పర్ణశాలలో వచ్చిన నేటి చిత్ర నాయికల వేషధారణ గూర్చిన టపాపై వచ్చిన వ్యాఖ్యలు చదువుతుంటే "శృంగారం-బూతు" అంటూ వచ్చిన వాదన గూర్చి ఆలోచిస్తుంటే వచ్చిన భావాల అక్షర రూపమీ టపా. శృంగారం మరియు రిలేటెడ్ విషయాల మీద నిర్మోహమాటమైన చర్చ కాబట్టి ఇష్టమైన వాళ్ళే చదవండి.
"శృంగారం" "బూతు" అంటూ విడదీసే ఈ రెంటిలో నాకు తేడా అంతగా కనపడి చావదు ఎంత వెతికినా. ఇందులో నాకు కనిపించే తేడా అల్లా "క్లాసు-మాసు" అంటూ మనం కల్పించుకున్న కృత్రిమ తేడాలే.
సూటిగా చెప్పుకుంటే "శృంగారం" అనేది "శారీరిక కలయికకు" "మానసికం" అనే చీర కట్టి అలంకరణ చేసి చూసుకొనే ఒక కోమలమైన భావన. ఇంకా సూటిగా చెప్పాలంటే "It is like foreplay". కలయికకు సంబంధించినదే కాకపొతే సున్నితంగా, కోమలంగా వర్ణించటం...ఊహించటం..జరగటం. అంతే. నేను ఇక్కడ "ప్లేటోనిక్ లవ్" లేదా "అమలిన శృంగారం" లాటి పెద్ద పెద్ద విషయాలకు పోవట్లేదు ఎందుకంటే "శృంగారం" అనే దానికి అర్థం నేను పైన చెప్పినదే ఎక్కువ శాతం మంది అనుకుంటారు అని నా భావన.
ఇక్కడ ఇంకోటి చెప్పుకోవలసినది ఏమిటంటే "శృంగారం"కు కొంచం పెద్ద పీట వేస్తాము....ఉట్టి "కలయిక/సంభోగం" కంటే ....అయితే ఎందుకు అన్న విషయం ఆలోచించాలి...ఆలోచిస్తే అది కూడా "మాసు క్లాసు" తేడా లాగే అనిపిస్తుంది నాకు. శృంగారం అన్నది ఎక్కువగా మానసికమై ఉందని నిర్వచించటం వలన...పూర్తీ శారిరికాంశమైన సంభోగానికంటే దానికి ఎక్కువ స్థాయి కల్పించబడింది.....కాని నిజంగా ఆలోచిస్తే పైన చెప్పినట్టు అది ఒక రకమైన రిఫైన్డ్ ఎక్ష్ప్రెశన్ అఫ్ లవ్ మేకింగ్ ఆర రిఫైండ్ థాట్ అఫ్ లవ్ మేకింగ్ బట్ ఇట్ ఇస్ శ్యూర్లీ అబౌట్ లవ్ మేకింగ్(i.e in my opinion romance is nothing but an refined expression of love-making or refined thoughts of love-making but it is surely about love-making).
ఇక "బూతు"......దేన్ని బూతు అంటాము అంతే ఆ నిర్వచనం యొక్క లక్ష్మణ రేఖ కాలాన్ని బట్టి మారుతుంటుంది.....కొన్నేళ్ళ క్రితం సినిమాలలోనే కథా నాయిక బొడ్డు చూపిస్తే అది బూతు అనుకునే వారు...కాబట్టి అందరు చక్కగా పైన కట్టుకుని "బూతు" లేకుండా చూపేవారు...అదే నేటి కాలంలో "అందం లేదా ఆకర్షణ" అయిపొయింది...కాబట్టి బూతు అనేది లక్ష్మణ రేఖలతో నిర్వచించ కుండా ఇంకో దేనితోనో నిర్వచించాలి....అదీ ప్రయత్నిద్దాం.
ఆలోచిస్తే "బూతు" అనేది శారీరిక కలయికకు సంబంధించి సూటిగా మాటాడటం, చూపటం, చెప్పటం అనుకోవచ్చు...ఉదా ఈ టపాకు దారి తీసిన మహేష్, సుజాత గార్ల టపాలచర్చాంశమైన "కథా నాయికల కురచ బట్టలు"....మామూలుగా ఒక బిచ్చగత్తె చిరుగు బట్టలతో కనిపిస్తే ఇలాటి వేగతులూ, అసహ్యాలు, అవమాన భారాలు రావేమో....ఇక్కడ "సంభోగ వస్తువు" గా "కథానాయికల/నాయకుల వేషధారణ/కదలికలు/మాటలు/చేష్టలు"ఉన్నాయి కనుక "బూతు" అయ్యాయి. చిన్న చూపు చూడబడుతున్నాయి..ఎందుకంటే ఇక్కడ మానాసిక కాంపోనెంట్ లేదు కనక.....కోమలం, తెరచాటుదనం లేదు కనక..సూటిగా పచ్చిగా ఉంది కనుక. ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే "మాస్" కనుక.
నాకు అర్థం కానిది ఒకటే......
శృంగారం ....బూతు...రెండు కూడా సంభోగ సూచక విషయాలే....
"ఒకటి నీటు...ఒకటి నీటు".
"ఒకటి క్లాసు..... ఒకటి మాసు"...
"ఒకటి మానసికంతో మిళితం ..ఇంకోటి పచ్చి శారీరికం".....
