Saturday, 7 February 2026

You were always such a nostalgist.

మెలకువతోనే ఎదో స్పర్శ

ఎప్పటిదో తడి గీతం

వానాకాలపు చిహ్నాలన్నీ

మరిచిపోయావు నేస్తమంటూ కౌగిలించేసుకుని

ఉక్కిరిబిక్కిరి చేస్తూ


దానిమ్మరి ఆకు నుంచి రాలిపడే చినుకులూ

కమ్మటి ఆ మట్టి వాసనా

అవును బురద భయం కూడానూ

ప్లాస్టిక్ కవర్ల రైన్ కోట్లూ

చెట్ల కిందికెళితే నేస్తాలు రాల్చి పారిపొయే చినుకులూ

కాగితం పడవల వాగులూ

కారం నిమ్మకాయ పులుముకుని 

మొదటిసారి తిన్న మొక్క జొన్న కంకీ

ఉరుములకు పిడుగులంటూ భయపడే అమ్మా 


ఏ అంతరాళ్ళోంచి వచ్చిందో ఆ స్పర్శ దశాబ్దాల తరవాత.


విడిచొచ్చిన మాతృభూమి కళ్ళదా ఆ ఆరోపణ?

అపరాధ భావన నిండిన గుండెల ప్రతిధ్వనా?

చిత్తవృత్తుల మహిమంటూ పతంజలి బోధిస్తున్నా

ప్చ్ ....

#భావకుడన్ 



No comments:

Post a Comment