Thursday, 25 February 2010

God promise.


కరకు పలుకుల   
సమాధి చేస్తే  
ఏకాంతంలో 
వంటరిననుకుని 
జ్ఞాపకాల దుప్పటిస్తే   
కన్ను కానని  
వేలు పోటని
అచేతన లాలిలో 
సులువైన మృత్యువులో 
బ్రతికేస్తున్న నాలో 
ఏదో కదలిక......

వెచ్చని దుప్పట్లో 
మరిగిన రక్తం 
ఫలం తెలీని 
రేపటికై సత్తువనిస్తే
కరుకు పలుకుల
పక్కన పాకి 
టన్నులెత్తకనే 
సమాధి చీల్చే నేర్పు 
వివర్ణంలో చిరుపచ్చ 
చిట్లించింది 
సమాధిని 
పునాది వేసే   
తపమనుకునే 
నైజమిచ్చిన 
జన్మకారకుల
నమస్కరిస్తూ
కైమోడ్పే అంకంగా

అంతరాలలో 
నమ్మకపు అంకురార్పణ 
పెదాలపై పల్లవిస్తే 
పాపం పిచ్చి మనసు  
దూది పింజయ్యింది
"వాటిని చంపెయ్య"మనే 
కరకు స్వరాలు కాక 
కిలకిలధ్వానాల 
ఉషోదయం మళ్ళీ తెచ్చింది  

రేపటి మన బంధం 
ఏ రూపో తెలీదు
నామకరణమేదైనా
"మన ఫలమది" 
అనుకుంటుంటే
గర్వంగా ఉంది 
 
ఇకపై నే కార్చే  
ప్రతి బొట్టూ 
ఆణిముత్యమే సుమా 
ఎప్పటికప్పుడు 
నవమోద విభవానికవి    
తలంబ్రాలేగా  
నవరసాలు పండించే 
నవధాన్యాల అంకురార్పణ 
ఇవాళే చేద్దాం
పక్కని లేకపోతేనేం 
లోనున్నావుగా.
  
పప్పన్నం వండేస్తా 
ఎప్పుడని అడిగే వాళ్ళెందుకు  
నేనూ ఆత్మారాముడూ  
చాలదూ సాక్షం?




కణ్ణా

ఆలోచించటం అంటే మునుప్పరిచయ వాక్యాల పునశ్చరణ కాదని
నమ్మకం అంటే మనస్ఫురిత అన్వయానికి భోతిక సాక్షాలవసర లేదనే ధీమా అని  
తపమంటే వస్తుందో లేదో తెలీని దానికై ప్రయాసలెన్నో ఓర్చే గాట్టి ప్రయత్నమని  

నిర్వచించిన మన బంధాన్నీ నైరాశ్యంతో ఇక అవమానించను. 
ఇక ఈ లేబుల్ వాడాల్సిన అవసరం ఎన్నటికీ రానివ్వను.
 

नौकरी भाग.

नौकरी भाग हैं तो हुए कायर
जाबाजी की कोई कदर नहीं
खुदखुशी में खुशी ढूंढें शायर
ये ज़माने की इन्साफ साकी


छोड़दी घर बार तमन्ना हम ने
छोकरी मार बन निकले साकी
प्यार दी चली तपांचा दिल पे
वार से बच निकलें, मुमकिन नहीं


दिखलाए भी क्या ज़ख़्म
मैदाने इश्क के साकी
औरत हात शिकस्त से
शर्मीली बन, छुपी सारी


शराब खाने के धब्बे जो बने
पहली हार के बनके निशानी
अल्ला कसम अब तक हम
मोहल्ले के थे शाणे साकी


बहुत देख्लिये मंज़र
इस सच झूट की लड़ाई
जंगे सच्चाई की शोर
अब हमें सहन नहीं साकी


बंद कर हर खिड़की
नूर को कर दो दूर
बाहों में जो हमें लें
बची इक माही नींद साकी


अपनी गले लग कर भी
गम तो बेवफा निकली
कूट कूट उस की यादें
दिल में समाई साकी


बस इक कटक इस में साकी
गम की मध् होश हम फिरे
अपनी नसीब की अज़ाब
अपनों को तबादला कर दी.

Tuesday, 23 February 2010

భాద్యతలూ బంధాలూ.....