"ఒకటి కొందరు భావుకులు మాత్రమె అనుభవించే స్థితి" "ఇంకోటి అశేష జనావళి ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా స్ఫందించేది"
మరెందుకు ఒక దానికి పెద్ద పీట...ఇంకో దానికి చిన్న చూపు..తిరస్కారం?
సామాజిక ప్రభావం వలన అని కొందరు అంటారు.....పెరిగే వయస్కుల పై పడే ప్రభావం వలన ఇంకొందరు అంటారు.....
నిజంగా "శృంగారం" వలన ఈ ప్రభావాలు లేవా?
ఎందరు "మిల్స్ అండ్ బూన్స్ రొమాన్సెస్" లేదా "సపరివార వార పత్రికల"మధ్య పేజీల్లో ప్రచురితమైన "సెంటర్ సేన్సేషన్స్ " "సరసమైన కథలు" చదివి "సంభోగం" గురించి కలలూ ఊహలూ పెంచుకోరు?
ఎందరు "శృంగార నాయికల" గూర్చి, ప్రభందాలు, శృంగార కావ్యాలు చదివి తమ జీవితాలకన్వయించుకోరు?
వీటికి జవాబులు మనకు తెలీవు ఎందుకంటే వీటి మీద పరిశోధనలు జరగలేదు కనుక...కాని "ఉట్టి బూతు" అనే వాటి ప్రభావం మాత్రం బయట కనపడుతోంది కాబట్టి అది తప్పు అయిపోతుంది....
నా ప్రకారం శృంగారమయినా, బూతు అనేవి అయినా....ఎంత ప్రభావం చూపెడుతున్నాయి అనేది ఆ ఆ వ్యక్తుల వ్యక్తిత్వం పై కూడా ఆధారబడి ఉంటుంది. వ్యక్తిత్వం అనేది మనుషుల పుట్టుక, పెంపకం, చుట్టూ ఉన్న వాతావరణం మీద...... అంటే.....క్లుప్తంగా చెప్పాలంటే వారి "An accident called birth" మీద ఆధారపడి ఉంటుంది....
ఎందుకో నా మనసుకు,
ఒక వర్గం ప్రజలకు నచ్చే "సున్నిత, కోమల ,తెఱచాటు , మానసిక మిళితమైన సంభోగానికి" పెద్ద పీట వేయటం ..........
చాలా మందికి నచ్చేదానిని(వారు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా ఇది నిజం) చిన్న చూపు చూడటం లేదా స్తిగ్మటైస్ Stigmatise చేయటం సరి అయింది కాదు అనిపిస్తుంది.
(సమాజ శ్రేయస్సుకు ఎక్కువ విలువనిచ్చే వ్యవస్థ నుంచి వ్యక్తి స్వాతంత్ర్యానికి విలువనిచ్చే వ్యవస్థకు మారుతున్న నేటి తరం ఆలోచనలకు నా అభిప్రాయాలు దర్పణం కావచ్చు.....అవతలి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది...)
Sunday, 31 May 2009
Thursday, 28 May 2009
భావుకత.
నిద్ర లేచింది మొదలు,
నిద్రలో కూడా!
ఎంత తాపత్రయమో
అందాలనుభవించాలని
ఆనందంగా గడపాలనీ.
నా మటుకు నాకు
అందాలను మాత్రమేరుకునే రాయంచ నడక
స్వామ్యవాదులకూ సమాజవాదులకు
నిజానికి దూరంగా పారిపోయే పిరికి పరుగు.
ఎంత చిత్రమో ఈ భావోత్సుక ఝరీ ప్రవాహం!
నిద్రలో కూడా!
ఎంత తాపత్రయమో
అందాలనుభవించాలని
ఆనందంగా గడపాలనీ.
నా మటుకు నాకు
అందాలను మాత్రమేరుకునే రాయంచ నడక
స్వామ్యవాదులకూ సమాజవాదులకు
నిజానికి దూరంగా పారిపోయే పిరికి పరుగు.
ఎంత చిత్రమో ఈ భావోత్సుక ఝరీ ప్రవాహం!
Wednesday, 13 May 2009
పుత్తడి పూర్ణమ్మకు వర్ణాల వెలా?
నిన్నలంకరించాలనీ
అందంలో నే పండాలనీ
నీకు నడకలు నేర్పాలనీ
హోయలనుగమించాలనీ
నీకు చెణుకులు నేర్పాలనీ
మెళుకువలారాదించాలనీ
నీకు భాష్యం చెప్పాలనీ
భావం భాగ్యం నాదనీ
నీ లయకు తాళమై
నీ స్వరాలకు గాత్రమై
నీ విరుపుల ప్రణవమై
నీ లక్షణ లక్షమేనై
సలక్షణవై
సుభిక్షితవై
సుశోభితవై
సగర్వమై
నువ్వెల్గ నేన్గెల్వాలని ఉంది!
కానీ.........
అలంకారాలూ, అందాలూ
విరుపులూ, మెరుపులూ
నడకలూ, నాట్యాలూ
లక్షణమూ లక్షమూ
ఇవన్నీ.......
బూటకాలనీ చీదరాలనీ
చెదలనీ వెతలనీ
చీత్కరిస్తున్నారమ్మా
వెలివేస్తున్నారంతా
భావమొక్కటి చాలంటూ.......
