారి వెళ్లి చూసోద్దామా"
ఆశ పడే మనసుకు సర్ది చెప్పాల్సిన ఖర్మ!!!!!
"నాలుగొందల పౌండ్లు వృధా కదా"
నగలు కొనలేదనే భార్య గుర్తుకు రాగా...........

ఏదో బాధ, ఏదో కోత
ఇకపై పాపి కొండల ప్రస్తావనే రాదనుకుంటే.....

1 comment:

  1. రమ్యగారికి, పూర్ణిమ గారికి,

    చాలా ధన్యవాదాలండి, వివరాలు ఇచ్చినందుకు.

    ReplyDelete