Friday, 23 December 2022

బ్రహ్మయ్య!!!

గాయపడ్డావా

వర్షంలోని చెట్టూ

నింగికెగసిన ఎదుగుదలే 

శాపంగా


తెలుసుగా

గగనంలో ఇక్కట్లు

అంతెందుకెదిగావు 

పిడుగు ప్రశ్న


ఏ రెండు పిడుగులూ

ఒకే గూడునెరుపవంటూ

అత్యాశ దీపాన్నెట్టుకున్నావా

అపహాస్యం గొంతులో


కాలిపోతావు అన్నానుగా

నీ దరికొస్తూ...నే

ఎప్పటివో చూసుకో సంకెళ్ళూ

పెంచిన వ్రేళ్లను చూపిస్తూ

అసహ్యంగా అసహనంగా 

 

"మౌనమే శరణ్యమా?"

భూమిలో తో కలిసిపోతూ

పిడుగు ఆఖరి మాటలు


మోడియై 

నలుపెక్కిన కాయంతో

తిరిగి ఊర్ధ్వముఖమైన చెట్టు

తిరిగొచే పిడుగుకై

కుదురులేని తనమెంత చేటో పాపమంటూ


గడ్డిమొలక కాకపోవటం తన తప్పు కాదనుకుంటూ, పైకెదగటమూ, దేన్నైనా అక్కున చేర్చటమూ... అన్నీ తన  అస్థిత్వమనుకుంటూ....అలా నిలబడిపోయిందా చెట్టు, వ్రేళ్ళను గర్వంగా చూసుకుంటూ.  


చలనమూ, వేగమూ, తాడనమూ, పీడనమూ.. మరి నా అస్థిత్వాలే, నేనేం చేసేది ..మాయమవుతున్న పిడుగు, అవశేషానికి కొంత కుములుతూ.  


 


 







No comments:

Post a Comment