ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?
నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే

నాటి కార్యముల నీడ, వీడకున్నాది లింగా.............
నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే
నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే
నాటి కార్యముల నీడ, వీడకున్నాది లింగా.........
ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?
ప్రజా సౌఖ్యము చూచి నేడు, నిన్న మరుతమంటే
ప్రజా సౌఖ్యము చూచి నేడు, నిన్న మరుతమంటే
రేపు రాగల కాళుడు, భయము గొలుపేరా లింగా.........

మహానుభావా, మాదేవ శంభో! మా లింగ మూర్తి ....
ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
నాటి తోడేలు నేటి మెకమేట్లాయేరా లింగా.......
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
నాటి తోడేలు నేటి మెకమేట్లాయేరా లింగా........
ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
మరియా దుష్ట మిత్రులేమిరా లింగా.......
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
మరియా దుష్ట మిత్రులేమిరా లింగా.......
ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?
గుడ్డిలో మెల్లయని, సమాధాన పడదమంటే
గుడ్డిలో మెల్లయని, సమాధాన పడదమంటే
రేపు కన్నొకటి, పెరకక యుండునా లింగా.........

ఏమీ సేతురా?
ఏమీ సేతురా?
నేటి గుర్జరీ దేశాన్నీ, దాన్ని పాలించే రాజునీ, ఆ రాజు కొలువునూ, తలచుకొని నేను పడే బాధకు రూపమిది.
నేటి గుర్జరీ దేశ సంపద, నేటి గుర్జార ప్రజా సౌఖ్యములూ, నేటి రాజు శాంతము తలచి యాతని కొలువు కొల్చవలేనా............
లేక
నాటి కాళము, నాటి , ప్రవర్తన మారినా మారని మిత్ర కూటమి, మిత్ర కూటమి నైజమూ చూచి బెదరాలా.................. అన్నది నేటికీ తెగని సమస్య నాకు.
Friday, 10 October 2008
Saturday, 4 October 2008
३.పెళ్లి - వ్యాపారం -selection
December 2007 లో రాసుకున్న ఈ కథను బ్లాగులో ఎక్కించటానికి ప్రోత్సహించిన కల గారి "ప్రేమ వేరు పెళ్లి వేరా?" అన్న టపాను మొదట చదివి తరవాత ఇది చదవండి.
"పెళ్లి అనేది ఒక వ్యాపారం" అన్నారు నాన్న. "అదేంటి నాన్నా అలా అంటారు" అన్నాను నేను నిరసనగా. నాన్న ఎప్పుడూ ఇంతే, ఏదో ఒక పరుష వాక్యం అలా పడేస్తూంటారు తన సంసారం తలచుకొని. కారణాలు ఏవైనా అమ్మా నాన్నల పెళ్లి "రాజీ పెళ్లి". అభిరుచులు, మనసులు కలవని సంసారాన్ని చేస్తూ మాటల ద్వారా కసి తీర్చుకొనే సగటు మధ్య తరగతి సంసారాలకు ప్రతీకలు ఇద్దరూ.
"నిజమే కదరా. స్త్రీ పురుషులిద్దరూ ముందు అందం చూసుకుంటారు, తరవాత స్త్రీ కాబోయే వాడి ఆర్ధిక పరిస్థితి చూసుకుంటుంది, మగాడు రాబోయే కట్న కానుకలు చూసుకుంటారు. అంటే మన దగ్గర ఉన్నది అవతలి వారికి ఇచ్చి మనకు నచ్చినది అవతలి వారి వద్ద నుంచి పుచ్చుకుంటాము అనమాట. అంటే ఒక రకం barter system అనమాట. ఈ barter system అనేది వ్యాపార వ్యవస్తకు పూర్వపు రూపం అని చదువుకోలేదా నువ్వు?" నాన్న సూటి ప్రశ్న. "అయన మాటలకేం గాని నువ్వు కాలేజికి పద. టైం అయ్యింది." అంటూ నన్ను బయలుదేరదీసింది అమ్మ.
----------------------XXXXX-------------------
అన్యమనస్కంగానే కాలేజికి చేరుకున్నాను. కాలేజిలో మెడిసిన్ లెక్చర్లో కూర్చున్నా అవే మాటలు గుర్తుకు రాసాగేయి. మధ్యలో లేచి వచ్చేసి కాంటీన్లో కాఫీ తాగుతూ కూర్చున్నా.ఆలోచోనలలో పడి ఆసావేరి దగ్గి తన ఉనికి తెలిపే దాకా తెలీనే లేదు. నాకు ఉన్న స్నేహితురాలలో తను ప్రత్యేకం. స్నేహితురాలి కంటే ఎక్కువ కూడా అయ్యుండొచ్చు.