కొండపల్లి బొమ్మకు
రంగులొద్దన్నారమ్మా
పుత్తడి పూర్ణమ్మకు
తెల్ల చీరిచ్చారమ్మా!
ఇపుడే...ఇప్పుడిపుడే.........
చెక్క వెతకటం
బెరడు తీయటం
రూపు చెక్కటం
బొమ్మ చేయటం
అన్నీ, ఇవన్నీ.....
చూస్తున్నా
చేస్తున్నా
చేయి వేస్తున్నా
కాల్చుకుంటున్నా!!!
అంతలోనే, ఇంతలోనే........
గడులెందుకు
గదులెందుకు
ఇరుకెందుకు
బెరుకెందుకు
అని అరచీ కరచీ............
బొమ్మకు భావం ప్రాణం పోసీ
విరుపు మెరుపుల వలువలు కట్టీ
మాత్రల సొగసుల ముత్యపు సరాల
ఛందపు గంధపు నిగనిగల వరాల
తండ్రినై
అన్ననై
ప్రియుడినై
మరుడినై
తాన్వెల్గ, నేన్గెల్వాలనుంది!!!
అందంలో నే పండాలనీ
నీకు నడకలు నేర్పాలనీ
హోయలనుగమించాలనీ
నీకు చెణుకులు నేర్పాలనీ
మెళుకువలారాదించాలనీ
నీకు భాష్యం చెప్పాలనీ
భావం భాగ్యం నాదనీ
నీ లయకు తాళమై
నీ స్వరాలకు గాత్రమై
నీ విరుపుల ప్రణవమై
నీ లక్షణ లక్షమేనై
సలక్షణవై
సుభిక్షితవై
సుశోభితవై
సగర్వమై
నువ్వెల్గ నేన్గెల్వాలని ఉంది!
కానీ.........
అలంకారాలూ, అందాలూ
విరుపులూ, మెరుపులూ
నడకలూ, నాట్యాలూ
లక్షణమూ లక్షమూ
ఇవన్నీ.......
బూటకాలనీ చీదరాలనీ
చెదలనీ వెతలనీ
చీత్కరిస్తున్నారమ్మా
వెలివేస్తున్నారంతా
భావమొక్కటి చాలంటూ.......
కొండపల్లి బొమ్మకు
రంగులొద్దన్నారమ్మా
పుత్తడి పూర్ణమ్మకు
తెల్ల చీరిచ్చారమ్మా!
ఇపుడే...ఇప్పుడిపుడే.........
చెక్క వెతకటం
బెరడు తీయటం
రూపు చెక్కటం
బొమ్మ చేయటం
అన్నీ, ఇవన్నీ.....
చూస్తున్నా
చేస్తున్నా
చేయి వేస్తున్నా
కాల్చుకుంటున్నా!!!
అంతలోనే, ఇంతలోనే........
గడులెందుకు
గదులెందుకు
ఇరుకెందుకు
బెరుకెందుకు
అని అరచీ కరచీ............
బొమ్మకు భావం ప్రాణం పోసీ
విరుపు మెరుపుల వలువలు కట్టీ
మాత్రల సొగసుల ముత్యపు సరాల
ఛందపు గంధపు నిగనిగల వరాల
తండ్రినై
అన్ననై
ప్రియుడినై
మరుడినై
తాన్వెల్గ, నేన్గెల్వాలనుంది!!!
Sunday, 10 May 2009
पड़ाव पड़ाव की बात हैं मियाँ!
सुनके हमारी कुब्ल-ए-गलती
यार ने पूछा किया क्या अमल?
हम हँस के चल दिए, सोचते मन ही मन
अमा जनाब, इतनी आसां होती सफर
इक पड़ाव से दूसरी तक
पहुच नहीं जांते क्या मंजिल अब तक?
अभी पहुंचें हैं पड़ाव-ए-कुब्लीयत
थोडा मौज करने दो इस मंजर में
फिर सोचेंगे उस पडाव-ए-अम्ल पर
तै करना भी है ना सफर के फायदे
दूसरों के ही नहीं, हां खुद का भी.
अपनी फायदे की विशवास होने दो
फिर दौड़ पड़ेंगे उस सफर पर.
यार ने पूछा किया क्या अमल?
हम हँस के चल दिए, सोचते मन ही मन
अमा जनाब, इतनी आसां होती सफर
इक पड़ाव से दूसरी तक
पहुच नहीं जांते क्या मंजिल अब तक?
अभी पहुंचें हैं पड़ाव-ए-कुब्लीयत
थोडा मौज करने दो इस मंजर में
फिर सोचेंगे उस पडाव-ए-अम्ल पर
तै करना भी है ना सफर के फायदे
दूसरों के ही नहीं, हां खुद का भी.
अपनी फायदे की विशवास होने दो
फिर दौड़ पड़ेंगे उस सफर पर.
"వనజపై" నా టపాలో వ్యాఖ్యల్లో అడిగిన చిన్ని ప్రశ్నకు జవాబివ్వతానికి జాప్యం చేసింది ఎందుకా అని ఆలోచిస్తే తట్టిన సమాధానం ఇది :-(
Time is……..
If the world were at a standstill
No event happens, nothing changes at all
Think of time in that world
Does it carry any meaning at all?
Time exists - of happenstances
In this ever running reel of world
Imprinted with hundreds of coincidences
Those already printed, binned in the past
the empties in the roll, called the future
Those hot in production - the present
Ah......a very confusing mixture of past and future
is the recipe called present...once this n pronto that!
