Saturday, 17 July 2010
కోనేటిరాయుని చుట్టూ-2 ఎవరు చెప్పేరమ్మ ఈ కొమ్మకూ పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ.......
చిన్నాదానా ఓ చిన్నాదానా ........
నీరెండ స్పర్స చెలి బుగ్గన ప్రతిఫలిస్తుంటే.......
ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై ......
ఏమని వర్ణించనూ...............
కుబ్జకూ కృష్ణ భాగ్యమాయె నీవంతకుమించినవాడవా అన్న పూబాల :-)
గడ్డి పూవుకూ హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు అనుకోరాదూ...
సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు,
నిన్ను మెచ్చిన వాడు నిజము చెపుతున్నాడు..వాడు నీ వాడే
వన్నెలూ, చిన్నెలూ, నీరెండలూ, క్రీనడలూ...జీవితసారమంతా కనపడట్లేదూ?
ఎన్ని వేసవి సెలవులు గడిపామనీ ఈ పూలతో....
మందారం ఎరుపూ, మంకెన పువ్వెరుపూ......
తెల్లారేప్పటికి మంచుదుప్పట్లో ఒదిగున్న గోవర్ధనాల ఆవులింతలూ,
భాద్రపదచవితికి పోటీపడి ఎరుకొచ్చిన పారిజాతం అరుణిమలూ
ఒక్కసారే చూసినా మనసుకు హత్తుకుపోయిన సంపెంగ పూవూ
ఇంతవరకు చూసెరుగకపోయినా ఊహల్లోని మొగలిపూలూ
ఇంటివారు పెంచుకునే సీతమ్మవారి జడ పూలూ,
చెల్లెళ్ళు పెట్టుకున్న బఠానీ చేమంతులూ, కలర్ చేమంతులూ,
ఇవి నిజంగా పూలేనా అని ఆశ్చర్యపోయిన బ్లాక్ రోస్లూ,
అమ్మ పెంచిన మల్లె తీగలూ ......
ఓహ్ గత స్మృతులు ఎంతగా పలుకరించాయో ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటే.
Had a fantabulous time reminiscensing
Subscribe to:
Post Comments (Atom)
పూల కంటే మీ కామెంటూలు బాగున్నాయి. :-)
ReplyDeleteEntho sunnitham gaa unnayi poolu, poo remmallanti mee pada kavithalu.
ReplyDeleteAll India Radio lo Bhakthi Ranjani lo suryudi ni raka rakala poola tho polchuthu vo keerthana analo stuthi analo teliydu gaani vintunte chala haayiga untundhi. voka roju lo Vividha dasa la lo unna suryudi ni vividha poola tho polchi aaa geetham poorthi paatham dori ke laa cheyaru.
Mee lanti poo premikulaku asaadhyam kademo
Ravindranath Nalam
Hyderabad
ravindranath.fca@gmail.com
reminiscensing
ReplyDeletePoola madhy eee padam mullu laa unndi
Ila unte mare poo banthi laa untundemo koncham yochana cheyandi.
Reminiscing