Thursday, 14 February 2008

తను కన్న కూతిరిన్పెండ్లి యాడుతున్న తన పతిని చూసి నా సతి ముదము చెందె

సమస్య
తాను కన్న కూతురుని పెండ్లియాడుతున్నతన పతిని చూచినా సతి ముదము చెందేన్.

నా పూరణ
కంటి న్నవమాస తపఫ్ఫలితమున్నాకోసగు నా యత్త బాధ
న్కంటి న్నిరువది మూడేళ్ళ కష్ట ఫలమున్వీడు నా మామ
న్కంట నీరు నిండ చూడ తను కన్న కూతిరి
న్పెండ్లి యాడుతున్న తన పతిని చూసి నా సతి ముదము చెందె
న్నంచు తన బాధన్వీడి సంతసమునున్న నా బావ
న్గంటిన్వీరెల్లరి ముద్దుల పట్టియగు నా సతి గండ్ల దుహ్ఖానంద భాష్పము
న్గంటి లోటు నీకున్దెలియనీయనంచు మనము
న్పట్టితి ప్రతిజ్ఞ నాయిందు వదన వదనంజూచి.





పదవిభజన

కంటిన్ నవమాస తపః ఫలితమున్ నాకు ఒసగు నా అత్త బాధన్,

కంటిన్ ఇరువది మూడేళ్ళ కష్ట ఫలమున్ వీడు నా మామన్-కంట నీరు నిండ చూడ కన్న కూతిరిన్ ,

"పెండ్లియాడుతున్న తన పతిని చూసిన ఆ సతి ముదము చెందేన్" అనుచు తన బాధన్ వీడి
సంతసమునున్న నా బావన్ కంటిన్,

వీరెల్లరి ముద్దుల పట్టియగు నా సతి కండ్ల దుహ్ఖానంద భాష్పములన్ కంటి,

"లోటు నీకున్ తెలియనీయను" అనుచు మనమున్ పట్టితి ప్రతిజ్నన్ ఆ/ (ప్రతిజ్ఞ నా )ఇందువదన వదనం చూచ్చి.





సరదాగా మేము కొంతమంది సాహిత్యోభిలాషులం చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ సమస్యా పూరణం అన్న మా ఆర్కుట్ కమ్యూనిటీ. అందులో నా తోలి ప్రయత్నమిది

2 comments:

  1. ప్రతివంశిని12 October 2008 at 11:57

    భావకుడన్ గారు, నాకు కొంచెం అయోమయం గా ఉందీ పూరణ ! కొంచెం అర్థం చెప్తారా ?
    మామ కన్నా కూతురిని ( భార్య ) పెళ్లాడుతున్న తన పతిని ? ( ఎవరి పతి ? ) చూసి నా సతి ? ( ఎవరి సతి ? )ముదము చెందె
    చెందె
    న్నంచు తన బాధన్వీడి సంతసమునున్న నా బావ

    క్షమించండి, నాకు బోధ పడలేదు ! ఇక్కడ బావ సతి ఆ ? చెందేన్నంచున్ అంటూ బావ తో లింక్ పెట్టేసారు ... కొంచెం వివరించగలరా ?

    ReplyDelete
  2. ప్రతివంశిని గారు,

    పద విభజన టపాకు జతపరిచాను చూడ గలరు. ఇంక సంశయాలు ఉంటే అడుగ గలరు.

    ReplyDelete