Time is an illusion
Created by the perception -
In the unperceived world
There shall be no such confusion.
Time is memory called past
Time is perception called the present
Time is anticipation called the future
Time stands on this inevitable tripod
Time is that unfathomable ocean
Standing at its mighty bank
staring at the immense expanse
fearful of its other end, of the great unknown
Life has cought on a trick
counting the waves and creating an illusion
of understanding, of measuring
and even of mastering time, ah the Temerity of Life!
Time is not the great overseer
Neither is it the unblinking witness
it is no Apollo-the healer great
Neither is it leveller of the great
These are all false epithets
to a pattern of happenstances on world’s stage
for what are seconds, minutes, hours et als?
if not fanciful names, recognised but still a mist
to the boring repititive sun rises and falls
and the meandering repetition of life in their midst?

Saturday, 9 May 2009
లయ తప్పిన విభావరి!
చిటపట చినుకుల సంగీతం
పైకప్పుపై టపటపమంటూ
వీనులవిందుగా తాళమేస్తూ
కచేరీ జరుగుతుంటే..
భావు"కుల" జన మనఃకరతాళాలు
మిన్నుమిట్టి తన్నుచేరగా....
ఆర్కెస్ట్రాలో చోటివ్వలేదని గాలి తుంటరిగాడు,
ఆ విభావరి లయ తప్పించాడు
బలంగా అటూ ఇటూ పరుగెడుతూ.
ఇంకా ఇంకా....
ఏమో ఏమో.....
అనుకోవాలనీ....
అన్వయించాలనీ......
కానీ.......
"ఆశ దోస అప్పడం వడ" అని
గాలి పిల్లగాడు గేలి చేస్తాడని
భయమేసి ఆపేసాను.

Friday, 8 May 2009
సాధారణ అసాధారణ చిత్రం - వనజ
పుస్తక సమీక్షలూ, సినిమా రివ్యూలూ అంటే కొంత చిరాకు నాకు. ఒక పాఠకుడు లేదా ప్రేక్షకుడూ తనకు అనుభావమైనదాన్నీ, తనకు తోచిన అన్వయాన్నీ ప్రపంచానికి తెలియ చేయాలనే ఆరాటం, లేదా తనకు తోచిన కోణాల్ని సార్వజనీకం చేసేయటం కనిపిస్తుంది అందులో నాకు...... అందుకే నాకు కొంచం చిన్న చూపు ఈ సమీక్షల మీద........ఇది రాస్తుంటే మాత్రం ఒకటి అనిపించింది నాకు.....నేను సమీక్షలకు ఆపాదించే ఆ అభ్యంతరాలు ఏ రచనా వ్యాసంగానికైనా ఆపాదించోచ్చని :-)
సరే...ఇంత చేసి ఇంత ఉపోత్ఘాతం ఎందుకూ అంటే ....."వనజ" సినిమా పై నా నాలుగు పెన్నీలు నేను చెప్పదలచుకున్నాను ఇప్పుడు. ఎపుడో వచ్చిన సినిమాపై ఇపుడు చెపుతానంటాడేమిటీ అంటారా...మరిప్పుడేగా మా విడియో మస్తీ వెబ్ సైట్లో ఆ సినిమాను పెట్టిందీ.....ఎంత న్యాయాన్యాయాల గూర్చి "మాటాడే"వాడ్ని అయినా ఇంతవరకూ ఇలా దొంగగా వెబ్ సైట్లలో చూడటం మానేసి కొనుక్కుని చూసే అలవాటు కాలేదు.....ఇలా "చిన్న చిన్న" వాటిని ప్రతీ దానినీ పట్టించుకోవాలనుకుంటే "ఇక బతికినట్టే" అని బుద్ధి దిఫెన్స్లో పడితే మనసు నవ్వేసి ఆ విషయం వదిలేసి ఇక అసలు విషయానికి వచ్చేయమంది. మనసు మాట వినేద్దాం పదండి.
ఇతివృత్తం
ఈ సినిమా నాలో ఉన్న రెండు ఆలోచనలను బలపరిచింది.....వాటి గురించి తరవాత కాని ముందు సినిమా గురించి. టూకీగా ఈ సినిమాలో పద్నాలుగేళ్ళ జాలరి పిల్ల ఒక నాయిక. ఒక రోజు బుర్ర కథ చెప్పే అమ్మి తను పెద్ద నర్తకి అవుతుందంటే నమ్మి కూచిపూడి నృత్యం మీద ఆసక్తి పెంచుకుని, జమీందారిణి పూర్వాశ్రమంలో మంచి నర్తకి అని తెలుసుకుని, ఆమె దగ్గర పని పిల్లగా చేరి, కావాలని అష్టా చంమా ఆటలో ఓడి పోయి ఆమె ప్రాపకం సాధించి, ఆమె దగ్గర సంగీతం, నృత్యంలో శిక్షణ పొందుతూ దినదిన ప్రవర్తమానమవుతుంటే జమీందారిణి కొడుకు చేత బలాత్కరింపబడి, ఒక మగ పిల్లాడిని కని ...ఇలా పెళ్ళికి ముందే తల్లై, ఉన్న తండ్రిని తాగుడుకు పోగొట్టుకొని తరువాత తన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటుందో అన్నది ఈ చిత్రం ఇతివృత్తం.
