మీరూహకొచ్చేసరికి "ఉత్తరాలంటే?" అనే పరిస్థితి, తెలుసు.
ఆణిముత్యాలని దాచుకున్నా, చాదస్తమని పారేసుకున్నా...మీ ఇష్టం.
ఆణిముత్యాలని దాచుకున్నా, చాదస్తమని పారేసుకున్నా...మీ ఇష్టం.
మీరో వరమర్రా. పెద్దాళ్ళమనుకునే మాకు మా పిల్లతనాన్ని నేర్పించేస్తారు. ఏం పెరగలా అని ఎంతగా అనేస్తారో.
లేకుంటే, ఎందుకింత ఆనందమర్రా?
"నాన్నాచూడు ముసలమ్మా ఎలా డాన్స్ చేస్తోందో" అని చిన్ని ఎమోటికాన్లకు సంబరపడిపోతుంటే ఎవరెస్టు నువ్వు కాదు తల్లీ ...ఎక్కేది నేను. ఆ ఆనందపు శిఖరి నీకింకో ఇరవై ముప్పై ఏళ్లకు కానీ తెలీదు,
అదేదో ప్రపంచ వింతను మొదటి సారి చూస్తున్నంత ఆశ్చర్యమూ ఏకాగ్రతా.....బుజ్జోడా, నీ కళ్ళల్లో కనిపిస్తే............ఆ సంభ్రమాశ్చర్యాలు నేననుభవిస్తే .......చివరికి నిన్నంతగా ఆకట్టుకున్నది -ఓ చిన్ని ఫోన్లో ఎవరో అపరిచితుడు ఎన్నో వేల మైళ్ళావల నుంచి- అని అనిపించేసరికి ...........ఆ ఇవి ఇబ్బడి ముబ్బడి అవటం మరి నాకొక్కడికేగా అర్థమయ్యేది.
No comments:
Post a Comment