"హిందువులు తమకు అన్యాయం జరిగినా పట్టించుకోరు
పట్టించుకోనేది మేమొక్కరమే!
మమ్మల్ని ఖండించిన వాడు హిందూ కాడు"
ఇలా సాగే అతివాదులకిది కనువిప్పా?
మత అసహనతను ఖండించే ప్రతివాడూ
"సూడో సెక్యులరిస్టు " అయిన ఈనాడు,
"హిందూత్వము" అతివాద పదమైన నేడు
ఇది మితవాద హిందూ ఆత్మ ప్రకటనా?
"హజ్" లకు సహాయం చేసే రాచరికం
"అమర్ నాథుల"కు సహాయార్థం
చేసిన "భూదానం" చేసెను స్వకైంకర్యం
ఈ శిఖండులకు లేదేలా సిగ్గు-షరం ?
రెండు మూడు నెలల భూమి వాడుక
ఎలా అయ్యె రా అది జనాభా మార్పు ప్రాతిపదిక?
ఈ వాదనకు తల వొగ్గిన చేవ లేని రాచరికం
కనరాదా కాశ్మీరంలో పండితులపై అరాచకం?
రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు
మనకేమిలేమని ఊరుకొనే నీరసత్వాలు
మత సంరక్షణ మరచిన మఠాలు
ఇవేనా నేటి మన హిందూ జవ సత్వాలు?
కాదు నేటి అవసరం "అపర చాణక్యం",
కాదు "ఎవరో వస్తారని ఏదో చేస్తారని " ఎదురు చూడటం,
అలాగే-కాదు "వారి"ని పీచమణచటం పరిష్కారం
దీనికి ఒకటే మార్గం- సైలెంట్ మెజారిటీ గళం.
"మాకు అన్యాయం జరిగిందంటూ" ఘోషించాలి
"సహించేది లేదంటూ" ఉపక్రిమించాలి, సాధించాలి
రాకూడదు "అతివాద కలిమి" ఈ ఘోషకు
కారాదు మితవాద మేక అతివాద పులికి బలి నేడు.
జమ్మూలో జరుగుతున్న పోరాటంలో సైలెంటు మెజారిటీ గళం వినిపించింది. దీని వెనుకే అతివాద మతపార్టీల రాజకీయత పొడసూపింది. రెంటికీ మైత్రి కుదరకూడదని ప్రార్థిస్తూ.......
maitri enduku kudarakoodadu, kudaraali, kudrinappude tikka kudurutundi
ReplyDelete