వనజ పాత్రీకరణ
చిత్రం చూసినంత సేపూ నాకు కలిగిన మొదటి భావన...వనజ పాత్రీకరణ చూసి...ఇంత "చాలూ పిల్లలు" కూడా ఉంటారా అని. పద్నాలుగు పదిహేడేళ్ళ పిల్ల .......తండ్రినీ, గుడి పూజరినీ, ఒక జమీందారిణిని, తన కంటే పెద్ద, చిన్న, సమ వయస్కులను.......ఒక్క తన స్నేహితురాలిని తప్ప అందరినీ...... ఎలా తన చిటికిన వేలి చుట్టూ తిప్పుతుందో కదా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకో ఆ అమ్మాయి , బలాత్కారానికి గురి అయినా, నాకు ఒక "విక్టిం" అన్న భావన రాలేదు.....కారణం ఏమిటా అని ఆలోచించాను. తోచిన రెండు కారణాలలో మొదటిది నాకు "స్ట్రీట్ వైస్" అంటే తెలియక పోవటమేనేమో అని అనిపించింది.....మరీ నన్ను నేను టూ మచ్ గా అనుకుంటున్నాను అనిపించి ఆ ఆలోచన అక్కడితో వదిలేసాను.
రెండవది "భావరహిత చిత్రీకరణ" అని అనిపించింది. రచయితా, దర్శకుడు అయిన రజ్నేష్ తెలుగు చిత్రాలు చూడక చాలా కాలమే అయి ఉంటుందన్న :-) సూచనగా అసలు మేలోడ్రామానే లేదు ఈ చిత్రంలో. చిన్నపిల్ల బలాత్కారానికి గురి అయినా ఏదో పసరు మందు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కొంచం ఏడుస్తుందే కాని తెలుగు చిత్రాలు పరిచయమున్న వారు ఊహించే స్థాయిలో విషాదమే లేదు. దీనికంటే ఎక్కువ ఆ అమ్మాయి సంగీత సాధన చేస్తూ అనాలోచితంగా వేలును కోసుకున్న సంఘటనలో ఎక్కువ ఏడుపును చూపెడతాడు దర్శకుడు. ఈ పేరడాక్స్కి కారణం లేదా పేరడాక్స్ అనిపించటానికి కారణం దర్శకుడు విదేశాల్లో ఉండి, అక్కడ చిత్ర నిర్మాణం నేర్చుకుని ఈ చిత్రాన్ని తన మాస్టర్స్ థీసిస్ కోసం అక్కడి విలువలననుసరించి నిర్మించటమా, మన తెలుగు చిత్రాలలో ఉన్న మరీ మోతాదుకు మించిన మేలో డ్రామాకు అలవాటు పడిపోయిన నా మనసా, నిజజీవితంలో అలాటి సందర్భాలు ఎదురైతే అలాగే ప్రవర్తిస్తారో, "చిన్నకులం" వాళ్ళు "పెద్దోళ్ళ" అన్యాయానికి బలి అయినప్పుడు అలాగే ఉంటారో లేక దర్శకుడు ఇంకేదన్నా చెప్పలనుకున్నాడా అన్నది నాకు అర్థమవలేదు.
సంగీత నృత్య రసానుభవం
విశ్వనాథ్ వారి చిత్రాలలో, మంగళంపల్లి, ఎమ్మెస్ గాత్రంలో, చౌరాసియా వేణుగానంలో సంగీత రసాస్వాదన అలవాటయిన నాకు ఈ చిత్రం "నా రసాస్వాదన" అనే అనుభవానికి "కొత్త నిర్వచనాన్ని", "అర్థాన్ని" తెలిపింది. ఇందులో వనజ పాత్రధారిణి సరిగా సత్యం చేసిందా లేదా, జమీందారిణి పాత్రధారినికి నేపథ్యం గాత్రం చేసిన వారు సరిగా పాడారా లేదా, "సావిరహే తవధీనా" అన్న అష్టపదిని కట్టిన రాగం సరైనదా కాదా అన్నది చెప్పేంత అర్హత నాకు లేదు కాని చూస్తున్నంత సేపు అవి నిజమైన సంప్రదాయ సంగీత నృత్య బద్ధ చిత్రీకరణ, ధ్వన్యీకరణేనా అన్న ఆలోచనలు చుట్టు ముట్టాయి.
కారణం ఆలోచిస్తే అర్ధమయింది ఏమిటంటే చిత్రంలో నాకు అలవాటయిన చిత్రాల్లోలా నృత్యం చేసేది అందమైన నాయికా కాదు, నాట్యం చేసేప్పుడు వాడినవి అందమైన దుస్తులు కావు, నాట్యం చేసేది/నేర్పించేది నేను గొప్పగా "నా అస్థిత్వం" అని ఫీలయ్యే "నా కులపోళ్ళ" పాత్ర కాదు. అందుకే ఆ ఫీల్ రాలేదు అని అనిపించింది.
