Monday, 6 October 2014

ఏ అదృష్టమో

ఏ అదృష్టమో
శాపమయ్యీ
ముద్దును
మోక్షంగా రాసిపెట్టింది.
ఇంతలో.....
క్షణభంగురమైన
ఓ పాము తినేసింది!!!
మరో చొక్క తొడిగేదాక
పాపం కప్ప!!!

***
ప్రవాహమై 
పరిగెట్టే వాహిని
కబంధ హస్తాల మధ్య బంధీ
కడుపున దాచిన చైతన్యమంతా 
అంతెత్తునుంచి దూకైనా సరే
మర చక్రాల చిట్లైనా సరే
కట్టిన పక్కదారుల పొడవెంతైనా సరే
పరుగు పరుగున
అస్థిత్వ కోల్పోతకు
తప్పక వస్తుంది.
కలిపేసుకున్న సాగరుడు
"క్షీరసమం క్షారమయ్యిందీ"
అనెవరేమన్నా అనెవరేమనుకున్నా
అక్కున దాచుకుంటాడే కానీ....
ఉలకడు పలకడు.
అస్థిత్వం వదిలేసుకోవాలో
గుంభనంగా కలిపేసుకోవాలో
ఎవరిది ఏ ఇదో?

No comments:

Post a Comment