మరెంతో వింత మనం.
మాటలు అర్థం అయ్యాయని
కొందరు జబ్బలు చరుచుకుంటే,
అవే మాటల్లో ఆడంబరం తప్ప
భావం లేదని కొందరు.
మొత్తానికి అందరం
నిచ్చెనపై మనుషులమే.
పైనున్నాను అని
కింద చూసేవాడా
నెత్తిన ఉన్నవారిని
మరిచే పోయావా?"
కొన్ని మాటాలు అర్థమవుతున్నాయంటూ ఈ మధ్య ఏనుగుస్వారీ చేస్తున్న నా మనసు, కొత్తపాళీ గారు నేను మెచ్చిన గీతాన్ని "వాగాడంబరం" అని కొట్టి పారేసిన టపాను చదివి బాధ పడినా, "ఎంత తెలిసినా మనకంటే ఎక్కువ తెలిసిన వారు ఉంటారు" అన్న నిజాన్ని మరోసారి గుర్తు చేసింది. దాని అక్షర రూపమిది.
No comments:
Post a Comment