బంధనాలనిపిస్తాయి
బాధల బందీఖానాలో 
బాదరబందీ భూతమైతే
బోధనలవవూ 
బురదన పునాదులవని . 
  

బొమ్మ

"చాలా రోజులయిపోయింది కదా నువ్వీ ఇంటికి వచ్చి " మిత్రుడిని ప్రశ్నించాడు భాస్కర్

"ఏళ్ళయింది" జవాబు

"మరిన్ని రోజుల తరవాత తను ఇంకా నీ కోసం....." మధ్యలో ఆపేసాడు

"వేచి ఉంటుంది తప్పకుండా...అందుకేగా నాకీ బొమ్మలు పంపింది." గోడ మీద ఉన్న బొమ్మలు చూస్తూ తనకు పోస్ట్లో వచ్చిన వాటి కాపీలను తలచుకుంటూ అన్నాడు భాస్కర్

గోడ మీద ఉన్న ఆ బొమ్మలను తానూ చూసాడు శేఖర్ . ఉన్నవి నాలుగె బొమ్మలు.

మొదటి దానిలొ అందమైన పడుచు అందంగా అలంకరించుకుంటోంది అద్దం ముందు కూర్చుని...పక్కనె గొడ మీద ప్రియుడిది అనుకుంటా ఫ్రేం చేసిన ఫొటొ..అద్దంలో తన ప్రతిబింబం ఆ ఫ్రేం లోని మనిషిని ప్రేమగా చూస్తున్న కళ్ళను చిత్రకారుడు ఎంత అర్థవంతంగా చిత్రించాడో..మొత్తం చిత్రానికి హైలైట్ ఆ కళ్ళలోని ప్రేమే...."చూసావుగా ఆ కళ్ళల్లోని ప్రేమ. ఇంకా నీకు ప్రూఫ్ కావాల తను నన్నెంతగా ప్రెమిస్తోందో చెప్పటానికి " అంటున్న భాస్కర్ను చూస్తూ మౌనంగా ఉండిపొయాడు శేఖర్ "ప్రేమిస్తోంది కాదేమో ప్రేమించింది అనుకుంటా సరైన అనువాదం" మనసులో అనుకున్నాడు.

రొండో బొమ్మ వైపు కదిలాయి అతని చూపులు. అదే పడుచు కాకపోతే ఇంకొన్నేళ్ళ తరవాత. ఇప్పుడు పడుచు కాదు ప్రౌఢ...గంభీరంగా తన ఇంటి పరిచారికలను అటూ ఇటూ పరిగెట్టిస్తూ ఇంటిని శుభ్రం చేయిస్తోంది. తానూ చిన్న ముఖమల్ గుడ్డ పెట్టి అందమైన ఇంకో చిత్రాన్ని తుడుస్తోంది. ఆ చిత్రం పట్టుకోటంలో, ఎంతో సున్నితంగా దాన్ని శుభ్రపరచపూనటంలో తన నైపూణ్యమంతా చూపెట్టాడు చిత్రకారుడు. "నా రాక తెలిసి చూడు తనెలా ఇల్లు శుభ్రపరుస్తోందో... చివరికి ఎప్పడిదో నా ఫోటో కూడా చూడు ఎంత జాగ్రత్తగా తుడుస్తోందో" అంటున్న భాస్కర్ను చూసి "ప్రేమ నిజంగానె గుడ్డిది...లేకుంటే ఆ పక్కన గోడపై ఆ ప్రౌఢ ఇంకొకరిపక్కన సిగ్గుల మొగ్గై నించున్న చిత్రం మసకగా ఉన్నా పెద్దగానే ఉందే అది గమనించవేం రా. పైగా నీ చిత్రపటానికి బూజు దులుపుతోంది అంటే ఏమిటో అర్థం చేసుకోవేం ...." మనసులో ఆక్రోశించాడు భాస్కర్ మిత్రుడు.

