Saturday, 21 June 2008

"జాగ్రత్త మిత్రమా"

మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??
మనసా..తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

తోడుగా నిలవాలంటే.. నమ్మకం కుదరాలి

నమ్మకం కుదరాలంటే.. ప్రేమ వికసించాలి

ప్రేమ వికసించాలంటే.. చనువు ఏర్పడాలి

చనువు ఏర్పడాలంటే.. సఖ్యత పొందాలి

సఖ్యత పొందాలంటే.. పరిచయం కావాలి

పరిచయం కావాలంటే.. ఆకర్షింపగలగాలి

అందం లేని చోట ఆకర్షణ లేదు..

నీ అందం వరకూ చేరాలంటే నా అందం తొలి మెట్టు!!

పిచ్చి మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_7515.html

"జాగ్రత్త మిత్రమా"

చెత్తకుండిలో మనసు

అబ్బాయిల బెరుకు

సంసారపు సొగసు

దానిలో ఒడిదుడుకు

తెలిసిన వో మనసూ

"అందం చూసే వాళ్ల కళ్ళల్లోనే"

మరిచావే ఈ మాటను

చిన్నబుచ్చకు నిరీక్షణను

అభిరుచులు కలిసిన తొడు

బంగారానికి తావి అద్దేను

అది లేని జత కూడేవా

పిచ్చొని చేతిలో మొగలి పువ్వేనూ

సామాజికతకు, అధైర్యానికీ,

నిరాశకూ నిస్పృహకీ

తల ఒగ్గి సర్దుకుపోయావా

జీవితమంతా అంతేనూ

మన కనకపు విలువను

కొలిచే కంసాలి తప్పక ఉండేను

కావలసినదంతా

తన కొరకు వేచి చూసే గుండేనూ

కాదని సర్దుకు పోయావా

జీవితాంతం ఇక అంతేను

విసుగు చెంది ఆపావో

"సగటు మనువు"లో పడ్డట్టే

స్ఫందించే మనసూ

అది పొందే భావుకత

ఇవన్నిటికీ "సగటు మనువు"

కర్కసమైన గొడ్డలి పెట్టే

మీకు నచ్చితే వ్యాఖ్యగా పెట్టుకోండి లేదా మీకు ఇచ్చే చిన్న సూచనగా తీసుకొని వదిలేయండి.

2 comments:

  1. mee kavita pai naa vyaakhya.. kaadu.. kaadu .. O Tapaa..

    http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_21.html

    ReplyDelete