Thursday, 27 February 2025

ఎంత నలిగిందనీ మనసు


వేరెవరో మోస్తున్న పల్లకీలో నువ్వు
అదీ అందంగా నవ్వుతూ, ఆనందంగా
నిన్ను దోసిళ్ళలో పాపలా చూసుకుంటూ అని పిచ్చిది
మనసు మూలగిల్లింది

నేననుగమిస్తున్న సిరి
మందహాసం చేసింది
అప్ప చెల్లెళ్ళమే
మనసలా మూలిగినా
పర్లేదులేనంది

అవసరాలను
ప్రవృత్తిగా తీర్చలేనంటూ
నను చూసి తీపి చిరునవ్వుతో నువ్వు

అమ్మా సాహితీ క్షమించు
ఇంకొకరిలో తో నీ కళ చూసి కుళ్ళుకున్నా
మనసింకా నీదేనని చెమ్మతో చెప్పించావు
భాద్యత నివురు కప్పిందంతే చల్లబడలేదన్నావు


భావకుడన్
#ప్రవృత్తి
An Ode to Jealousy -- reminding me of me.
......చామా గారి కవితలు చదివి ఈర్ష్యతో

No comments:

Post a Comment