మూడొ బొమ్మ వైపు ఎంత చూడొద్దనుకుంటున్నా సూదంటురాయిలా చూపులనాకర్షించిందా చిత్రంలోని సహజత్వం. అదే స్త్రీ ఇంకొంచం వయసయింతరవాత తన ఇంట్లో నల్లటి సోఫాపై దర్జాగా కూర్చుని కింద కూర్చుని చదువుకుంటున్న తన కొడుకును పర్యవేక్షిస్తోంది. ఆ పర్యవెక్షణలో తన కొడుకు భవిష్యత్తంతా ఇప్పటి తన పర్యవేక్షణ మీదే ఆధారపడింది అన్న భావం ఎంత సహజంగా చిత్రీకరించాడో అంత స్ఫష్టంగానూ ఉంది. అస్ఫష్తంగా ఉన్నది ఆమె వెనకాల కనపడుతున్న ఆ ఇంటి యజమాని రూపే."నువ్వనుకుంటున్నట్టు అది నువ్వు వచ్చాక మీ ఇద్దరి కుటుంబం కాదురా అక్కడ చిత్రీకరించినది...టెంత్ ఆనివెర్సరీ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బాబ్రీ మసీదు కూల్చివేతను స్మరిస్తున్న టీవీ స్క్రీన్ అది 2002 అని చెపుతోంది కదా" అని అనుకుంటూ గోడపై ఉన్న కాలెండర్ని చూసాడు "అవును నువ్వన్నది నిజమే ఈ సంఘటన చిత్రీకరించబడింది సరిగ్గా పదేళ్ళ క్రితం " అనింది ఇయర్ 2012.

నాలుగో బొమ్మను చూస్తూ శేఖర్ చెపుతున్న అన్వయాన్ని కాదనటానికి అతనికి కారనం కనిపించలేదు కాని ఎందుకో అది సరి కాదు అని అతని మనసు గట్టిగా చెపుతోంది "చూడు నేను ముసలాడినై వస్తాను కదా ఇరవై ఏళ్ళ తరవాత అయినా తను మాత్రం నేను తనని వదిలి వెళ్ళిన పడుచులానే వచ్చి నాకు స్వాగతం పలుకుతుంది అని చెపుతోందా చిత్రీకరణ అక్కడ చిత్రీకరించినది అంతః సౌందర్యం సుమా...ఎప్పటికీ తరగని అంతః సౌందర్యం" అంటున్న శేఖర్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు.

"అమ్మ రెండేళ్ళ క్రితం బలవంతంగా నన్ను కూర్చోబెట్టి నా పోలికలతో ఉన్న స్త్రీని ఎవరో మగాడికి అందులో ముసలాడికి స్వాగతం చెపుతున్నట్టు ఎందుకు చిత్రీకరించిందో అప్పుడు అర్థం కాలేదు. మీ విశ్లేషణలు విన్న తర్వాత ఆ నాలుగో బొమ్మ ఆర్థం, ఇదిగో తను చనిపోయే ముందు గీసిన ఈ చివరి బొమ్మ పరమార్థం ఇప్పుడర్థమయింది" అంటున్న ఆ పడుచును చూసి ఇద్దరూ అవాక్కయ్యారు. ముమ్మూర్తులా తల్లిని పోలి ఉన్న ఆ అమ్మాయి తల్లెవరో పోల్చుకొటం ఇద్దరికీ కష్టం కాలేదు.

ఎప్పుడొచ్చిందో కాని తమ మాటలు సర్వం వినేసిందా అమ్మయి "సంస్కారం లేకుండా అలా ఇతరుల మాటలు వినేయటం ఏమిటీ " అని కోపం తెచ్చుకోబోతున్న భాస్కర్కు తాము కూర్చున్నది ఆ అమ్మాయి ఇంట్లో లివింగ్ రూంలోఅన్నది గుర్తొచ్చి మిన్నకుండిపోయాడు. శేఖర్ మాత్రం ఇవేమి పట్టనట్టు ఆ అమ్మాయినీ ఆ అమ్మాయి చేతిలోని అయిదో బొమ్మనూ అలాగే చూస్తూండిపోయాడు షాక్ తిన్న వాడిలా.

"నాన్న పోయిన తరవాత అమ్మ గీసిన ఆఖరు అయిదు చిత్రాలివి. ఎందుకంత సడన్ గా అమ్మ ఇక గీయకూడదు అన్న తన నిర్ణయాన్ని మార్చుకుందో మాకర్థం కాలేదు కాని అమ్మమ్మ వాళ్ళింటికి అదే ఈ ఇంటికి వచ్చిన తరవాత ఒక రోజు వచ్చిన లెటర్ అతరవాతే ఆ మార్పు అని మాకు స్ఫష్టంగా తెలుసు. యూకే స్టాంప్స్తో వచ్చిన ఆ ఉత్తరం మీదేననుకుంటా" తమ లగేజ్ పై ఉన్న బ్రిటీష్ ఎయిర్ వేస్ లొగోలను చూస్తూ అడుగుతున్న ఆ అమ్మాయి గ్రాహ్య శక్తిని మెచ్చుకోకుండా ఉండ లేకపోయాడు శేఖర్.