"ఏంటి అలా ఉన్నావు? ఎన్నడూ లేనిది క్లాసు మధ్యలో వచ్చేశావు? ముందు బెంచిలోంచి లేచి బయటకు వచ్చేశావు, అది కూడా ప్రోఫెసోర్ క్లాసు లోంచి. ఉందిలే నీ పని ప్రాక్టికల్స్లో" మూడ్ ని లైట్ చేయటానికి ప్రయత్నిస్తూ అని ఎదురుగా కూర్చుంది. "ఏం లేదు అసూ, మనసు బాలేదు" అంటూ తనను అడక్కుండానే బోండా, కాఫీ చెప్పేసాను. వచ్చిన బొండాను తింటూ మవునంగా ఉండిపోయిన తనను చూసి "అదేంటి ఎందుకు బాలేదని అడగవా?" అన్నాను.
"నీలాటి భావుకులను బలవంత పెట్టకూడదు. చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావు, లేదంటే అస్సలు చెప్పవు. అందుకే అడగలేదు." చిరునవ్వుతో చెప్పింది. అందుకే తనంటే నాకు ఎంతో ఇష్టం. మనసులను, మనుషులను ఇట్టే చదివేస్తుంది.
నిముషమాగి మొదలెట్టాను లేలేత ఎండలో మిల మిలా మెరుస్తున్న తన చెవి తెమ్మకున్న ముత్యపు జూకానూ చూస్తూ "ఇవాళ నాన్నతో చిన్న చర్చ జరిగింది. పెళ్లి అంటే నా దగ్గర ఇది ఉంది, నాకు ఇది కావాలి, నీ దగ్గర నాకు కావాల్సినది ఉంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ జరిగే ఒక వ్యాపారపు తంతు అని అంటారు. అక్కడయితే దాన్ని వ్యతిరేకించి వచ్చేసా కాని ఆలోచిస్తే అందులో కొంచం నిజం లేకపోలేదు అని అనిపిస్తోంది అందుకే బాధగా ఉంది." అంటూ వివరించాను.
"ఒక్క నిమిషం" అంటూ లేచి వెళ్లి తన చేతులు కడుక్కొని వచ్చి ఎదురుగా కూర్చుంది, "ఇందులో నీకు నచ్చని బాధ పడాల్సిన విషయం ఏమిటి?" అని అడుగుతూ. "పెళ్ళిళ్ళను transactions అన్నారానా, పెళ్ళిళ్ళు transactions అయ్యాయనా లేక transactions తప్పనా? ఏది నీ బాధకు కారణం?" అని మళ్ళీ ప్రశ్న.
"అంటే?" తన ప్రశ్నలు అర్థంకాక అన్న నాకు చిన్న పిల్లాడికి టీచరమ్మ చెప్పినట్టు వివరించసాగింది "అంటే పెళ్లి అనేది "పవిత్రమైన బంధం" వగైరాలుగా ఫీల్ అయ్యే నీకు ఒక రియాలిటీ చెక్ జరిగినందుకు బాదేస్తోందా లేక barter system/వ్యాపారం అన్న derogatory పదాలు పెళ్ళికి వాడబడ్డాయి అనా నీ బాధ?" అని.
"అలా అంటావేంటి అసూ నువ్వు కూడా, పెళ్లి అనేది ఉత్త వ్యాపార ధోరణేనా?" బాధగా అడిగాను. అసూకు కోపమొస్తే ఎలా ఉంటుందో ఇంతవరకు నాకు తెలీదు- తనకు మామూలుగా కోపం రాదు కనుక. కాని ఇప్పుడు తన బుగ్గలు ఎర్రపడటం, పెదాలు వణకటం సిగ్గుతో అని మాత్రం నేను అనుకోను. అణిచిపెట్టుకున్న కోపం అలా బహిర్గతం అయింది అని నాకు అనిపించింది. "ఈనాటి మన యువతతో వచ్చిన తంటానే ఇది. సినిమాలతో ఎంతగా influence అయిపోతున్నామంటే స్వంతంగా ఆలోచించే గుణమే కోల్పోతున్నాము. ప్రతి సినిమాలో చూపాల్సినవి అన్నీ చూపి చివరికి కొన్ని సీనుల్లో మాత్రం ప్రేమ ఇంత గొప్పది పెళ్లి ఇంత పవిత్రమయినది అంటూ డైలాగులు చెప్పిస్తారు ముసలి హీరోలతో, అందాలే తాప్ప అభినయం ఒలకపోయటం చేత కాని హీరోయినులతో-అవి విని మీలాటి వారు అంతా ఎంతగా conditioned అయిపోతారంటే బయట సమాజంలో జరుగుతున్నా వాస్తవాలను గుర్తించారు. అవి ఎవరైనా ఎత్తి చూపెడితే ఇదిగో ఇలాగే బాధ పడుతూ ఉంటారు."