లేకపోతె ఈ చిత్రంలో "అయిగిరి నందిని" అంటూ మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని నృత్యాన్వయం చేసేప్పుడు ఆ చిన్న బుడత చూపిన ఆవేశం నిజంగా చెప్పాలంటే "సప్తపదిలో" తాత, మామ, బావ -మూడుతరాల వారు వరుసగా నిలబడి "జాత వేదసే సునమామి" అంటూ వేదపుష్పం సమర్పిస్తుంటే, వారికి దీటుగా దుర్గా సూక్త నృత్య రూపాంజలి ఘటించిన నాయికను మించిందనే చెప్పాలి. కళాతపస్విలాటి మెయిన్ స్ట్రీం దర్శకుడు, మెయిన్ స్ట్రీం చిత్ర హంగూ ఆర్భాటం లేకపోయినా అంత మంచి ఆవేశం అభినయించిన ఆ చిన్నారి చూస్తున్న ఆ క్షణం మాత్రం నన్ను సప్తపదిలో ఆ నృత్యం ఆకట్టుకున్నంత ఆకట్టుకోలేక పోయింది. ఇలా తాపిగా ఆలోచిస్తేనే దాని గొప్పతనం అర్ధమయింది.
తరచి చూస్తే మంగళంపల్లి గాత్రాలూ, కళాతపస్వి చిత్రాలూ నాలో రేపిన రసాస్వాదన...... వాద్య హంగు పొంగులకూ, నాయిక అందచందాలకూ, కులవివక్షకు పరోక్షరూపమైన కులాభిమానాలకూ, అభిమాన దర్శకుడు గాయకుడూ అన్న అభిమానానికి, పొంగిన హృదయ కంపనమని, చిక్కని నిక్కమైన రసాస్వాదన కాదని తెలిసింది. ఎంత దారుణమైన నిజమో!
రసాభినయం
వనజ పాత్రధారి ఎంత హృద్యంగా ఎన్ని రకాల రసాలను అభినయించిందో ఈ చిత్రంలో.
పైన చెప్పినట్టుగా మహిషాసుర మర్ధిని స్తోత్ర నృత్యంలో చూపిన ఆవేశం నిజంగా భేష్.
పోస్ట్ మాన్ అయిన తన జత కుర్రాడితో సరసాలాడుతున్నప్పుడూ, నాటుగా "నీది చూపించు నాది చూపిస్తా" అని అన్నా, నీటుగా "సావిరహే తవధీనా" అంటూ పిలిచినా శృంగార రసాన్ని తన వయసు, అభినయానుభవాన్ని మించి ఒలికించింది.
తండ్రి మాటి మాటికీ "చస్తా చస్తా" అంటుంటే "ఎందుకు మాటి మాటికి చస్తా అంటావ్...థూ" అంటూ చీత్కరిస్తూనే చూపించే కంట్రోల్ ఉన్న బేలతనం, పాత చిత్రంలో అన్నట్టు తన తరుఫున "సాక్షీకం" (అబద్దందే) చెప్పటానికి వచ్చి చివరికి ప్లేటు ఫిరాయించిన పోస్ట్మాన్ కుర్రాడి గల్లా పట్టుకుని "విన్నానని చేప్రా" అంటూ అడిగే కంట్రోల్ తప్పిన బేల తనం నిజంగా అద్భుతమైన కాంట్రాస్ట్.
తన కొడుకును జమీందారిణి దగ్గరకు పంపేస్తూ కూడా కన్నీరు కార్చకుండా తన వైపే సంకోచంగా చూస్తున్న తండ్రిని "ఎందుకలా నా వైపు చూస్తావ్ ...తొందరగా తీసుకుపో" అని అనటంలో ఉన్న విషాదంలోని గొప్పతనం నిజానికి రచయితా దర్శకుని ఖాతాలో చేరాల్సినదయినా ఆ అమ్మాయి చూపిన కంట్రోల్ నిజంగా బావుంది.
ఇంకా చాలా రసాలు ఉన్నాయని గాట్టిగా తెలుసు....కాని గుర్తు లేదు.....అయినా అన్నీ నేను చెప్పేస్తే మీరేం చేసేట్టు? మీరు చూసి (videomasti.net లో ఉంది ఇవాళ) ఆనందించండి.
మెయిన్ స్ట్రీం చిత్రాలు మరియూ ప్రేక్షకులూ నేర్వాల్సిన గొప్ప పాఠం
ఒక "విశిష్టత"గల పాత్ర కానీ, ఒక "విశిష్టత" గల పాత్రీకరణ గానీ ("గొప్ప" ఫైటరూ , "గొప్ప" సింగరూ, "మాంచి" అందగత్తె, "ఆహా" అనే ఫిగరూ, "ఎంతో గొప్ప" గాయకుడూ, "పేద్ద" పేరున్న నృత్యకారిణీ, "యమా క్రేజీ" పాపులారిటీ గల స్టారూ, "యమా" చెడ్డ విలనూ) లేకుండా నేటి చిత్రాలలో, నవల్లో నాయికా నాయకులు కనపడరు.
ఇలాటి "గో.......................ప్ప" పాత్రలనే మనం మరీ మరీ చూపించటం, చదివించటం వలన, ఆమోదించటం వలన, వారినే ఆరాధించటం వలన ...............మన జీవితంలో అలాటి "వి....శిష్ట" వ్యక్తులకై ఎదురు చూడటం, వారినే గౌరవించటం జరుగుతుంది.
దాని వలన మన జీవితాల్లో "బ్లాక్ అండ్ వైట్" ఆలోచనలు ఎక్కువైపోయి.................సగటు మానవుడు "అన్ని రకాల
గ్రేస్" లోనే ఉంటాడని మరచి.....మన చుట్టూ ఉన్న "గ్రేస్" ని చూసి నిరాశ చెందటం, వారిని నిర్లక్షం చేయటం, వారికి నిరుత్సాహ పరచటం చేస్తాము. దీని వలన ప్రతి "గ్రే" లోని "వైట్" చూడటం మరిచిపోతాము.
