Friday, 10 October 2008

ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?

ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?


నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే
నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే
నాటి కార్యముల నీడ, వీడకున్నాది లింగా.............
నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే
నేటి భాగ్యము చూచి నేను, మెచ్చుకోలు సేదమంటే
నాటి కార్యముల నీడ, వీడకున్నాది లింగా.........

ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?


ప్రజా సౌఖ్యము చూచి నేడు, నిన్న మరుతమంటే
ప్రజా సౌఖ్యము చూచి నేడు, నిన్న మరుతమంటే
రేపు రాగల కాళుడు, భయము గొలుపేరా లింగా.........
ప్రజా సౌఖ్యము చూచి నేడు, నిన్న మరుతమంటే
ప్రజా సౌఖ్యము చూచి నేడు, నిన్న మరుతమంటే
రేపు రాగల కాళుడు, భయము గొలుపేరా లింగా.........

మహానుభావా, మాదేవ శంభో! మా లింగ మూర్తి ....
ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?


మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
నాటి తోడేలు నేటి మెకమేట్లాయేరా లింగా.......
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
మేక తత్వము చూసి నేడు, భయము వీడుదమంటే
నాటి తోడేలు నేటి మెకమేట్లాయేరా లింగా........

ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?


పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
మరియా దుష్ట మిత్రులేమిరా లింగా.......
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
పరివర్తనమే కారణంబని, నమ్మి కూడుదమంటే
మరియా దుష్ట మిత్రులేమిరా లింగా.......

ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?


గుడ్డిలో మెల్లయని, సమాధాన పడదమంటే
గుడ్డిలో మెల్లయని, సమాధాన పడదమంటే
రేపు కన్నొకటి, పెరకక యుండునా లింగా.........
గుడ్డిలో మెల్లయని, సమాధాన పడదమంటే
గుడ్డిలో మెల్లయని, సమాధాన పడదమంటే
రేపు కన్నొకటి, పెరకక యుండునా లింగా.........


ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా?
ఏమి చేతురా లింగా, ఏమీ సేతురా?

ఏమీ సేతురా?

ఏమీ సేతురా?




నేటి గుర్జరీ దేశాన్నీ, దాన్ని పాలించే రాజునీ, ఆ రాజు కొలువునూ, తలచుకొని నేను పడే బాధకు రూపమిది.

నేటి గుర్జరీ దేశ సంపద, నేటి గుర్జార ప్రజా సౌఖ్యములూ, నేటి రాజు శాంతము తలచి యాతని కొలువు కొల్చవలేనా............
లేక

నాటి కాళము, నాటి , ప్రవర్తన మారినా మారని మిత్ర కూటమి, మిత్ర కూటమి నైజమూ చూచి బెదరాలా.................. అన్నది నేటికీ తెగని సమస్య నాకు.

No comments:

Post a Comment