Saturday, 19 May 2012

ధర్మమంటే 6

"ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః"

ఈ స్మ్రుతి వాక్యం ప్రకారం ఇహ లోకంలో పరలోకంలో ఆనందం ఇచ్చేది "చేయటం" ధర్మమట. ( ఈ వాక్యానికి త్రిదండి స్వామీ వారి వివరణ ఇక్కడ చదవండి)

ఇది ఒక జీరో సం గేం లేదా ప్రిసనర్స్ డిలేమాను గుర్తు చేస్తోంది. (see prisoners dilemma) and (zero sum game)

"నాకు ఇష్టమైన పనులను చేయొద్దు" అని చెప్పటమే ధర్మ వాక్యంగా ఎరుగుదును ఇప్పటివరకు. చిన్నప్పటినుంచి అనుకునే వాడిని "ఎందుకు మంచి/ధర్మం ఎప్పుడూ నాకు ఇష్టమైన పనులను చేయొద్దు అనే చెపుతుంది" అని.

ఈ స్మ్రుత్యర్తాన్నీ నా వైయుక్తిక అనుభవాన్ని జోడిస్తే ఇక్కడ ధర్మం మన సాంఘిక జీవనం ఒక జీరో సం గేం అని చెపుతూ అందులో "అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే" ఆప్టిమల్ సొల్యూషన్" ఏమిటో ఆ మార్గాన్ని అవలంబించమని చెపుతుంది అనిపించింది.

గాంధీగారు అన్నట్టు ప్రకృతిలో అందరి అవసరాలకు మించి సంపదుంది కాని ఒక్కడి లోభత్వాన్ని దురాసనూ తీర్చే సంపద ఈ ప్రపంచం మొత్తం మీద లేదు అన్నది చెపుతోంది అనిపిస్తుంది.

అందుకే
ధర్మమెపుడూ "నియంత్రనే" చేస్తుంది.
అందుకనే ధర్మానుస్థానం కష్టం.




స్మ్రుతి వాక్యాన్ని పరిచయం చేసిన మానస గారికి ధన్యవాదాలు.

No comments:

Post a Comment