Sunday, 30 October 2011

దీపాలెలుగులో సూడాలన్న కోరికే సిన్నా.....

ఇరగాబూసీ పకపకమన్నాదే సిన్నా 
సిచ్చూబుడ్డీ ఎకసేక్కాలాడిందే సిన్నా
సిటపటమంటూనే కాకరపూవేమో సిన్నా 
సిన్నాబోయిందే సిన్నా 

దానమ్మ బుడ్డీకేమీ దేలుసే సిన్నా 
ఇరగాకాసీన ఎలుతురూలోన సిన్నా 
బోసీపోయినా నీ మెడనూ సిన్నా 
సూపీ సూపీ ఎకసేక్కాలే సిన్నా 

కాకరపూవేమోనె  సిన్నా 
మనసెరిగిందే సిన్నా 
సిటపటమంటూనే సిన్నా
నీ మెడనొజ్రాలొదిగిందే సిన్నా 
నీ మెడనొజ్రాలొదిగిందే సిన్నా.  

No comments:

Post a Comment