పున్నమి రేయిలో
నీటిలో
నేను.
పిల్లతెమ్మెరొక్కటి
సుతారంగా నిమిరినపుడు
భావోద్వేగ తరంగాల
ముడతలు....
ఝంఝమా మారుతం
లాగి పెట్టి కొడితే
కిందడుగంటిన మకిలి...
నీటిలో
నేను.
పిల్లతెమ్మెరొక్కటి
సుతారంగా నిమిరినపుడు
భావోద్వేగ తరంగాల
ముడతలు....
ఝంఝమా మారుతం
లాగి పెట్టి కొడితే
కిందడుగంటిన మకిలి...
ఎదురునున్న నేను నేనా
నీటిలోని నేను నేనా
నీటిలోని నేను లేపోతే
నాకో అస్థిత్వముందా?
పిల్లతెమ్మెరలూ, ఝంఝమా మారుతాలు
నన్ను నిర్వచిస్తాయా?
మరి పున్నమి రేయో?
దాని స్థానమేమిటి
నాలో?
నీటిలోని నేను నేనా
నీటిలోని నేను లేపోతే
నాకో అస్థిత్వముందా?
పిల్లతెమ్మెరలూ, ఝంఝమా మారుతాలు
నన్ను నిర్వచిస్తాయా?
మరి పున్నమి రేయో?
దాని స్థానమేమిటి
నాలో?
పున్నమున్నందుకు నేనున్నానా?
కోనేటి నీటి వలన నేనా?
ఎదురుగ నిలుచున్నది నేనా?
కోనేటి నీటి వలన నేనా?
ఎదురుగ నిలుచున్నది నేనా?
నేనేమిటో నాకు తెలిపే పున్నమి నా అస్థిత్వాని రూపుమాపే కెరటాలకూ తల్లి. నన్ను మాయం చేసే అమావశి నన్ను మాయం చేసే తరంగారిహనతకి. ఎవరు నా నెచ్చెలి? ఎవరిని నే మెచ్చాలి?
తెలియటం లేదు నాది పురోగతో లేద శ్లేష్మంలో పడిన ఈగ గతో. సందిగ్ధత అర్థమవుతున్నది. సంఘర్షణా ఎఱుకే. సంస్కారాలవశేషాలేమోననొకవైపు, సోమరినై సాధనాలేమియోనన్న సందేహమోవైపు. లాంతరు పట్టి సరయూ నది ప్రవేశ రహదారి చూపే గురువేడీ? మనసూ,భూమీ వ్రక్కలవుతేకానీ, దశసహర్ష,దశశతాణీయంటూ పరులకొరకు చెరననుభవిస్తేగానీ శాప విమోచనానికీ యొగనిద్రకూ అవకాశం రాదు కదా?
ఈశ్ వరా...
శం భో...
శం కరా...
ఆ ది యోగీ!!!
శం భో...
శం కరా...
ఆ ది యోగీ!!!
No comments:
Post a Comment