అలా చేయకుండా సాధారణ వ్యక్తుల్లో సాధారణ మస్తత్వాన్ని, సాధారణ బిహేవియర్ ని, సాధారణ శక్తినీ సెలబ్రేట్ చేసే ఈ వనజ చిత్రమే నిజమైన అసాధారణ చిత్రం.
అయితే అంత అసాధారణ చిత్రం కాబట్టే బయట ఎన్ని బహుమతులు గెల్చిన మన భారత దేశంలో ఒక్క థియేటర్లో కూడా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని చూసి మెయిన్ స్ట్రీం చిత్రాల వాళ్లు ఏం నేర్చుకుంటారో మనకు బాగా తెలిసిందే కదా!
(ఈ "వనజ" సినిమా గురించి రాయాలనుకోటానికి కారణం ఎప్పటినుంచో నాలో మెదులుతున్న ఈ "సాధారణమే ఆమోద యోగ్యం" ఆలోచన ఒక కారణమైతే....ఇవాళే జాలంలో ఒక మిత్రుడు తన ఆర్కుట్ అకౌంటులో "నేను ఏ కుల సంబంధిత సమూహాల్లో లేను....మరి మీరో? " అని రాసుకుని పెట్టిన చెంపదెబ్బ ఒక కారణం.
చిన్నదే అయిన ఎందుకో మనసులో ముల్లు గుచ్చుకున్నట్టయింది.....ఆ వాక్యం చూసే సరికి. దొంగగా అదే ఆర్కుట్ అకౌంటులో కుడి పక్కన నా "అస్థిత్వాన్ని" తెలుపుతూ ఉన్న "నా కుల" సమూహాలు కనపడ్డాయి. ఇంతకు ముందుకులా "అవును నేను ఈ కులపు వాడినే, అది నా అస్థిత్వంలో భాగమే" అని నిశ్చింతగా చెప్పలేక పోతున్నా
ఈ మధ్య ....ఎందుకంటే......"కులాలు పోవాలని కాదు కుల వివక్ష పోవాలని ప్రయత్నించాలి" అంటూ టపా రాసిన నేను ఈ మధ్యనే సైకాలజీలో చదివిన కొన్ని ప్రయోగాలు గుర్తుకొస్తాయి కుల వివక్ష-కుల అస్థిత్వము అన్న చర్చ వచ్చిన ప్రతీ సారి....టూకీగా ఆ ప్రయోగాలు కనుగొన్నవేంటంటే....మనిషన్న వాడు, "ఒక సమూహానికి చెందిన వాడిని" (just an identification with a group is enough ....it seems) అని అనుకుంటే చాలట... సమూహ వివక్ష చర్యలు (group discrimination behaviours) తనకు తెలియకుండానే చేస్తూ ఉంటాడట. ఇది ప్రామాణికంగా రుజువయిన నిజాలు. తనకు అంతవరకు పరిచయం లేని ఉట్టి సమూహ పరిచయ భావనకే మనిషి ఇలా అయిపోతే మరి మన సమాజంలో వేళ్ళూనికొని పోయిన ఈ కుల సమూహ భావనలు, మనిషి ఎంత బుద్ది పూర్వకంగా వివక్ష రహితంగా ప్రవర్తించినా అప్రయత్నంగా వివక్షా పూర్వక చర్యలకు రేకేత్తించకుండా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది....అందుకే ఈ నా అస్థిత్వమంటే నాకు ఈ మధ్య భయం పట్టుకుంది!)

Thursday, 7 May 2009
Lost in all that reminds of you
Long after we spoke
I reflect your glow
like the moon lovely
shining white as pure snow
The lovely night
passes by in all her glory
I notice but for a moment
for lost I am, in all that reminds of you
In the brook's Jingle
I hear your laughter clear
funny I must be
in your dreams, dear.
Your hair-tie, I bet
Must be off, in your slumber -
blackest night in the book
is it here-on every glade and bower.
Sound asleep miles away,
arms wrapped round near and dear
your body's warmth, still I feel
in the cold night here.
You in your lovely repose
I try to imagine and fail.
who am I but a lowly word-smith
such worthy tasks make me quail.
one thing though, never tires me
spinning these threads a'glow
out of the worthless words
that do not express thee fully though.

ఫర్స్ట్ ఇంప్రెషన్స్.....అన్ అపాలజెటికల్లీ!
దుమ్ము రేపినా ప్రభంజనమొకటీ
ముల్లు టిక్కు నిగ్గులా
ఉసూరుమంటూ చతికిలకూర్చుందే
మెరుపులీనిన మేఘమొక్కటీ
గడచిన సంధ్యనా
కంటికానకా నీరేగారిందే
పిడుగై దూకిన ఉరుము ఒక్కటీ
మారే రిఫెరెన్సు ఫ్రేములా
తుస్సుమనీ తత్తర పొయిందే
దిశనే మార్చిన మలుపు ఒక్కటీ
దీర్ఘ దృష్టినా
వంకరపొయి సక్రమమయ్యిందే
అందుకే......
అర్థ శతాబ్ధపు అవేశాన్నే
ఆయుధమందామా?
అరఠావు పుటల్లొ మిగిలిన రాతల
అధ్బుతమందామా?
అనిపిస్తుంది!!!