ఆవేశంగా చెప్పుకుపోతున్న తను దీర్ఘమైన శ్వాస తీసుకొని మళ్ళీ చెప్పటం మొదలెట్టింది " ఎందుకు నీకు బాధ. పెళ్లి అనేది ఒక సామాజిక ఆచారము. సమాజ శ్రేయస్సుకై, వయసులో ఉన్న స్త్రీ పురుష సంభందాలను నియంత్రించటానికి ఏర్పడిన ఒక బేసిక్ వ్యవస్థ. ఆచార వ్యవహారాలు, కులమత రీతుల వల్ల ఎంత రూపాంతరం చెందినా అది శారీరక వాంఛలకై ఏర్పడ్డ ఒక వ్యవస్థ మాత్రమె. అలాటప్పుడు తమ తమకు నచ్చిన వారిని select చేసుకోవటం, వారినే చేసుకోవటం అనేది మామూలే. దాన్నే మీ నాన్న వ్యాపారంగా భాష్యీకరించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు కాని కొంచం కటువుగా చెప్పారు అంతే.కాని సినిమాల వల్ల బాగా conditioned అయిన నీలాటి వారు అది వప్పుకోరు, అనవసరంగా బాధపడతారు. నిజాన్ని నిజం అని ఒప్పుకోటానికి అంత బాధ ఎందుకు మీకు?" కోపంగా ముగించింది.
-----------XXXXX---------
చిన్నగా చప్పట్లు వినపడ్డాయి. చర్చలోపడి గమనించలేదు కాని మా మిత్ర బృందమంతా మూగేసారు మా చుట్టూ. మేమిద్దరం కాక ఇంకా ఇద్దరు నా స్నేహితులు, తన స్నేహితురాళ్ళు ఇద్దరు మొత్తం మా ఆరుగిరికీ "philosophers" అని పేరు మా క్లాసులో--ఊరికే రాలేదులెండి ఆ పేరు. ఎప్పుడు చూసినా ఇలా సైద్ధాంతికపరమైన వాదనలూ, చర్చలే మా మధ్య.
"బాగా చెప్పావు" అని మావాడు ఒకడంటే "ఏంటి నువ్వు కూడా behavioural sceince గాని మొదలెట్టావా" అంటూ పరాచికాలాడింది తన స్నేహితురాలు. "అవును మరి usa లో ఉన్న నీ finacee ని చేరుకోటానికి USMLE కి ప్రిపేర్ అవుతున్న నీకు, అందులోని సబ్జక్ట్స్ తప్ప ఇంకేం కనపడవు" అంటూ తనను ఉడికించినది అసూ. అప్పటి దాకా గంభీరంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా తేలికపడింది ఈ జోకులతో.
"కాని అసూ ఈ సెలక్షన్ అన్నది ప్రేమ వివాహాలకు వర్తించదేమో" అన్నాడు ఇంకో మిత్రుడు. అంటే మా చర్చ దాదాపుగా విన్నారనమాట. అసూ ఏదో చెప్పేలోగానే ఇంకో స్నేహితురాలు మొదలెట్టింది "లేదు ప్రేమ కూడా ఒక సెలెక్షనే. ఇది నా స్వానుభవం." చెప్పటం మొదలెట్టింది తను. ఈ మధ్యనే ప్రేమించిన వాడితో ఎంగేజ్మెంట్ అయిన తనకంటే సాధికారంగా ఎవరు చెప్పగలరు అనుకుంటూ మేమందరం వినసాగాము "మనకు మొదట కొన్ని preconceived ideas ఉంటాయి మన జీవిత భాగ స్వామి ఇలా ఉండాలి అని. అలా మనకు నచ్చిన గుణాలు ఉన్న వారు కనబడ్డప్పుడు పవ్లోవ్ చెప్పిన conditioned reflex ప్రకారము, మన hormones ఫలితంగాను, వారి గుణాలే కాదు వారు కూడా నచ్చేస్తారు.
కొందరు అలా తమకు నచ్చే వారికై వెతుకులాడి పెళ్లి చేసుకుంటారు, కొందరు అలాటి వారు యాదృచ్చికంగా ఎదురుపడ్డప్పుడు చేసుకుంటారు. ఏ రకమైన ప్రేమ వివాహమయినా అది ఒక సెలెక్షనే.
