మరణమంటే నాకు చాలా భయం. చిన్నప్పుడెంత భయపెట్టేదనీ? రాత్రుళ్ళు ఒకోసారి ఎంత భయమేసేదంటే నిండా ముసుగు కప్పుకుని నాకెంతో ఇష్టమయిన పాటలను, సంఘటలనూ, మనుషులనూ, కలలనూ, ఆశలనూ నెమరువేసుకుంటూ చావు ఆలోచనలనుంచి డైవర్ట్ అయిపోయేలా మెదడుని పక్కదారి పట్టించి ఆ బాధ నుంచి తప్పించుకునే వాడిని. డాక్టర్నే అవుతానని డిసైడ్ అయిపోయింతరవాత ఎన్ని కలలు కనేవాడిని చావును ఆపే మందు కనిపెట్టాలని? కాని చందమామలు, బాలమిత్రలు మొదలయినవి ఉగ్గుపాలతో నూరిపోసి చెప్తాయిగా ప్రతీ మానవుణికీ మరణం తప్పదని....అందుకని ఆ కోరిక తీరే మార్గం నా జీవిత కాలంలో మాత్రం దొరకదని అతి తొందరగానే సెటిల్ అయిపోయాను. మరి నేను చనిపోయింతరవాత ఈ లోకంలో ఉండను అన్న విషయాన్ని ఎలా భరించాలో అర్థం కాక ఇక దాన్ని గురించి ఆలొచించటం వేస్ట్ అని డిసైడ్ అయిపోయి దాన్ని పట్టించుకోవటం మానేసా. ఎప్పుడైనా నిద్రపట్టని రాత్రుళ్ళు చావు భయపెడితే నాకెంతో ఇష్టమయిన నిద్రను నాకు తెలీకుండా అనంతంగా అనుభవించే స్థితి అది అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ గడిపే వాడిని.
ఇక డాక్టర్ను అవటానికి బైపీసీలో ఉన్నప్పుడు వానపాములు చనిపోయినవే ఇచ్చేవారు కాబట్టి వాటిని కొయ్యటానికి ఏమంత పెద్ద బాధపడేవాడిని కాదు. కాక్రోచ్లు కొయ్యాల్సొచ్చినప్పుడు "యాక్"...........యమా అసహ్యం పుట్టేది కాబాట్టి అందులోనూ చావు భయం తెలిసేది కాదు. ఎం బీ బీ ఎస్ మొదటి సంవత్సరంలో అనాటమీలో శవాలను కోసేప్పుడూ చావు అంత భయపెట్టేది కాదెందుకంటే అక్కడ ఉన్న శవాలకూ బ్రతికున్న మనుషులకూ అసలు పోలికే ఉండేది కాదు. కానీ ఫిసియాలజీ క్లాసులో బ్రతికున్న కప్పలను, అదీ ఇంతింత పెద్ద కప్పలను మా ఎదుట తలలో పెద్ద సూది గుచ్చి చంపి మాకు వాటిని తెచ్చి ఇస్తుంటే మాత్రం ఎంత భయం వేసేదో. ఇక నాలుగవ సంవత్సరం మెడిసిన్లో కడుపేదరాలు ఒకతి చివరి దశలో వైద్యం చేయించుకోటానికి మా గాంధీ ఆసుపత్రికి వస్తే తన మర్మావయవాలు జబ్బుతో కుళ్ళిపోతుంటే వాటికి నా సీనియర్ "భాద్యత"గా వైద్యం చేస్తూ "ఇలాటి దానితో కూదా కలిసే వాడు ఉన్నాడంటే నమ్మబుధ్ధి కావట్లేదే" అని తన స్నేహితురాలితో అంటూంటే సమవర్తి నిజంగా సమవర్తి కాదన్న అర్థమయింది. అప్పటినుంచి మరణమంటే ఉదాసీనత, "అలా" మరణించటమంటే అసహ్యం.
పైగా ప్రతి ఒక్క వైద్య విద్యార్థి జీవితంలో (ముఖ్యంగా మన దేశంలో వైద్యం నేర్చుకునే ప్రతి పిల్ల వైద్యుని/వైద్యిణి జీవితంలో) వాళ్ళ తప్పులకు కనీసం ఒక్క మనిషైనా శవంగా మారి అతని/ఆమె స్మృతి పధంలో నిరంతర సాక్షిగా మిగిలిపోతారన్నది అనుభవ పూర్వకంగా తెలిసినప్పటినుంచి నాకు మరణమంటే అలక్షం కూడా. తప్పదు మరి...మేము బ్రతకాలంతే, వాటిని..అదే ఆ మరణాలనే స్మృతులను... మా తరువాతి జీవితాలకు గుణపాఠంగా చేసుకోవటం అలవాటు చేసుకోవటం తప్ప ఇంకే విధంగా గుర్తుచేసుకున్నా బ్రతకలేము....అందులోనూ మనసున్న మనిషులు అసలు బ్రతక లేరు. అలా భయం, అలక్షం, అసహ్యం, నిర్లక్షం, ఉదాసీనత, విముఖత ఇలా ఎన్నో రకాలుగా మరణాన్ని నా జీవితంలోనుంచి బయటకు గిరాటెయ్యాలని ప్రయత్నించాను.
కాని గమంత్తేమిటంటే నేనంత విసిరికొట్టే మరణం నన్ను ఎంత సుతిమెత్తగా తాకి లాలించిందో, ఆ స్పర్శ తాలూకు అనుభూతి ఇంకా ఎంత సజీవంగా నాలో మిగిలిపోయిందో ఇప్పుడు తలుచుకుంటే నిజంగా నవ్వొస్తుంది. గుమ్మడిగారు చనిపోయారన్న వార్త చదివి వృత్తి ప్రవృత్తి ప్రకారం అలవాటయిపొయిన ఉదాసీనతతో చూపులు ముందుకు సాగిపోయినా ఆలొచనలు మాత్రం నన్ను ప్రభావితం చేసిన ఆ మూడు మరణమృదంగాలను మళ్ళీ నెమరువేసుకుంటూ ఆగిపోయింది.
part 2 of 2

గుమ్మడి గారు చనిపోయారా! ఈ విషయం మీ బ్లాగ్ చదివాకే తెలిసిందండి!
ReplyDeleteప్రొద్దున న్యూస్ చూడలేదు.