
"నీకు లౌక్యం తెలీలేదు"
"లౌక్యమంటే?"
"బ్రతకనేర్చినతనం. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో, ఏ గౌరవం ఇవ్వాలో తెలియటం."
"కొత్తగా ఎర్పడే అనుబంధానికి పునాది నమ్మకమే కదా. నేను నమ్మాను. మోసపోయాను. ఇందులో నా తప్పేమిటి?"
"నమ్మకానికీ గుడ్డితనానికి నీకు తేడా తెలీదా?"
"నిజమే. అది తెలీలేదు, గుడ్డిగా నమ్మేసాను."
"పైగా అయిన వారు చెపుతూంటే చెవులు కూడా మూసుకున్నావు."
"చెవులు మూసుకోలేదేమొ. ఇంకా మార్పొస్తుంది, మార్పొస్తుంది అన్న దురాశేమో అది"
"కాదు అది పిరికితనం. ఇదీ అని ఒప్పుకుంటే దానికనుగుణంగా ప్రతిచర్య చెయ్యాలిగా. అది ఇతరులను బాధపెదుతుందిగా. తమరికేమో ఎవరినీ బాధపెట్టడం ఇష్టముండదు అది తమరికి చేటైనా సరే. ఇది మంచితనం అనుకుంటావు కాని ఒకరకం పిరికితనం అని అర్థం చేసుకోవు. నిన్ను నువ్వు మభ్య పెట్టుకున్నావు ధర్మం పాటిస్తున్నాను అని నీ పిరికితనానికి ముసుగేస్తూ"
"నిజంగా అది పిరికితనమేనా? ధర్మాన్ని త్రికరణంగా పాటించాననేగా అప్పుడు నమ్మింది"
"మరయితే ఇప్పుడెందుకు మారావు"
"మారానా?"
"స్వార్థానికి అగ్రతాంబూలమిస్తూ ధర్మానికి తిలోదకాలిచ్చేసావుగా"
"అలా బ్రతకటం నిజంగా ధర్మమేనా?"
"అలా బ్రతకకూడదని నువ్వు అనుకున్నప్పుడు నీకు జరుగుతున్న ఈ అన్యాయాలు నీకు తెలీవుగా"
"ఇవి అంటూ స్ఫష్తంగా తెలీకపోవచ్చు కాని అసలు తెలీక కాదు కదా. లేకుంటే మనసుకంత అలజడి ఉందదు కదా.
ఒకట రెండా నాలుగున్నరేళ్ళ నరకం!"
"కాని నీలో దృక్పద మార్పుకు కారణం ఇవి కాదు కదా"
"నిజమే ఇవి కాదు నాలో దృక్పద మార్పుకు కారణం. అందుకు కారణం లాగి చెంప మీద కొట్టి మరీ, నేను నా అని త్రికరణంగా నమ్మిన వారు, నూరు శాతం నిష్పక్షపాతి అనుకున్న వారు, నన్ను నాకు సుస్ఫష్తం చేయటం కారణం. అదీ నేనీ జనలో మరచిపోని విధంగా."
"తనను తాను అర్థం చేసుకోలేని, నియంత్రించుకోలేని మనిషి పై నీకెందుకంత గౌరవం? ఎందుకంత గురి?"
"నిజమే తనదగ్గరకొచ్చేసరికి, నాలాగే, తప్పటడుగులు పడ్డాయి. అయితే మాత్రం మనుషులనంచనా వేసే శక్తి లోపించినట్టా? ఆ మూల్యాంకన శక్తికి వెరుపెరుగని ఆ నిజాయితీ తోడయింది కాబట్టే తనకంటే విలువలంచనా వేసే షరాబు లేరీ లోకంలో అని నా నమ్మకం. పైగా నేనటే వల్లమాలిన అభ్గిమానం."
"అవునవును ముందొచ్చిన నాలుక్కంటే......."
"ఎవరేమైనా అనుకోండి...సమవయస్కులం, అభిరుచులు, కోర్కెలూ, ఆశలూ, భావాలూ అన్నీ ఒకటే అయినపుడు రక్తసంబంధీకులకంటే దగ్గరయ్యేది వీరేగా."
"నిన్నధః పాతాళానికి లాగినా కూడానా?"
"ఎవరి దృష్టిలో? ఎన్ని శిఖరాలు చూసానో అంత లోతులూ చవి చూస్తున్నా. అది దిగజారటం అని నువ్వనుకుంటే నాకభ్యంతరం లేదు."
"మళ్ళీ గుడ్డినమ్మకమేమో?"
"కావచ్చు కాని నాకు తెలిసిందీ నచ్చిందీ అదే. నా దృష్టిలో ఒక బంధం నిర్మించి కొనసాగించాలంతే ఆ నమ్మకం తప్పదు, ఏది ఏమైనా సరే."
"నీ ఖర్మ అనుభవించు".
అమ్మతో జరిగిన సంభాషణకు అక్షరరూపం.
Image from and belongs to http://blogs.denverpost.com/avs/2008/11/30/post-game-thoughts-observations-random-bs/
No comments:
Post a Comment