ఏమిటి వీరికి తెగులు?
దేనికై వీరికి దిగులు?
"తెలుగు భాషా ఉద్యమం" అరిచేవారిలో
ఆచరించేవారెవరో రమ్మను
-
అసలే సర్కారు బళ్ళు
నీట మునిగిన ఉప్పు మూటలు
గోడలు మాత్రమె ఇన్నాళ్ళు
చదువులు చూరెక్కి ఎన్నో ఏళ్ళు
-
ఇన్నేళ్ళకు సర్కారోల్లు
ఆంగ్లములో చేబుతామంటే
ఊరుకోవేం మీ నోళ్ళు?
పనిలేక తిరిగే చచ్చినోల్లు
-
మీ పిల్లలకు కాన్వెంటులు, AB లు
బడుగోల్లకేమో మీ భావుకతల సిలువలు
ఇదేనా మీ రీతి?
ఇదేనా మీ నీతి?
-
ఇజాల గూర్చి, నిజాల గూర్చి
కబుర్లు దంచే బోర్డు రూము వక్తలు
తెలుగు తల్లి అనుంగు భక్తులు
రియాలిజము మర్చేరు పూర్తీ
-
తెలీదా తెలుగు చదువుకాదరణ
నేటి ఉద్యోగాటలో నిండు సున్నా
నేటి సినీ నాయిక ఒంటిపై బట్టకన్నా
అది తక్కువేనన్నా
-
మా మానాన మమ్మోదిలేయ్
నీ భాషాభిమానపు బరువు నాకోద్దోయ్.
జీవనోపాధికి పనికి రాదుకనుక మాతృభాష అనవసరం.. practical గా అనిపిస్తున్నా ఏకీభవించలేకపోతున్నా!! భాషను బ్రతికిద్దామని కాదు.. మన బ్రతుకును మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుందని. బాగుపడ్డ దేశాలన్నీ "ఇంగ్లీష్" పై ఆధారపడడం లేదు, తమ భాషా మాధ్యమంగా నేర్చుకున్న విద్యతో వింతలు సృష్టిస్తున్నారు.
ReplyDeleteరేపే కొరియన్ , జర్మన్, జపనీస్ "హవా" మొదలైతే.. అదే చదవాలి, అందులోనే చదవాలి అంటే.. మనకో భాష ఉండీ ఏం ప్రయోజనం?? Even at Ph.D level why Germany mandates the language??
ఇదేదో ఆవేశంతో రాయటం లేదు.. తెలుగు మాట్లాడితే ఎండలో నిలుచోబట్టే స్కూల్లో చదివాను.. పదేళ్ళూ!! ఇప్పుడు ఏ భాషకూ కాకుండా పోయాననిపిస్తుంది. ఒక టపా చదివితే చాలు.. వారు తెలుగు మీడియమో కాదో తెలియడానికి. మనిషి అనుకునే ప్రతీ ఆలోచనా, మాటల్లోకి రాగలగాలి.. ఆ మాట ఏదో ఒక భాషను ఆశ్రయించాలి. కొన్నింటిని చూడడమే, ఫీల్ అవ్వడమే కాని.. వాటిని అటు తెలుగులోనూ.. ఇంగ్లీషులో పెట్టలేని అశక్తత ఉంటే గాని నా భాద అర్ధం కాదు. :-( The medium of education should be in mother tongue.. if that happens to be Telugu, so be it!!
ఈ విషయం ఈ మధ్యకాలం నన్ను బాగా కలవరం పరుస్తుంది.. సమయానికి మీరు అదే రాశారు!! hope it turns out to be the platform to really think about such an imp issue.
కంటెంటు సంగతి ఏమైనా మీ ఎక్స్ప్రెషను బావుంది.
ReplyDeleteThats fine.. take your time. No hurry!!
ReplyDeleteభావకుడన్ గారు,
ReplyDeleteఅందుకొనండి. అభినందన మందార మాల.
బొల్లోజు బాబా
ప్రభుత్వం, దాని ఆలోచనలు గురించి కాదు ఈ వ్యాఖ్య.
ReplyDeleteపూర్ణిమ గారిని మీరు అడిగిన ప్రశ్నకు జవాబు: ప్రవాసాంధ్రులు చాలా మంది, తమ పిల్లలకు తెలుగు నేర్పిన వారున్నారు, నేర్పిస్తున్నవారున్నారు.
" అమ్మా నాన్నలు చదివిస్తే చదివి, కడుపులో చల్ల తిరగకుండా గదుల్లో కూర్చుని పని చేసుకొనే మనలాటి వాళ్ళకు ఇవి నిజంగా చాల సులువు చెప్పటం. కాని ఆలోచించమంతున్నాను."
"ముత్యాల రాజు" ఎవరు? జ్యోతిర్మయి ఎవరు?ఎలా చదువుకున్నారు? వారు తెలుగువారు. వారి తల్లితండ్రులు ఎయిర్కండిషన్డ్ గదులలో బ్రదుకలేదు.
"...ఆకలి, పేదరికం, అప్పుల బాధ ఇలాటివి అంటే తెలుసో లేదో, అవి చాలా భయంకరమైనవి." రోత. అసహ్యం. జుగుప్స. భయం.
ఆంగ్లం తెలియకుండా ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎవరూ జీవించడం లేదా?
తెలుగులో కలలుగంటూ, తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో ఆలోచిస్తూ చాలా మంది తెలుగు వారున్నారు.
తెలుగులో పనిజేసుకుంటూ చక్కటి, సుఖమయ జీవితాన్ని అస్వాదిస్తున్నవారున్నారు.
మీకు ఆంగ్లం కావాలి. దానితో పాటు వచ్చే కొన్ని ఆకర్షణలు కావాలి. అది మీ గమ్యం, మీ జీవిత లక్ష్యం.
అది వారి గమ్యం, వారి జీవిత లక్ష్యం!
@భావుకుడన్ గారూ
ReplyDeleteఈ క్రింది లంకె చూడగలరు
http://parnashaala.blogspot.com/2008/06/i-think-in.html
అవకాశాన్ని తీసెయ్యమని అనలేదు.
ReplyDeleteపైగా నేనడిగిన ముఖ్యమైన ప్రశ్న--ఇలా చెప్పే మీరంతా తెలుగు మాధ్యమపు పాఠశాలల్లో వేస్తారా మీ పిల్లలను? లేదు-ఖచ్చితంగా వేయరు, వేయకూడదు కూడా. ఎదుకంటే తెలుగు ఖచ్చితంగా నేర్చుకోవాలి, కాని అది ఒక్కటే నేర్చుకోవాలి/ లేదా అందులోనే మిగితా అన్ని subjects నేర్చుకోవాలి అనటం మంచిది కాదు.
"..అనటం మంచిది కాదు."
అంగీకరిస్తాను.
@నెటిజన్ & వేణూ, దయచేసి ఈ లంకెను చూడగలరు
ReplyDeletehttp://parnashaala.blogspot.com/2008/06/i-think-in.html