సగభాగి మెడని పసిడి ధీటుగ,
జగమెరిగిన జంగముడాడే ఢమరుక లయగ
నగపుత్రి తనువూగ నాతడి తోడుగ.
"తెలుగు కవిత" అనే గుంపులో తెగ రెచ్చి పోయి నేను కెలికిన కైతలు ఇవి. సమస్య ఇచ్చేవారు నాలుగు పదాలు ఇస్తే వాటిని, వారు ఏవైనా నియమాలు పెడితే ఆ నియమాలకు కట్టుబడి పద్యం చెప్పటం దత్తపది పూరణ ఉద్దేశ్యం. అవధానాలలో ఇది ఒక భాగము ఆట.
బావుంది, ఇది ఏ ఛందస్సులోనిది?
ReplyDelete