ఉదాహరణకు నా కాబోయే వాడినే తీసుకో. తను మొదటి సారి నన్ను కాలేజిలో ర్యాగ్ చేసినప్పుడే చాలా నచ్చేసాడు. నిజంగా చెప్పాలంటే అది పూర్తి physical attraction. ఆ తరువాత ర్యాగ్ చేసిన ప్రతీ సారి ఇంకా ఇంకా నచ్చేవాడు. ఇక్కడ నచ్చటం అనేది ఎందుకంటే ఎంత ర్యాగ్ చేసినా హద్దులు మీరకపోవటం, ఫన్నీగా మాట్లాడి అందరినీ నవ్వించటం, నాతొ చిలిపిగా మాట్లాడి నా అందాన్ని పొగడటం.... ఇలా చాలా కారణాలుగా తన పెర్సోనలిటీ నాకు నచ్చింది. అంతే ఇదొక రకమైన psychological attraction.
ఇక పొతే తను నాకు ప్రోపోసే చేసిన తరువాత తీసుకున్న మూడు రోజుల గడువు practicalities బేరీజు వేయటానికి సరిపోయింది. అంటే frank గా చూస్తె it was all about thinking of the pros and cons of my decision if i say yes and deciding if the pros were worth the cons. so it was all about risk beinift analysis. so ఇక్కడ selection మరియు వ్యాపార ధోరణే కదా నిక్కచ్చిగా ఆలోచిస్తే" ముగించింది తను.
"ఏయ్. ఆగు ముందు మీ వాడికి అమెరికా ఫోన్ చేసి ఈ మాటలన్నీ చెపుతాను పాపం వాడు నువ్వు నిజమైన love చేసావని అనుకుంటున్నాడు." అని తనను ఉడికించటానికి ప్రయతించింది అసూ. "తన ఫోన్ నెంబర్ కావాలా? చెప్తాను రాస్కో. నాకేం భయం. భయ పడాల్సింది నీలాటి ప్రాక్టికాల్ మనిషీ, తనలాటి భావుకులమనుకొనే వారు జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే.ఒకే పదార్తాన్ని రెండు వేర్వేరు కోణాలలో నుంచి చూసి, తమదే సరయిన కోణం అనుకుంటే ప్రాబ్లం కాని ఒకే దృక్పదంలో ఆలోచించే మాలాటి వారికి ఏంటి ప్రాబ్లం.. తనకు చెప్పావా తను సింపుల్గా నవ్వేసి చెప్తాడు నేను కూడా అలానే చేశాను కదా అందమైన పిల్ల, నా కులపు పిల్ల, అందులో డబ్బుంది, పైగా గర్వం లేని పిల్ల అందుకే లైన్ వేసాను లేకుంటే ఎందుకేస్తాను అని" అంటాడు and that poses no problems to me as long as he does not do that after marriage as well." అని ముగించి "టా టా నేను మా వాడికి ఫోన్ చేయాలి" అని బైక్ తీసుకొని తుర్రుమంది తను. మా మిగితా మిత్ర బృందం కూడా "ఒకే రా మాకు క్లాసులున్నాయి" అంటూ మమ్మల్ని మా మానాన వదిలేసి వెళ్లారు. "రెండు వేరు వేరు ద్రుక్పదవాదులమైన మనం కలిసి ఉండగలమా" అని ఆలోచిస్తూ మేఇద్దరం ఆలోచనలలో మునిగిపోయాం. మరి selection time కదా ఇది.

Friday, 3 October 2008
నిచ్చెనపై మనుషులు
వింత ప్రపంచం,
మరెంతో వింత మనం.
మాటలు అర్థం అయ్యాయని
కొందరు జబ్బలు చరుచుకుంటే,
అవే మాటల్లో ఆడంబరం తప్ప
భావం లేదని కొందరు.
మొత్తానికి అందరం
నిచ్చెనపై మనుషులమే.
పైనున్నాను అని
కింద చూసేవాడా
నెత్తిన ఉన్నవారిని
మరిచే పోయావా?"
మరెంతో వింత మనం.
మాటలు అర్థం అయ్యాయని
కొందరు జబ్బలు చరుచుకుంటే,
అవే మాటల్లో ఆడంబరం తప్ప
భావం లేదని కొందరు.
మొత్తానికి అందరం
నిచ్చెనపై మనుషులమే.
పైనున్నాను అని
కింద చూసేవాడా
నెత్తిన ఉన్నవారిని
మరిచే పోయావా?"
కొన్ని మాటాలు అర్థమవుతున్నాయంటూ ఈ మధ్య ఏనుగుస్వారీ చేస్తున్న నా మనసు, కొత్తపాళీ గారు నేను మెచ్చిన గీతాన్ని "వాగాడంబరం" అని కొట్టి పారేసిన టపాను చదివి బాధ పడినా, "ఎంత తెలిసినా మనకంటే ఎక్కువ తెలిసిన వారు ఉంటారు" అన్న నిజాన్ని మరోసారి గుర్తు చేసింది. దాని అక్షర రూపమిది.
Subscribe to:
Comments (Atom)