ఎటు చూసినా,
ఈ మధ్యనే
అవుపిస్తూ.
అవీ విసిగిపోయాయనుకుంటా
పాతకాలంలా దాగుండటం లేదు.
శకలాలను అతికించుకుంటూనే అయినా
బహాటంగానే తిరుగుతున్నాయి!!!
పగుళ్ళూ అతుకుళ్ళూ కనీపించేస్తున్నా.
మరంతే కదా
ఒకప్పుడైతే
వారానికో మాసానికో
అతికించుకోవాల్సొచ్చేదేమో.
ప్రభంజనం వచ్చెళ్ళిపోతే సరే.
ఇలా తరాలపాటుంటే
ఎన్ని సార్లని
పగుళ్ళనూ, అతుకులనూ,
తెల్లకోటుల్లో దాచుకుంటాయి?
#beinghuman
#thankyouwarriors
#poetry
#నాకవితలు
#భావకుడన్
No comments:
Post a Comment