కష్టపడి వ్రేళ్ళూనితే
జడత్వమన్నారు
సరేనని సంకెలలు తెంచుకుంటే
గాలివాటుతనమన్నారు
గొడవెందుకని
రాగధ్వేషాలొదిలేయబోతే
మనుషులంటే నిర్లక్ష్యమంటున్నారు
ఇంకేమి చేస్తానో
ఇంకెన్ని నిర్వచనాలో
తోలు తిత్తినిండు
అస్థి రక్త మాంసాలతో
కంటికగుపడని
మనొ బుధ్ధి చితాహంకారాలతొనూ
ఇంకెన్ని విశ్వద్దర్శనాలో
జడత్వమన్నారు
సరేనని సంకెలలు తెంచుకుంటే
గాలివాటుతనమన్నారు
గొడవెందుకని
రాగధ్వేషాలొదిలేయబోతే
మనుషులంటే నిర్లక్ష్యమంటున్నారు
ఇంకేమి చేస్తానో
ఇంకెన్ని నిర్వచనాలో
తోలు తిత్తినిండు
అస్థి రక్త మాంసాలతో
కంటికగుపడని
మనొ బుధ్ధి చితాహంకారాలతొనూ
ఇంకెన్ని విశ్వద్దర్శనాలో
No comments:
Post a Comment