కృష్ణా
ఎపుడూ అనిపించలేదా
ఒక్కరు
ఒక్కరే ఒక్కరు
నీకు ప్రీతి కలిగే వారు
ఉండుంటే బావుంటుందని
అవునేమోలే అదే యోగమంటేనేమో
జగత్తంతా ద్వైతమే అయినప్పుడు
ఒకరూ ఎనిమిది మందీ పదహారు వేలమందీ
తేడాలెక్కడ కదా?
నాకింకా ఆ అద్వైతం అలవడలేదయ్య
ఊహలంటున్నారు
ఫాంటసీ బ్రతుకంటున్నారు
పిరికివాడినంటున్నారు
చివరికి
ఓ గాటిన కట్టేస్తున్నారు
ఒకరిని ప్రెమించగలగటం
కోరుకోకుండా వారికే అంకితం అవటం
ఆడతనమేనేమో!!!
అయితే నేను ఆడతనాన్ని అంగీకరిస్తున్నా
అవును నేను సగం ఆడదానినే
కృష్ణా
పరాయినయిపోతున్నానురా
కృష్ణా
పరాయినయిపోతున్నాను
ఎపుడూ అనిపించలేదా
ఒక్కరు
ఒక్కరే ఒక్కరు
నీకు ప్రీతి కలిగే వారు
ఉండుంటే బావుంటుందని
అవునేమోలే అదే యోగమంటేనేమో
జగత్తంతా ద్వైతమే అయినప్పుడు
ఒకరూ ఎనిమిది మందీ పదహారు వేలమందీ
తేడాలెక్కడ కదా?
నాకింకా ఆ అద్వైతం అలవడలేదయ్య
ఊహలంటున్నారు
ఫాంటసీ బ్రతుకంటున్నారు
పిరికివాడినంటున్నారు
చివరికి
ఓ గాటిన కట్టేస్తున్నారు
ఒకరిని ప్రెమించగలగటం
కోరుకోకుండా వారికే అంకితం అవటం
ఆడతనమేనేమో!!!
అయితే నేను ఆడతనాన్ని అంగీకరిస్తున్నా
అవును నేను సగం ఆడదానినే
కృష్ణా
పరాయినయిపోతున్నానురా
కృష్ణా
పరాయినయిపోతున్నాను
No comments:
Post a Comment