భాస్కర్ చూస్తున్న ఆ అయిదో బొమ్మను తానూ చూస్తూ "మీరొచ్చి ఇంకొకరిని పెళ్ళి చేసుకుని మీ ఇద్దరూ జంటగా నా కన్యాదానం చెయ్యాలి అన్నది ఇక్కడ స్ఫష్టమే కాని ఆ కన్యాదాన శుభ సమయ చిత్రీకరణలో అదే ఇంట్లో ఎవరిదో చితి కాలటమన్న అశుభాన్ని ఎందుకు చిత్రీకరించిందో మాకెవరికీ అర్థం కాలేదు" అంటున్న ఆ అమ్మాయి తల ఆప్యాయంగా నిమిరి "that is my girl. As sentimental as she is practical. ఎంతో సున్నితంగా "నిన్ను ఒకప్పుడు గాఢంగా ప్రేమించాను కాని అది ఒకప్పుడు. నువ్వెళ్ళిపోయిన తరవాత కాలగతిలో నీ చిత్రం బూజుపట్టిపయింది నా మదిలో, ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే నిన్ను తలచుకునే దాన్ని, నాకు పెళ్లయిపోయింది పిల్లలు కూడా, నువ్వు సెంటిమెంటుతో నా కోసం ఇన్నేళ్ళు ఆగినా నేను పరాధీనను కాబట్టి నా జీవితం ముందుకు సాగిపోయింది. ప్రాక్టికల్గా ఆలోచించి నువ్వు కూడా ముందుకు సాగిపోవాలనేదే నా చివరి కోరిక. నువ్వు కళత్ర సమేతంగా నా బిడ్డకు కన్యాదానం చేసినఫ్ఫుడే నా ఆత్మకు నిజమైన శాంతి, మోక్షం" అంటూ నా ఉత్తరానికి చిత్రాల్లో జవాబిచ్చిందమ్మా మీ అమ్మ. ఆ చితిమంటలు తన ఆత్మ విముక్తి అనే శుభాన్ని సూచిస్తుంది కాబట్టే నీ వివాహ చిత్రణలో దాన్ని చేర్చింది. అశుభమేమీ కాదులే" అంటున్న భాస్కర్ ముఖం చూడ లేకపోయారు మిగితా ఇద్దరూ.

Thursday, 18 February 2010

అనంగుడనైపోతా

ప్రేమించింది 
ప్రేమించబడింది 
ఆరోదైతే  
వీటికేం హక్కో
దాని చితి క్రీనీడల్లోనూ
తమ అస్థిత్వం చాటుతూ
జారిన  విలాస
విలాప కీలలు
 
అబ్బా......

మూడో కన్ను తెరవ్వా!

Sunday, 14 February 2010

हाँ खलक में सच थोड़ी अटकी

बूँद बूँद जिस बंजर सींचे
अंगारे उसी में बोये
आप ही से सीखे कोई
याराना हलाल साकी

हाँ खलक में सच थोड़ी अटकी
खातिर आपकी, निगल भी जायेगे
इश्खियाँ हैं शोहर या मालिक नहीं
कनीज पे हर अंजाम लागू  साकी

చుక్క చుక్కేసి నీరెట్టి 
కణకణల విత్తుల్నాటే
సేద్యమంటే నీదేనే సాకీ.
పర్లేదింకో చుక్కేయ్
బీజాలేన్నైతేనేం?

ఔ నేనిట సత్యకంఠుడనే!
రంగుమార్చక వాతాపనిపించేస్తాలే.
వెతలేన్నైనా చెంతనే సురపురి  
ఎంతలయినా కాంతాదాసులే సాకీ.

1 04 40 to 1 14 10 OF
http://videos.videomasti.net/2010/01/31/ishqiya-naseeruddin-shah-vidya-balan-arshad-warsi