(అవునండీ సి.వె.సీ.రా.శా.గారి పాటను అనుకరించి రాసినదే :-) )

Wednesday, 6 May 2009
కవితాత్మము-కవితత్వము.
వచనము పద్యమనుచు
భావుకత్వము అభ్యుదయమనుచు
కవిత రీతిని నిర్వచించ
బహు ప్రయత్నములు సేయనేల
స్ఫందనమున్న వరకు
పొంగి పొరలదె భావమూటలై
ఊరు నీరు యాస్వాదించక
నీటి రూపమిదే యని
నొక్కి పల్కుట నిక్కమౌనా?
నీరు పట్టిన పాత్ర రూపము
బట్టి కాదా నీటి రూపము
కవిత పంచె మనిషి తత్వము
బట్టి కాదా మరిక దాని గుణము.
వ్యర్థ ప్రయాసలు మానుకోవోయ్
నచ్చినదంతయు గ్రోలుకోవోయ్.
భావుకత్వము అభ్యుదయమనుచు
కవిత రీతిని నిర్వచించ
బహు ప్రయత్నములు సేయనేల
స్ఫందనమున్న వరకు
పొంగి పొరలదె భావమూటలై
ఊరు నీరు యాస్వాదించక
నీటి రూపమిదే యని
నొక్కి పల్కుట నిక్కమౌనా?
నీరు పట్టిన పాత్ర రూపము
బట్టి కాదా నీటి రూపము
కవిత పంచె మనిషి తత్వము
బట్టి కాదా మరిక దాని గుణము.
వ్యర్థ ప్రయాసలు మానుకోవోయ్
నచ్చినదంతయు గ్రోలుకోవోయ్.
Monday, 4 May 2009
1. చలం, ఈ పాపం నీదేలే!
"పదండి ముందుకు పదండి తోసుకు" అన్నా
"పొలాలనన్నీ హలాల దున్ని" అన్నా
"నేను సైతం నేను సైతం" అన్నా
నే మెచ్చింది శబ్దానందమే
అర్థావేశం గగుర్పొడిపే గతం శూన్యమే ఇప్పటి వరకు.
"కారులో షికారుకెళ్ళే........"
చిన్నది సిగ్గుపడే కవిత
అతని మార్కే అనందరూ పొరబడితే
కొంచం అర్థమయిందతని పవరు
"మహా ప్రస్థానమంతా కమ్యూనిజం కంపే"
మెచ్చుకుంటూనే చీదరించిన
బ్లాగ్మిత్రుని వ్యాఖ్య గాయపరిచింది
అనుభూతించటానికి అర్థమక్కరలేదన్న సిరివెన్నెలర్థమవుతూ
బ్లాగ్మిత్రిణి అంకిత పద్యం పరిచయం చేస్తే
జాలంలో శ్రీశ్రీని "కనుక్కున్నా........"
మహాప్రస్థానపు ఉడుకు పరుగులు లేవని
మిగితా వాటిని అక్కడే వదిలి కదిలిపోయా!
విశాలాంధ్ర ఎగ్జిబిషన్లో
కృష్ణ శాస్త్రి, గురజాడ,
బంగారి మామ, జాషువా
వెతికి మరీ తీసుకుంటుంటే
జయంతోత్సవాలకనుకుంటా పేర్చబడ్డ
అనంతం, ఖడ్గసృష్టి కనబడుతున్నా
ఈ సంవత్సరం కవిత్వం పైనే నా దృష్టని
సర్దిచెప్పుకుని మహాప్రస్థానంతో సరిపుచ్చుకున్నా
డెక్కన్ చార్జర్స్ చార్జింగ్ లేక చితికిలపడుతుంటే
చైతన్యం వస్తుందని మహాప్రస్థానం చేబడితే
యోగ్యతా పత్రమిస్తూ చలం చేసిన చీత్కారం
మనసు చివుక్కుమనిపించింది...ఆలోచింప చేసింది!
అయినా నాకు తెలుసు
నా ఈ ఆవేశం క్షణికమని-
కార్యరూపం అనంతాలవతలని
అయితేనేం? ......................
పతితుల, బాధితుల
బాధా సర్పద్రష్టుల
నాలాటి బెడ్ రూం బూర్జువాలు
ఆలోచించటమే గొప్ప కదా!
అయినా చలం నీకిది న్యాయమా?
తనని చదవాలని తెరిస్తే
మీకు కవిత్వం కావాలా?..పాత గోరీల చూడమంటూ
ముందుకు సాగకుండా చేసావ్.....ఈ పాపం నీదేలే!

Sunday, 3 May 2009
కవిత అంటే?
అసలు కవిత్వం అంటే ఎమిటి? దానికీ అందమైన వాక్యానికీ తేడా ఎమిటీ?
పూర్వులు, పెద్దలూ, గురువులూ, ఋషులూ, ఇప్పటి మనము.... కవిత అంటే ఎలా నిర్వచించారు, నిర్వచిస్తాము?
పద్య కవిత్వానికి (చందస్సు కాక) ఉండాల్సిన లక్షణాలేమిటి?
ఇవి గత సంవత్సరంగా నాకు కలుగుతున్న కొన్ని అనుమానాలు.....బ్లాగ్మిత్రులు తమ అభిప్రాయాలు, తమ నిర్వచనాలు, తమకు తెలిసిన వ్యాసాలు కాని ఇతర సొర్సెస్ కాని తెలుపుతారనే ఆశతో
భవదీయుడు.

Subscribe to:
Comments (Atom)