నా మేన కోడలు నేర్వదొడంగే "అ ఆలు"
నా చెల్లి ముద్దుగ నేర్పగ తాను అనక "చాలు"
దిద్దసాగే పలకపై మ గుణింతం "మె, మేలు"
అవి చూపుచు పలికె తాను "నేనూ లాచాను........చూలు, చూలు"
"తెలుగు కవిత" అనే గుంపులో తెగ రెచ్చి పోయి నేను కెలికిన కైతలు ఇవి. సమస్య ఇచ్చేవారు నాలుగు పదాలు ఇస్తే వాటిని, వారు ఏవైనా నియమాలు పెడితే ఆ నియమాలకు కట్టుబడి పద్యం చెప్పటం దత్తపది పూరణ ఉద్దేశ్యం. అవధానాలలో ఇది ఒక భాగము ఆట.
No comments:
Post a Comment